గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2013, మంగళవారం

ఇది విన్నారా? "జెష్టా దేవికి కోరి పూజ సలిపెన్ శ్రేష్ఠుల్ మహోల్లాసులై" ఈసమస్యా పూరణ మీరైతే సునాయాసంగా చేయకలరు.

జైశ్రీరామ్.
ప్రియ సన్మిత్రులారా! ఇదెక్కడైనా విన్నారా?
జెష్టా దేవికి  కోరి  పూజ  సలిపెన్ శ్రేష్ఠుల్ మహోల్లాసులై..
వింటే విడ్డూరంగా ఉంది కదూ?
ఐతే మీరు ఈ సమస్య పూరణను సునాయాసంగా చేసెస్తారనే నమ్మకం నాకైతే బలంగా ఉంది. నా నమ్మకాన్ని ఋజువు చేస్తూ మీ పూరణలను పంపండి.నా పూరణములను వ్యాఖ్యలలో చూడండి.
జైహింద్.

Print this post

6 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శా:-సృష్టిన్ దైవముఁ గొల్వఁ జేయు నిడుమల్ సృష్టించి భక్తాళికిన్,
నష్టంబుల్ కలిగించుచుండు, పరమౌ బ్రహ్మంబునే గాంచనౌన్.
నష్టం బైహికమందు గొల్పుచునుతా నాకంబు చేర్చేటి యా
జెష్టా దేవికి కోరి పూజ సలిపెన్ శ్రేష్ఠుల్ మహోల్లాసులై.

శా:-
దుష్టుల్ తాము వి నూత్న పూజలు మదిన్ తోచన్ దురుద్దేశులై
శిష్టా చారము వీడి శిష్టులకు తా చేయంగ నా దుష్టులే
జెష్టా దేవికి కోరి పూజ సలిపెన్. శ్రేష్ఠుల్ మహోల్లాసులై
కష్టంబుల్ విడి కామితార్థద సిరిన్ గాంచంగ పూజించిరే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ RS Rao Nemani
ఇలా అన్నారు.

అమ్మవలె దివ్యభావమ్ము లలరుచుండు
కమ్మ కమ్మని రుచుల మోదమ్ము నింపు
దమ్ము గల్గిన మేటి పద్యమ్ము లౌర
తమ్ముడా! త్రాగు మాంధ్రామృతమ్ము రమ్ము.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నేమాని వారూ! రమ్ము అని ఆహ్వానించిన మీ పద్యంలోనే గమ్ మత్తుందండి. మీరంతగా ఆదరించి రమ్ము! అని పిలిచేసరికి వచ్చి గ్రోలనివారెవరు?

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

చింతా వారు చెంత నుండ చింత లేదని నమస్తోసులతో నాపూరణ పరిశీలింప మనవి.
కష్టంబుల్ భరియించుచున్ వనితలిక్కాలంబు చేపట్టు చున్
స్పష్టంబీ ప్రభుతన్ స్వరాజ్య పదవుల్ చక్కంగ చేయంగ వా
రిష్టంబుల్ ప్రకటించి యింట తెలవారేఝాము సమ్మార్జనిన్
జెష్టా దేవికి కోరి పూజ సలిపెన్ శ్రేష్ఠుల్ మహోల్లాసులై..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దుష్టుల్ నిండిన దారుణంపు ధరణిన్ ద్రోహంబు పెంపొం దగా
యిష్టం బై జపియించి దేవతల శాసించన్ దగన్ పూజలన్
నష్టంబుల్ తొలగింప జేసి తమనా నందంబు తేలిం చగన్
జెష్టా దేవికి కోరి పూజ సలిపెన్ శ్రేష్టుల్ మహోల్లాసు లై !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దుష్టుల్ నిండిన దారుణంపు ధరణిన్ ద్రోహంబు పెంపొం దగా
యిష్టం బై జపియించి దేవతల శాసించన్ దగన్ పూజలన్
నష్టంబుల్ తొలగింప జేసి తమనా నందంబు తేలిం చగన్
జెష్టా దేవికి కోరి పూజ సలిపెన్ శ్రేష్టుల్ మహోల్లాసు లై !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.