జైశ్రీరామ్.
అమెరికాను అతాకుతలం చెస్తున్న శాండీ తుపాను.
ఆర్యులారా! “శాండీ'”పెను తుపాను కారణంగా ఏనాడూ కనీ వినీ యెఱుగని ప్రకృతి భీభత్సానికి అమెరికా లోనవడం విచారకరం. అక్కడ మన ఆంధ్రులు, మన భారతీయులు ఎంతోమంది నివాసముంటున్నారు. వారంతా ఎక్కడున్నా మన మాత్రు భారతిఎడలా, మన ఆంధ్ర రాష్ట్రం ఎడల సౌవేధేయులై, నిష్కళంకమైన ప్రేమని ఎల్లప్పుడూ చూపిస్తూ, అమెరికాపై గౌరవభావంతో మెలగుతూ ఉభయ దేశాలకు వారధిలాగ ఉంటున్న విషయం మనకు తెలియనిది కాదు. తమ బంధువర్గానికి దూరంగా ఉంటూ కూడా అది మరచి, అమెరికనులతో మైత్రీభావంతో కలిసిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తూ అక్కడున్నారు మనవారు.ఇప్పుడు తుపాను రూపంలో వచ్చిన పెద్ద ఉపద్రవాన్నిఅమెరికా ఎదుర్కుంటోంది.
అమెరికా దేశము ఈ ఉపద్రవంనుండి సునాయాసంగా గట్టెక్కాలనీ, అక్కడున్న స్వదేశీయులు,అతిథులైన పరదేశీయులుక్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మన భారతీయులిఉ, మన ఆంధ్రులు యావన్మందీ కూడా ధన మాన ప్రాణాలతో సురక్శ్కితంగా ఉండాలని ఆంధ్రామృతం కోరుకుంటోంది.
సర్వే జనాః సిఖినో భవంతు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.