గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 129. తల్లిని సేవించుము.

జైశ్రీరామ్.
శ్లో:-
ఉపాధ్యాయాన్ దశాచార్యః  -  ఆచార్యాణాం శతం పితా.
సహస్రంతు పితౄన్ మాతా  -  గౌరవేణాతిరిచ్యతే.
గీ:-
ఒజ్జలు పదుగురాచార్యుఁడొక్కని సరి
నూర్గురాచార్యులకు మిన్న నుత పితరుఁడు.
తల్లి వేయి రెట్లధికము తండ్రి కన్న.
కాన తల్లిని సేవించి కనుము ప్రీతి!
భావము:-
పదొ మంది ఉపాధ్యాయుల కంటె ఆచార్యుఁడు గౌరవార్హుఁడు. నూరుగురు ఆచార్యుల కంటె తండ్రి, తండ్రి కంటె వేయి రెట్లు తల్లి పూజనీయులు.
అందు చేతనే మొదట మాతృ దేవో భవ ఆతరువాత పితృ దేవో భవ, ఆతరువాత ఆచార్య దేవో భవ అని గౌరవింపబడుతున్నారు.
కావున మనము తల్లిని నిర్లక్ష్యము చేయ కూడదు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.