గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2016, శుక్రవారం

మీకందరికీ 2016 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
మీకందరికీ 2016 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.
ఆది మధ్యాంత రహితయై యలరు జనని 
కనుల దోషంబులను బాపి, కాన వచ్చె.
దుష్ట సంఘాతములనెల్ల తూలఁ జేసి,
శిష్ట సంరక్షణార్థమై చేరి నిలిచె.
అమ్మ అనుగ్రహాన్ని అంది పుచ్చుకొన్న మీరంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకొంటున్నాను.
ఇక కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లుఆ జగజ్జననిని 
తల్లీ నిన్ను దలంతు నీ పదములన్ ధ్యానింతు. కీర్తింతు నీ
మల్లీ స్వాదు మరంద తుందిల లసత్ మాధుర్య భావమ్ము సం
పల్లీనుభవంబు తల్గుటెదలంబండింతు, నిండింతు నీ

ఫుల్లాబ్జాక్షములందు కాంతులిటులే పూర్ణేందు బింబాక్షరా.
అని ప్రార్థిస్తూ, 
ఆంధ్రామృత పాఠకాళికి శుభాకాంక్షలు తెలియఁ జేశారు.
వారికి నా ధన్యవాదములు.
శుభమస్తు.
జైహింద్.
Print this post

2 comments:

Zilebi చెప్పారు...


"హిరణ్య వర్ణాం హరిణీం !


నూతన సంవత్సర శుభాకాంక్షల్ !

జిలేబి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అమ్మవారు కన్నుల విందుగా ఉంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.