గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2015, సోమవారం

ఆయుషం క్షణ ఏకో೭పి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ఆయుషం క్షణ ఏకోపి సర్వ యత్నైర్నలభ్యతే!
నీయతే తద్వృథాయేన ప్రమాదః సుమహానహో!! 
క. గడచిన క్షణమును వెనుకకు
నడుపఁగ మన వశమగునొకొ?. నడువఁగ వలయున్
వడివడి సమయము వెనుకనె.
నడువకునికి హితమొదవదు. నడువుడు వడిగా.
భావము: ఆయుర్దాయము ఒక్క క్షణము (వ్యర్థముగా) గడిచిపోయినను ఎన్ని ప్రయత్నములు చేసి అయినను దానిని తిరిగి వెనుకకు తీసుకొని రాలేము. (ఎంతటి మహానుభావులకయినను) సమయము వ్యర్థము అయినచో గొప్ప  ప్రమాదము కలుగ చేయును కదా! అహో ఎంతటి ఆశ్చర్యకరమయిన విషయమిది!  
కావున కాలము వ్యర్థము చేయక కాలముతో పాటుగా మనము కూడా మెలకువతో అప్రమత్తముగా నడువవలెను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా మంచి విషయాన్ని చెప్పారు .అందుకే ఎదీ వాయిదా వెయ్యకూడదు . ముఖ్యమైన పనులను ఎప్పడికప్పుడు చెసుకోవడం ఉత్తమం .బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.