గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2012, బుధవారం

అత్యద్భుతమైన ప్రమాణములతో నిర్వహింపబడుతున్న వేద పాఠశాల

జైశ్రీరామ్.
ఆర్యులారా! వేదమును గూర్చి సప్రమాణికముగా నిర్వచించి పలికిన భారాంబ యొక్క ముద్దుబిడ్డయైన ఒక పండితమ్మన్యుల వివరణ వారి మాటలలోనే వినండి. వారు నిర్వహించుచున్న వేద పాఠశాలను గూర్చిన వివరము కూడా తెలుసుకోండి
.http://www.youtube.com/watch?v=5wfCf8-h7hA&feature=relmfu


అత్యద్భుతమైన విషయాలను వేదాలను గూర్చినవి విన్నారు కదా? కర్తవ్యనిర్వహణానురక్తులై మెలకువతో ముందడుగు వెయ్యండి.
శుభమస్తు.
జైహింద్.

Print this post

3 comments:

శ్రీలలిత చెప్పారు...


చాలా అద్భుతంగా వుందండీ. ఇటువంటి వేదపాఠశాల ఇంత వున్నత ప్రమాణాలతో నడుపుతున్న వారు ధన్యులు. సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ రామకృష్ణారావు గారూ శుభాశీస్సులు.
వేదపాఠశాల గురించి పరిచయ వాక్యాలు పలికిన శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు మాకు చాల సన్నిహితులు. ఆ పాఠశాలను నెలకొల్పి నిర్వహించుచున్న శ్రీ సామవేదుల చంద్రశేఖర ఘనపాఠి గారు కూడా మాకు బాగుగా పరిచయమున్న వారే. ఘనపాఠి గారు ప్రస్తుతము అమెరికాలో ఆస్టిన్ అనే రాష్ట్రములో నుంటున్నారు. వారింటి పేరు సామవేదుల వారే, మరియు వారు అభ్యసించినది కూడా సామవేదమే. వారిద్దరూ ఒకప్పుడు కొవ్వూరులో(పశ్చిమ గోదావరి జిల్లా) నుండిన వారే. వారిని గూర్చి మీరు బ్లగులో పెట్టుట హర్షణీయము. శ్రీ ప్రభాకర శర్మ గారు "పురుషోత్తమ ధర్మ ప్రచార సభ"కు నిర్వాహకులు - సంఘ సేవాపరాయణులు, కొవ్వూరులో సంస్కృత కళాశాల అధిపతి (ప్రిన్సిపాలు) గా పనిచేసి విశ్రాంతి గైకొనుచున్నారు. శ్రీ సామవేదుల ఘనపాఠిగారు అమెరికాలో స్థిరపడినారు. వారు వేదాధ్యయనము వలననే అభివృద్ధి సాధించిరి కావున వారు వేదవిద్యను అభివృద్ధి చేయుటకు గొప్ప కృషి గావించుచున్నారు. ఇద్దరు వయసులో నాకంటే చిన్నవారు కావున నా శుభాశీస్సులు. స్వస్తి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నమస్తే.
చాలా అదృష్టవంతులం మేము. వారితో సాన్నిహిత్యం ఉన్న మీరు మాకు సన్నిహితులవడం మా పురాకృత పుణ్య విశేషమనే చెప్పాలి.
మీకు పరిచయమున్న మహనీయులను గూర్చి మాకు చెప్పుతూ ఉండగలరని ఆశిస్తున్నాను. అటువంటి వారి వృత్తాంతం వింటే అది గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తుందనటంలో సందేహం లేదు.
నమస్తే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.