గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ రామ నవమి సందర్భంగాయావజ్జనావళికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
శ్రీ రామ నవమి సందర్భంగాయావజ్జనావళికీ శుభాకాంక్షలు.
శాః-
శ్రీరామా! శ్రీత పారిజాత! సుగుణ శ్రీ  ధామ! సీతా పతీ!
కారుణ్యంబున కావుమయ్య జనులన్! కల్యాణ రామా సదా!
శ్రీ రామా మణి సీతనెట్లు కనెదో చేపట్టి, యట్లే మమున్
ధీరరోదాత్తుఁడ! పట్టి వీడకు మిలన్! దివ్యత్వమున్ గొల్పుమా!
చః-
ప్రియ మహనీయులార! వినిపించుఁడు రామునకుద్ధతిన్ మహో
దయమది మీహృదాంబుధిని తప్పక  చేయుఁడటంచు. నిత్యమున్
జయ పథమందు సంచరిల సద్గుణ మార్గప్రవర్తనాదులన్
ప్రియమున గొల్పి కావుమని శ్రీరఘునందను నండ నొందగన్.
జైహింద్.









Print this post

5 comments:

durgeswara చెప్పారు...

మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటూన్నాను జైశ్రీరాం

Pandita Nemani చెప్పారు...

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామరక్ష:

సీ. ఆపదలోజిక్కి యలమటించెడు వేళ
త్రాతయై యొప్పు శ్రీరామరక్ష
వ్యాధులచే చాల బాధనొందెడు నెడ
ప్రముఖౌషధమ్ము శ్రీరామరక్ష
యజ్ఞాన తిమిరమందల్లాడు వారికి
ప్రజ్ఞానదీప్తి శ్రీరామరక్ష
భవమహాజలధిలో బడి కొట్టుమిట్టాడ
ప్రేమతో బ్రోచు శ్రీరామరక్ష
తే.గీ. లేములెల్లను బాపు శ్రీరామరక్ష
ప్రగతిపథమున తోడు శ్రీరామరక్ష
ప్రథిత మంత్రవరమ్ము శ్రీరామరక్ష
రక్షలకు నెల్ల రక్ష శ్రీరామరక్ష

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
అందరికీ శ్రీ రామనవమి శుభ కాంక్షలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మీ వాగమృతము శ్రీరామ రక్షయై పాఠకాళికి మేలు చేకూర్చుననుటలో ఏమాత్రము సందేహము లేదు. మీకు నా కైమోడ్పులు.

Pandita Nemani చెప్పారు...

రామ! నను బ్రోవగా వేగ రావె యనుచు
పలుక దలచి రా యనగానె భక్తు డొకడు
వానికిడి దర్శనమ్ము నాపదలు దీర్చి
నీ పదమ్మున జేర్చిన నిన్ను గొలుతు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.