జైశ్రీరామ్.
శ్లో:- నచ విద్యా సమో బంధుః - నచ వ్యాధి సమో రిపుః
లేదు విద్య సమాన బంధువు. - లేదు వ్యాధి సమాన శత్రువు.
లేఁడు పుత్ర సమాన మిత్రుఁడు - లేదు దైవ సమాన బలమున్.
భావము:-
విద్యతో సమానమైన బంధువు లేఁడు. రోగముతో సమానమైన శత్రువు లేఁడు. పుత్రునితో సమానమైన స్నేహితుఁడు లేఁడు. దైవముతో సమానమైన బలము వేరే లేదు.
మనము విద్యావంతులము కావలెననియు, రోగ దూరులమై యుండవలెననియు, సత్ సంతానమును కలిగి యుండవలెననియు, దైవభక్త్ని కలిగి యుండ వల్రెననియు భావము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.