గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, మే 2014, మంగళవారం

మందోஉప్యమందతామేతి సంసర్గేణ విపశ్చితః. మేలిమి బంగారం మన సంస్కృతి195.

జైశ్రీరామ్.
శ్లో. మందోప్యమందతామేతి సంసర్గేణ విపశ్చితః 
పంకచ్ఛిదః ఫలస్యేవ నికషేణావిలం పయః .

గీ. అల్పుడధికునితో గూడ నధికుఁడగును.
ఘనుల సంసర్గమునకల్గు ఘన ఫలంబు.
మలిన జలబిందువైనను మంచిముత్య
మట్లు మెఱయును పద్మపత్రాంబువయిన.
భావము. అల్పుడైనా విద్వాంసులతో కలిసి ఉండటంతో అనల్పుడౌతాడు. కలుషిత జలబిందువైనా తామరాకుమీద పడిన కారణంగా ఒక మంచి ముత్యంలా తళతళలాడిపోతుందికదా!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ప్రముఖులు ,పండితులు ఐన వారి చెంత నుండటం వలన ఎంత తెలివి లేని వారైనా కొంత జ్ఞానాన్ని సంపాదించుకోగలరు అమాయకుడైన తోటకుడు గురుసుశ్రూష జేసి వృత్తాలు వ్రాయగలిగాడు కదా ! మంచి సూక్తి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.