గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2014, సోమవారం

షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా. మేలిమి బంగారం మన సంస్కృతి, 207.

జైశ్రీరామ్.
శ్లో. షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా 
నిద్రా తంద్రీ భయం క్రోధమాలస్యం దీర్ఘసూత్రతా.
క. అతి నిద్రయు, అలసతయును,
చ్యుతి గొలిపెడి కోపము, భయ సోమరితనముల్,
క్షితి నాన్పుడు వీడగవలె
మతిమంతులు భూతిని గొను మతి గల్గినచో.
భావము. ఐశ్వర్యం కోరే వ్యక్తి – అతినిద్ర , అలసత, భయం, కోపం, సోమరితనం, సాగతీత ధోరణి అనే ఆరు దోషాలను వదలుకోవాలి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సహజంగా ఉండే ఈలక్షణాలనువదులు కోవడం అంత తేలిక కాదు కానీ సాధన వలన కొంత అలవరచు కోవచ్చును మంచి సూక్తి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.