జైశ్రీరామ్.
ప్రియ సాహితీ మిత్రులారా! నేడు హనుమజ్జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఈ రోజు విశాఖపట్టణం జిల్లా పద్య కవితా సదస్సు అధ్యక్షులు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు శ్రీ కొట్టే కోటారావు మా ఆహ్వానం మేరకు మా యింటికి సపత్నీకులై వచ్చి మాకు ఎంతో ఆనందం కలిగించారు.
వీరు తన జీవిత కాలంలో ఒక తెలుగు భాషా బోధకులుగా పని చేసినందుకు తాను ఆశించిన విధంగా తన విధ్యార్థులనెందరినో కవులుగా, అవధానులుగా మంచి బోధకులుగా అయేలాగ తీర్చి దిద్ద గలిగారు. ఈక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్ప వలసి ఉంది. అదేమిటంటే, సాధారణంగా ఉద్యోగులలో కొందరు డిశంబరి మాసంలో ఎక్కువ సెలవులు పెట్టెస్తారు. డిశంబరు దాటితే ఆసెలవులు మురిగి పోతాయని అది తమకెంతో నష్టం అని భావిసూ అలా చేస్తారు.
ఐతే కోటా రావుగారు మాత్రం అల కాదు. ఈ కోటారావుగారు తన ఉద్యోగ జీవితంలో ఏనాడూ సెలవు పెట్టలేదు. ఆవిధంగా ఉండే ఆనాటి ఆ ప్రవర్తన ద్వారా ఎందరో శిష్యులకు ఆదర్శవంతులయ్యారు. నేటికీ తన ఆశయాలను నెరవేర్చుకొంటూనే ఉన్నారు.
జిల్లా పద్య కవితా శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టుతూ, ప్రతీ మాసమునందూ రెండవ ఆదివారం జిల్లా స్థాయిలో పద్య కవితా సదస్సు నిర్వహించుతూ, ఆ సదస్సులో ఒకశీర్షికను ముందుగా యిచ్చి, దానికి కవులు వ్రాసిన పద్యాలు సభలో చదివిన పిదప వారిని గౌరవించడం, ఆతరువాత ఒక ప్రత్యేక అతిథిచే సాహిత్యోపన్యాసం ఇప్పించుట ద్వారా శ్రోతలలో సాహిత్యాభిలాష పెంపొందింప జేయటం చేస్తూ ఉంటారు.
అటువంటి కోటా రావు గార్తో ముఖాముఖీ యు ట్యూబ్ ద్వారా చూడండి.

6 comments:
చాలా సంతోషం..
ఆ వీడియోను రెంఢు ముక్కలు చేసి వేర్వేరుగా యూట్యూబ్ లో పెట్టాలి. కాని ఈ సమస్య రాదనుకుంటా నాకు తెలిసి..
కోటా రావు గారితో మీ ముఖాముఖి ఆద్యంతం ఎంతో రసవత్తరంగా సాగింది.మంచి ఉద్దండుల కోవలో వారి చెప్పిన తీరు,మీ అభిప్రాయాలు నన్నుఎంతగానో ఆకట్టుకున్నాయి.నేను మీ ఇంట్లో ఆతిధ్యం స్వీకరించి అక్కయ్య గారికి క్రుతజ్నతలు కూడా తెలుపలేదు.తెలుపగలరు.ఫోటోలు బాగున్నాయి.
PANTULA JOGARAO pantulajogarao@gmail.com
మిత్రమా, రామ కృష్ణారావ్, మన ఆత్మీయ మిత్రులు శ్రీ కోటారావు గారితో నీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఒక ఆదర్శనీయమైన వ్యక్తిని పరిచయం చేయడం సరైన చర్య. అభినందనలు. మన మిత్రులలో ఎన్నదగిన వ్యక్తి కోటారావు.విజయ నగరంలో వారి భువన విజయం చూసి ముగ్ధుడ నయ్యాను.
పంతుల జోగారావు.
ఆర్యా! అర్క సోమయాజిగారూ!
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలనే అభిప్రాయంతో ఈ ముఖాముఖీ కార్యక్రమం చిత్రీకరించి మీ అందరిముందూ ఉంచాను. తన ఉద్యోగ జీవిత కాలంలో ఒక్కనాడూ కోటారావు సీ.యల్. పెట్టలేదు. ఈ ఆదర్శ భావం యువకులకు అర్థం కావాలని భావించి, అది తెలియజేయటానికి ఈ కార్యక్రమం నిర్వహించాను. ఏది ఏమైనా మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
ఇక మీరెంతో అవ్యాజానురాగంతో మాయింటికి వచ్చినందుకే మాకెంతో సంతోషం కలిగింది. చెప్పాలంటే మిమ్ములను మేము తగిన విధంగా చూడలేకపోయామే అని బాధపడుతున్నాము. మీ సహృదయతకు ధన్యవాదములు.
జోగారావు మిత్రమా! నీవు చెప్పినది అక్షర సత్యం. కోటారావు ఆదర్శ ఉపాధ్యాయులలో ఒకడు. మనింటికి ఆ దంపతులు రావటంతో ఇలా అందరికీ పరిచయం చేసే భాగ్యం కలిగింది.
నా మనసులో మహనీయులనేకమందిఉన్నారు. వారి లోని విద్వత్తును కూడా పాఠకులకు అందేలాగ చేయాలనే తపన ఉంది. ఐతే వారు చేరువలో ఉండి కూడా చేరువ కాలేకపోతుండటంతో నా ఆశ నెరవేరటం లేదు.ప్రయత్నిస్తాను.
నీ చక్కని అభిప్రాయంతో నాకు ద్విగుణీకృత ప్రోత్సాహం కలిగించినందుకు ధన్యవాదములు.
శ్రీరామకృష్ణ ధీనిధి
సూరివరుల నాదరించు సుగుణాంబునిధీ
గౌరవమలరగ శ్రీ కో
టారావును సత్కరించుటల్ ముదమొసగెన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.