గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2015, ఆదివారం

ఆయుర్విత్తం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం , మంత్రమౌషధసంగమౌ , 
దానమానావమానాశ్చ , నవ గోప్యా మనీషిభిః. 
ఆ.వె. వయసు, ధనములింట బాధించు గొడవలు                                                                                     
మంత్ర యౌషధములు, మాన, దాన
సంగమములు, మనల కృంగించు యవమాన
ములను పరుల కెపుడు తెలుప రాదు.
భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము ,
అవమానము - ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును అందరు తెలుసుకోవలసిన నిజములు చక్కగా వివరించారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.