గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, నవంబర్ 2012, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 130.

జైశ్రీరామ్.
శ్లో:-
వసంత యౌవనా వృక్షాః  -  పురుషా ధన యౌవనాః.
సౌభాగ్య యౌవనా నార్యాః  -  యౌవనా విద్యయా బుధాః.
క:-
వాసంతియె వృక్షములను,
భాసిలు ధన వితతి పురుష వరులను, ఘన సద్
భాసిత సౌభాగ్యమ్ము సు
వాసినులను, విద్య బుధుల వర్ధిలఁ జేయున్.
భావము:-
వసంత ఋతువే వృక్షములకు యౌవనము నిచ్చున్. పురుషులకు ధనమే యౌవనము కూర్చును. స్రీలకు సౌభాగ్యమే యౌవనదాయకము. పండితులకు విద్యయే యౌవన శోభ కూర్చును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.