గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, నవంబర్ 2012, సోమవారం

పాఠక జనానీకానికి దీపావళి శుభాకాంక్షలు.

జై శ్రీరామ్.
సదసద్వివేక సంపన్న పూజ్య భారతీయ సోదరీ సోదరులారా! నమస్సులు.
మీ అందరికీ  ఈ చిదానంద దీపావళి శుభాకాంక్షలు.
ఉ:-
మానవులందు రాక్షసము, మాన్యతఁ గొల్పెడి దైవ తత్వమున్
జ్ఞాన వివేక సంపదలు, కర్కశమైన దురంత దౌష్టముల్
కానఁగ వచ్చు. జ్ఞానమున గౌరవ వృద్ధినిఁ గొల్పు వానినే
మానధనుల్గొనున్. మహిని మాన్యులు వారలె మంచి నెంచుటన్.
క:-
నరకుండత డెటనుండును?
హరి యెవ్వడు? సత్య యెవరు? హరి సత్య లటుల్
నరకుని చంపుటదేమిటి?
తరచి తరచి మదిని చూడ తత్వము తెలియున్.  
శా:-
జీవాత్ముండన లక్ష్మి యౌను. కనగా జీవంబుగా నిల్చు నా
దేవుండే పరమాత్మ యౌను మనలో దీపించు జ్ఞానంబుగా.
భావంబందున గల్గు దౌష్ట్యములు సంభావింప నా యాసురుం
డే. వానిన్ హతమార్చుటే జరుగు గాదే నేడు జ్ఞానంబుచే.
క:-
అజ్ఞాన తిమిర హరమున
విజ్ఞానపు వెలుగులు మది వెలయును. కనుకన్
సుజ్ఞానులార! మనలో
నజ్ఞానము పారద్రోల నమరు సుఖంబుల్.
క:-
ఆ లక్ష్మీ శ్రీ కృష్ణులు
మీ లక్ష్యము జేర్చ నెంచి, మీలో గల యా
భీలాసురుఁ బరిమార్చుత!
శ్రీలన్, సుఖ శుభ ఫలముల చేకూర్తురిలన్.
జైహింద్.
Print this post

15 comments:

గిరి Giri చెప్పారు...

చాల బావుంది. మీకు కూడ దీపావళి శుభాకాంక్షలు రామకృష్ణారావుగారు.

పిఆర్ తమిరి చెప్పారు...

మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు....

పిఆర్ తమిరి చెప్పారు...

మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు....

సో మా ర్క చెప్పారు...

చాలా చాలా బాగున్నాయ్ దీపావళి కవితా దివిటీలు......దివ్య కవితా దీధుతులతో వెలుగుతున్నాయి

KVS చెప్పారు...

రామేణాభిమతం మోక్షం - కృష్ణేన నరకచ్యుతిః |
గోవిందస్మరణాత్ప్రాప్తాః - శ్రియోదీపావళీరివ ||

నమస్కారములతో - శ్యామశర్మ

KVS చెప్పారు...

రామేణాభిమతం మోక్షం - కృష్ణేన నరకచ్యుతిః |
గోవిందస్మరణాత్ప్రాప్తాః - శ్రియోదీపావళీరివ ||

నమస్కారములతో - శ్యామశర్మ

నాగగురునాథ శర్మ చెప్పారు...

padyaalu adbhutaM guruvu gaaroo!

నాగగురునాథ శర్మ చెప్పారు...

padyaalu adbhutaM guruvu gaaroo!

మాలా కుమార్ చెప్పారు...

మీ జ్యోతులు చక్కగా వెలుగుతున్నాయి .
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు .

Pandita Nemani చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నేమాని రామజోగి సన్యాసి రావు గారు తమ ఆశీర్వాదాన్ని మనకు ఇలా అంద జేశారు.

దీపావళి శుభాకాంక్షలు:
మిత్రులారా!

కలుగుచు పెక్కు సంపదలు కాంతిమయమ్ముగ మీ హృదంబుజం
బలరును గాక! శాంతిమయమై శుభ పర్వము మీకు పెక్కు కా
న్కల గొనితెచ్చు గాక! యని కమ్ర మనమ్మున గూర్తు దీవనల్
లలిత గుణాఢ్యులార! సుఫలమ్ముల నొందుడు శుద్ధ కీర్తులై

నేమాని రామజోగి సన్యాసి రావు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Bhaskar ఇలా అన్నారు...
శుభమ్ కరోతి కళ్యాణమ్ ఆరోగ్యమ్ ధనసంపదః
శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే
शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा ।
शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोsस्तु ते ।


యావత్ హైందవ రాజ్యానికి, దీపావళి శుభాభినందనలు
Happy and Safe Deepawali to all
http://www.youtube.com/watch?v=MaXPyjMXK-M&feature=youtube_gdata_player

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా! మీకు దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి తత్వంబు
న్నేపారగ దెల్పినారు లే కవి వర్యా !


రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య సౌరభాలను విర జిమ్ముతున్న దీప కాంతులు మిరు మిట్లు గొలుపు తున్నాయి.
అందరికీ దీపావళి శుభా కాంక్షలు . ఆశీర్వదించి అక్క

తెలుగు వారి బ్లాగులు చెప్పారు...

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.