జైశ్రీరామ్.
సహృదయ శిరోమణులారా! ఈ నాడు పరమ పవిత్రమైన విజయ దశమి. ఆ జగత్కారణ, సర్వ జగత్తుకు మూల విరాణ్మూర్తియైన జగదంబ పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణా గవాక్షాలు తెరచుకొని తనపై భక్తి పారవశ్యంతో పులకరించుకుపోయే భక్తులపై ఆమె చల్లని చూపుల వెన్నెలలు పీయూష వర్షమై ప్రసరించే శుభ ఘడియలు నిండి ఉన్నాయి. ఆ చల్లని తల్లి కరుణకు పాత్రులమై భవబంధాలకు అతీతముగా పరమానందాన్ని పొందుచూ పరవశించిపోదాము.
ఆజగదంబ శుభాశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
దుర్గా ఆపదుద్ధారాష్టకం
నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||
నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే |
నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౨ ||
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౩ ||
అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే జలే సంకటే రాజగ్రేహే ప్రవాతే |
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౪ ||
అపారే మహదుస్తరేజ్త్యంతఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ |
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౫ ||
నమశ్చండికే చండదోర్దండలీలాసముత్ఖండితా ఖండలాశేషశత్రోః |
త్వమేకా గతిర్విఘ్నసందోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౬ ||
త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా |
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౭ ||
నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే |
విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౮ ||
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిదనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్ |
నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || ౯ ||
శుభమస్తు.
జైహింద్.
5 comments:
స్రగ్ధరా:
జయ శ్రీసర్వేశీ! జనని! భగవతీ! సచ్చిదానందరూపా!
జయ త్ర్యక్ష్యాత్మేశీ! సకల శుభకరీ! సర్వలోకాధినేత్రీ!
జయ శ్రేయోదాయీ! సకలరిపుహరీ! సాధుబృందాభివంద్యా!
జయ స్వాత్మారామా! జయ జయ విమలా! శాంతరూపా! భవానీ!
మీరు చదివిన విజయనగరం సంస్కృత కళాశాలకి వెనక వున్న మహారాజా కళాశాల విద్యార్ధి వసతి గృహం లో నేను అరవైనాలుగు నించీ అరవై ఎనిమిది వరకూ వుండి నా విజ్ఞాన పట్టా కి చదువుకున్నాను మరి నా కళాశాల కి వేళ్ళాలంటే సంస్కృతం కళాశాల మీదుగానే వెళ్ళేవాళ్ళం వెనక వీధి వోకపక్క అయోధ్యమైదానము లంక వీధి గేదల అరుపులు
మళ్ళీ సుమారు ఏభై సంవత్సరాల వెనక్కి తీసుకుపోయేరు అదొక ఆనందం
విజయ దశమి సందర్భముగా " దుర్గా దేవి " అష్ట కాన్ని చదివించిన చింతా వారికి ధన్య వాదములు
అందరికీ " విజయ దశమి శుభా కాంక్షలు "
శ్రీ చింతా వారికి నా నమస్సులు. ఆర్యా నాదో సందేహం. దేవి వాహనం పులియా లెక సింహమా? భక్తి పరంగా ఈ సందేహం అంత ముఖ్యమైనది కాదు. కాని కుతూహలం కొద్ది అడుగుచున్నాను.
కె.ఎస్.రావ్
రావుగారూ! నమస్సులు. దేవి యొక్క వాహనము పులి కాదండి.
మృగ రాజైన సింహమే దేవి యొక్క వాహనమండి.
మీ
రామ కృష్ణా రావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.