గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2013, గురువారం

నిజమేనంటారా?"మారునిన్ గొలువంగ మోక్షరమా పయస్విని ప్రీతయౌ"నట.ఐతే పూరించి చూపండి.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
"మారునిన్ గొలువంగ మోక్షరమా పయస్విని ప్రీతయౌ" నట. 
ఈ సమస్యాపూరణను మీరైతే అద్భుతంగా పూరించే సమర్ధులని విశ్వసిస్తున్నాను.
మీ పూరణమును పంపండి. 
నాపూరణమును వ్యాఖ్యలో తిలకించండి.
నమస్తే.
జైహింద్.

Print this post

6 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మత్త:-
కోరి భక్తిగ శ్రీ హరిన్ వర గోప బాల సమన్వితున్,
చేరి కొల్చెడి వారికిన్ సుఖ జీవనంబిడు దైవమున్,
భారమంతయు మోయు నాతని భక్తితో మది గాంచి, శ్రీ
మారునిన్ గొలువంగ మోక్ష రమా పయస్విని ప్రీతయౌ!

Pandita Nemani చెప్పారు...

మారుచుండును దుస్థితుల్ మనమార వచ్చు సుఖస్థితుల్
మారు చింతలు వీడి సాధన మానసంబున జేయుచున్
మారుతాత్మజ సేవితా! నృపమాన్య వైభవ! రామ! ము
మ్మారునిన్ గొలువంగ మోక్ష రమా పయస్విని ప్రీతయౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మారె నంతట ధర్మ మన్నను మార దెన్నడు సత్యమౌ
నేరమౌ గద ఘోర మన్నను నేటి దారుణ కృత్యముల్
కూరిమిన్ మన మందు కోవలె కోటి సూర్యుల వెల్గులన్
మారునిన్ గొలువంగ మోక్ష రమా పయస్విని ప్రీతయౌ !

Pandita Nemani చెప్పారు...

శ్రీమతి రాజేశ్వరి గారు మత్తకోకిల గళమును చాల బాగుగ వినిపించినారు. శుభాశీస్సులు. అభినందనలు. స్వస్తి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్య గారు, అన్నయ్యగారు చక్కని పూరణలతో పాఠకులనలరించినందులకు ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గురువులకు పాదాభి వందనములు
ఏమి నా భాగ్యము ? " కిట్టించి కుస్తీపట్టి వచ్చిరాని రాతలు వ్రాసిన నా మత్త కోకిల పూజ్య గురువులు శ్రీ పండితుల వారి ప్రసంస పొందుట నా జన్మ సుకృతము . ధన్యు రాలను

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.