గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2016, ఆదివారం

శతావధాన కార్యక్రమం 2016 ఫిబ్రవరి మాసానికి వాయిదా.

జైశ్రీరామ్.
తే.06-01-2016 నుండి 09-1-2016 వరకు యాదాద్రిలో నిర్వహింప తలపెట్టిన డా.మాడుగుల నాగఫణిశర్మ శతావధాన కార్యక్రమం వారి కుమార్తె వివాహం కారణంగా ఫిబ్రవరి మాసములో జరుపనున్నామని కార్యనిర్వాహకులు తెలిపి యున్నారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో పత్రికా ముఖంగా ప్రకటించగలమని తెలియఁజేసియున్నారు. డా.నాగఫణిశర్మగారి పుత్రికా వివాహం నిర్విఘ్నంగా సుసంపన్నమవాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ పుత్రులు శ్రీ నాగఫణి శర్మగారి అవధానమునందు పాల్గొన గలిగిన అదృష్ట వంతు లందరికీ ప్రణామములు
వారి కుమార్తె వివాహం వైభవో పేతముగా జరగాలని కోరుతూ , వధూ వరులను ఆశీర్వదించి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.