గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2013, ఆదివారం

ఇది నిజమా? కాముకునకుండు లోకాన గౌరవంబు. నిజమే ఐతే ఎలాగో పూరించి చూపండి ఈ సమస్యని.

జైశ్రీరామ్.
మిత్రులారా!
కాముకునకుండు లోకాన గౌరవంబు.
అనే సమస్యను మీరెలా పూరిస్తారో పూరించి తెలియజెయ్యండి. 
ఇక నా పూరణను వ్యాఖ్యలలో తిలకించండి.
మీ పూరణ పదిమందికీ ప్రేరణ ఔతుందని నా నమ్మకం.
జైహింద్.
Print this post

4 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తే:-
శత్రు షడ్వర్గము జయించి, సహన మొప్ప
బాధలెడఁ బాప జనులకు బోధ సేయు
యోగి వరునకు, నైహిక త్యాగి, మోక్ష
కాముకునకుండు లోకాన గౌరవంబు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కలిమి లేముల నొకటిగా దలచి పెద్ద
చిన్నవారల ప్రేమించి మిన్న యగుచు
రామ నామము వీడని రమ్య సువ్రత
కాముకునకుండు లోకాన గౌరవంబు.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

జనహితము మనమున ననుదినమున మనన
సలుపుచు, నెపుడు సుజనుల చరిత నుడువు
చు, నడవడికలకును నడత నేర్పు
కాముకునకుండు లోకాన గౌరవంబు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రేమ కరువైన జగతిని పిడి కెడంత
మమత పంచని మనసుల సమత కరువు
ధరను దొరకున దేముంది కొరత యనక
కాముకు నకుండు లోకాన గౌర వంబు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.