గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జనవరి 2013, శనివారం

సర్వ సత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా యావద్భారతీయులకు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
भारत् माताकी जै
సర్వ సత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా యావద్భారతీయులకు శుభాకాంక్షలు.
గణతంత్రంబున పాలనాదికములన్ గావించు సద్భారతా
వనినున్నట్టి సుపూజ్య మేధ విలసత్ద్భావామృతోద్భాసితుల్,
గుణ వంద్యుల్ మహనీయ తత్వమహితుల్, క్షోణీ సుధాంభోనిధుల్,
మను సర్వత్ర మహోత్తమోత్తమ గతిన్ మాన్యావనిన్ భారతిన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.