గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2016, సోమవారం

అసాధారణ వ్యక్తి శంభాజీ భిడే భారత మాత ముద్దు బిడ్డ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మన భారతమాతనిస్స్వార్థ సేవాతత్పరులైన అనేకమంది బిడ్డలను కూడా కన్న పవిత్ర మూర్తి. ఈమె కన్న ముద్దు బిడ్డలలో అసాధారణ ప్రతిభావంతుడైన శంభాజీ భిడే. వీరిది మహారాష్ట్ర. కాళ్ళకు చెప్పులైనా వేసుకోకుండా ఎంత దూరమైనా ప్రయాణం చేసే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే మహా మనీషి.
ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రక్కన నిలబడి 
అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఈయన  సాధారణ వ్యక్తి కాదు. 
MSc అటామిక్ పిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఈయన.
పూణే లోని పర్గూన్స్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ
న్యూక్లియర్ పిజిక్స్ ను చాలా సంవత్సరాల పాటు బోధించారు.

ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసి , మహారాష్ట్రలో విస్తృతంగా నిర్వహిస్తూ పది లక్షల మందికి పైగా యువతరం తనతో పాటు సేవలలో పాల్గొనేలా చేస్తున్నారు.

కాలి నడకకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే ఆయన , 
కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంత దూరమైనా నడుస్తారు
తెల్లటి ఖాదీ వస్త్రాలు మాత్రమే ధరిస్తూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నారు.
వారి వ్యక్తిత్వం , ఆలోచనా విధానాం అత్యంత అనుసరణీయమైనవి.
“ మనం పవిత్రమైన ఈ దేశంలో పుట్టాం. 
ఈ గాలిని పీలుస్తూ
ఈ నీటిని తాగుతూ
ఈ నేలపై నడుస్తున్నాం. 
మన ఊపిరి ఉన్నంతవరకు ఈ దేశానికి ఏదో విధంగా సేవ చేయడం మనందరి బాధ్యత “ 
అనే ఉన్నతమైన ఆశయంతో ఆయన ముందుకు పయనిస్తున్నారు.
అలాంటి గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకోవడం, ఈ ప్రపంచానికి తెలియజేయడం, వారిని అనుసరించడం మనందరి బాధ్యత.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖులను పరిచయం జేసినందులకు ధన్య వాదములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ప్రముఖుల గురించి తెలుసుకోవలసినవి చాలా ఉంటాయి మంచి విషయాన్ని అందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.