గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జనవరి 2016, గురువారం

భారత గణనాధ్యాయి . . . శ్రీ పుత్తా పుల్లారెడ్డి.

జైశ్రీరామ్.
ఆరులారా! ఈ రోజు ఒక గంట క్రితం శ్రీ పుత్తా పుల్లారెడ్డిగారు, శ్రీ గుత్తి చంద్రశేఖర రెడ్డి గారు. మా గృహానికి వేంచేసియున్నారు.
పుల్లారెడ్డిగారు ఒక రిటైర్డ్ ఇంజనీర్.75 సంవత్సరముల ప్రాయము వారు.
వీరు తన పదునైదవ యేటనుండియు భాసతమునాసక్తితో పఠించుట వ్యాసంగముగా కలవారు.
ఒక పదిహేనేళ్ళ క్రితమునుండియు వీరు భారతముపై పరిశోధనాత్మక వ్యాతములు, గ్రంథములు వ్రాయుచు భారతేతిహాసమునకు సంబంధించిన అనేక అంశములు మనకు సులభము చేసియుండిరి.
వీరికి భారతములో వచ్చిన సందేహములకు దిగ్దంతులైన పండితులు కూడా తీర్చలేకపోవుచుండుటను చూడ వీరి నిశిత పరెశీలనా సక్తి మనకర్థము కాగలదు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ఆంధ్ర భారతమును పరిశీలించి, సహస్రాధికముగా ఉన్న దోషములను సప్రమాణికముగా వారి ముందుంచి, వారిని అవ్వాక్కులను చేసిరి.
వీరి వ్రాసిన ముద్రిత, అముద్రిత గ్రంథములు వారి చేతివ్రాతలోనే మీరు తెలిసికొనగలరు.

మ. లలితోన్మేదుర భాషణా చతుర!పుల్లారెడ్డి సద్బాంధవా!
ఇలలో భారత శోధనా హృదయ! మీ ధ్యేయంబు సద్గణ్యమౌన్.
కలకాలంబిల నిల్చియుండు కద మీ కల్యాణ సత్కార్యముల్!
కలి కాలంబున ద్వాపరంబుఁ గనెచే, కావ్యంబులందార్తితోన్?
క. ద్వాపర లక్షణ వృత్తము - లీపగిదిన్ దెలియఁబూన నెట్లు లభించున్?
పాపము పండిత వర్యులు - కోపింతురు తప్ప మేలుఁ గొల్పఁదలచినన్.
కంద - గీత - గర్భ చంపక మాల.
వర గుణ శేఖరా! సుజన భాస! నయాన్విత! శుభ్ర తేజసా!
నిరుపముఁడా! మహా కృషిని నేర్పున చేసెడి క్లేశ హీన! సు
స్థిర గననీయమౌన్ ఫలిత దీపన భాగ్యము ప్రాభవంబు, భా
స్కర కిరణాప్తితోన్, వెలుగు శాశ్విత కీర్తిని వేల్పులట్లుగా.
-  -  #  -  -
వీరి పరిశోధాఫలములగు గ్రంథరాజము సమాజములకెంత ప్రయోజనకరమగునని ఆశించుచున్నాను.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.