గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, నవంబర్ 2012, గురువారం

హాయిగా గ్రోల రారె యాంధ్రామృతమ్ము. మకుటంతో పద్య రచన చేయ మనవి

జైశ్రీరామ్.
ఆంధ్రామృతం.
సాహితీ సన్మిత్రులారా!
కొంత కాలముగా చక్కగా పద్యరచన సాధన చేయుచున్నసహృదయులయిన మీకొక విన్నపము
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.  
అను పద్య పాదమును మకుటముగా చేసుకొని
కవులు తమ అభిప్రాయములను భావనా పటిమకు జోడించి
పద్యాలను వ్రాయవలసినదిగా
సహృదయ శిరోమణి పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు సూచించారు.
నా పూరణ చిత్తగించండి.
శ్రేయములఁ గూర్చు సాహితీ చిత్ర గతుల
విధివిధానము బోధించు విశ్వ వాణి
మంచి చెడ్డల బోధించు మధుర సురభి
హాయిగా గ్రోలరారె ఆంధ్రామృతమ్ము.
చూచారు కదా నా పూరణము. మీరు కూడా శ్రీ నేమానివారి వాంఛితమునీడేర్చ గలరని ఆశింతును.
జైహింద్.
Print this post

9 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

వివిధ వృత్తములందున వేడుకగను
సాగు పద్యరచనఁ జేయ సరసులిచట
నిర్మలానందమిడునిది నిక్కముగను
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

గర్భ కవితల సొగసుల కమ్మదనము
యువతరంగము కనువైన యుక్తి వాక్కు
కలిపి దొరకు "చింతా వారి" కవన (కలము) మందు
హాయిగా గ్రోల రారె "యాంధ్రామృతమ్ము".

Pandita Nemani చెప్పారు...

సాహితీ కలశాంబుధి సంజనితము
శారదామాతృ సత్కృపాసార మయము
రామకృష్ణ హృన్మందిరారాధితమ్ము
హాయిగా గ్రోలరారె ఆంధ్రామృతమ్ము

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తెలుగుభాషలోనిసుధలగ్రోలరమ్మని ఆహ్వానము:
ఆకవిత్రయభారతమాదిగాను
పోతనార్యుభాగవతమ్ముపొదివికొనగ
రమ్యరామాయణాలెన్నొరాశులవ్వ
కవులమేధోమధనధారకమ్మగుండ
వారసత్వంపుసాహితీవనమువిరియ
తెలుగుతేజంబుదశదిశలలరుచుండ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తెలుగుభాషలోనిసుధలగ్రోలరమ్మని ఆహ్వానము:
ఆకవిత్రయభారతమాదిగాను
పోతనార్యుభాగవతమ్ముపొదివికొనగ
రమ్యరామాయణాలెన్నొరాశులవ్వ
కవులమేధోమధనధారకమ్మగుండ
వారసత్వంపుసాహితీవనమువిరియ
తెలుగుతేజంబుదశదిశలలరుచుండ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము!

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

యతులు, ప్రాసలు, ఛందంబు లద్భుతమగు
గుణములను గూడి మథురమౌ ఫణుతులంది
చిత్తవికసన మొనరించు, సిరులు పంచు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

విశ్వజనులార! కవులార! విజ్ఞులార!
పరమహితులైన సాహితీ బంధులార!
జాగుసేయగ నికనేల? సత్వరముగ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

అన్యభాషలపై మోజు నధికముగను
దాల్చగానేల? సరళమై తథ్యముగను
"దేశభాషల లెస్స"యీ తెలుగు గాన
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

కులము, మతములు, గోత్రాలు తలపకుండ
పిన్న పెద్దల భేదాల నెన్నకుండ
మంచి పలుకుల బ్రేమను బంచు చుండు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

జనుల నొకత్రాట నిలబెట్టి యనుపమగతి
నైకమత్యము బోధించు హర్షమునను
తెలుగునకు సాటి వేరొండు కలదె యెందు?
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

యతులు, ప్రాసలు, ఛందంబు లద్భుతమగు
గుణములను గూడి మథురమౌ ఫణుతులంది
చిత్తవికసన మొనరించు, సిరులు పంచు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

విశ్వజనులార! కవులార! విజ్ఞులార!
పరమహితులైన సాహితీ బంధులార!
జాగుసేయగ నికనేల? సత్వరముగ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

అన్యభాషలపై మోజు నధికముగను
దాల్చగానేల? సరళమై తథ్యముగను
"దేశభాషల లెస్స"యీ తెలుగు గాన
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

కులము, మతములు, గోత్రాలు తలపకుండ
పిన్న పెద్దల భేదాల నెన్నకుండ
మంచి పలుకుల బ్రేమను బంచు చుండు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

జనుల నొకత్రాట నిలబెట్టి యనుపమగతి
నైకమత్యము బోధించు హర్షమునను
తెలుగునకు సాటి వేరొండు కలదె యెందు?
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మధువు పంచగ వచ్చితి మాన్యు లార
పాత్ర నిండుగ మెండైన భాష కలదు
సుధలు పొంగెడు కవనముల్ సురలు మెచ్చ
హాయిగా గ్రోల రారె ఆంధ్రా మృతమ్ము

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
హాయిగా గ్రోల రారె యాంధ్రామృతమ్ము.
చింతా రామకృష్ణారావు గారు
తన ‘ఆంధ్రామృతం’ బ్లాగులో
పై మకుటంతో పద్యాలు వ్రాయవలసిందిగా ఆహ్వానించారు.
కవిమిత్రులు ఆ బ్లాగును దర్శించవలసిందిగా మనవి.
12 వ్యాఖ్యలు:
గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
గర్భ కవితల సొగసుల కమ్మదనము
యువతరంగము కనువైన యుక్తి వాక్కు
కలిపి దొరకు చింతా వారి కవన (కలము) మందు
హాయిగా గ్రోల రారె "యాంధ్రామృతమ్ము".
నవంబర్ 16, 2012 7:49 ఉ
Pandita Nemani చెప్పారు...
సరస వాఙ్మయ కలశాబ్ధి సారములను
బుద్ధి యను కవ్వమున జిల్కి పొలుపు మీర
నిచ్చుచున్నాడు శ్రీ రామకృష్ణ మనకు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము
నవంబర్ 16, 2012 8:31 ఉ
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
నవంబర్ 16, 2012 8:44 ఉ
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
శంకరాభరణమ్ము సత్సౌమ్య కవులు.
తత్ కవీశుల సత్కృతుల్ తనర, వెలుగు
నవ నవోన్మీలసాహిత్య నందనమది.
హాయిగా గ్రోల రారె యాంధ్రామృతమ్ము.
నవంబర్ 16, 2012 9:28 ఉ
సహదేవుడు చెప్పారు...
ఆకవిత్రయభారతమాదిగాను
పోతనార్యుభాగవతమ్ముపొదవికొనియు
రమ్యరామాయణాలెన్నొరాశులవ్వ
కవుల మేధోమథనధారకమ్మగుండి
తెలుగుతేజంబుదశదిశలలరుచుండి
వారసత్వంపుసాహితీవనమునిండె
హాయిగాగ్రోలరారెయాంధ్రామృతమ్ము
నవంబర్ 16, 2012 2:24 సా
సహదేవుడు చెప్పారు...
ఆకవిత్రయభారతమాదిగాను
పోతనార్యుభాగవతమ్ముపొదవికొనియు
రమ్యరామాయణాలెన్నొరాశులవ్వ
కవుల మేధోమథనధారకమ్మగుండి
తెలుగుతేజంబుదశదిశలలరుచుండి
వారసత్వంపుసాహితీవనమునిండె
హాయిగాగ్రోలరారెయాంధ్రామృతమ్ము
నవంబర్ 16, 2012 2:24 సా
హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...
యతులు, ప్రాసలు, ఛందంబు లద్భుతమగు
గుణములను గూడి మథురమౌ ఫణుతులంది
చిత్తవికసన మొనరించు, సిరులు పంచు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

విశ్వజనులార! కవులార! విజ్ఞులార!
పరమహితులైన సాహితీ బంధులార!
జాగుసేయగ నికనేల? సత్వరముగ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

అన్యభాషలపై మోజు నధికముగను
దాల్చగానేల? సరళమై తథ్యముగను
"దేశభాషల లెస్స"యీ తెలుగు గాన
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

కులము, మతములు, గోత్రాలు తలపకుండ
పిన్న పెద్దల భేదాల నెన్నకుండ
మంచి పలుకుల బ్రేమను బంచు చుండు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

జనుల నొకత్రాట నిలబెట్టి యనుపమగతి
నైకమత్యము బోధించు హర్షమునను
తెలుగునకు సాటి వేరొండు కలదె యెందు?
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.
నవంబర్ 16, 2012 3:32 సా
Sai Om Construction చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
నవంబర్ 16, 2012 5:39 సా
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
మాయగా పంచు మోహిని భయము లేదు
వివిధ చందస్సు వృత్తాలు వెల్లు వలుగ
మదిని యలరించు రసరమ్య మధువు లవియె
హాయిగా గ్రోల రారె యాంధ్రా మృతమ్ము
నవంబర్ 16, 2012 5:45 సా
ఊకదంపుడు చెప్పారు...
ద్వర్ధికావ్యమును మనకు భావమలర
జెప్పు,పదవిభజనెటులొ జేసి చూపు
దారి కానకనున్న విద్యార్ధులార!
హాయిగా గ్రోల రారె "యాంధ్రామృతమ్ము".
నవంబర్ 16, 2012 8:59 సా
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
కంది శంకరులుసత్ కవులను పురిఁగొల్పి పద్యముల్ వ్రాయించి ప్రతిభఁ గొల్పె.
గోలి హనుమతాఖ్య గొప్పగా వివరించి గౌరవంబును పెంచె కరుణ తోడ.
పండిత నేమాని ప్రతిభులు నన్ గూర్చి ఔదార్యమున వ్రాసి హాయిఁ గొలిపె.
సహజ సిద్ధంబైన సహదేవు సత్కృతి సత్కావ్య ప్రతిభల సరస నిలిపె,
ఘన హ.వేం.స.నా.మూర్తి సద్ఘనతఁ గొలిపె.
రాజ రాజేశ్వరక్క నన్ ప్రాజ్ఞుఁ జేసె,
ఊకదంపు డుయ్యాలలో నూపెనన్ను.
ఇందరికిఁ గూడ నేజేతు వందనములు.
http://andhraamrutham.blogspot.in/2012/11/blog-post_15.html
మీ
చింతా రామ కృష్ణా రావు.
http://andhraamrutham.blogspot.com/
http://yuvatarangam.blogspot.com/
http://chramakrishnarao.blogspot.com/
నవంబర్ 16, 2012 9:46 సా
Laxminarayan Ganduri చెప్పారు...
ఆదికవి నన్నయాదుల ఆత్మనుండి
పుట్టివేలసిన భాషకు పట్టువిడక
గిడుగు, గురజాడ అద్దిరి నుడుల సొగసు
హాయిగా గ్రోల రారె యంధ్రామృతంబు.

విశ్వమంతట విరసిన విమల భాష
తెలుగు వారందరికి నిండు వెలుగు నిచ్చు
మాతృ భాషను ప్రేమతో మదిని నింపు
హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .

దేశ భాషలలోకెల్ల తెలుగులెస్స
భవ్య, సుందర, సుమధుర భాష మనది
అమ్మ బాస కంటే భాష కమ్మగుండు
హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .ఆదికవి నన్నయాదుల ఆత్మనుండి
పుట్టివేలసిన భాషకు పట్టువిడక
గిడుగు, గురజాడ అద్దిరి నుడుల సొగసు
హాయిగా గ్రోల రారె యంధ్రామృతంబు.

విశ్వమంతట విరసిన విమల భాష
తెలుగు వారందరికి నిండు వెలుగు నిచ్చు
మాతృ భాషను ప్రేమతో మదిని నింపు
హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .

దేశ భాషలలోకెల్ల తెలుగులెస్స
భవ్య, సుందర, సుమధుర భాష మనది
అమ్మ బాస కంటే భాష కమ్మగుండు
హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .
నవంబర్ 16, 2012 10:22 సా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.