జైశ్రీరామ్.
కోలాహలుఁడు శిక్తిమతిని అడ్డగించుట.
గీః-అనఘ వర్తనఁ బరమ వంశావతంస - మగుచు నిచ్చలుఁ దగు ప్రవరాఖ్యుఁడైన
వసు విభుం డార్య నుత శతాధ్వర గృహీత - భవ్య లక్షణుఁడగుచు శోభను వహించు. ౬.
ప్ర వర ఆఖ్యుఁ (ప్రసిద్ధ నామము కలవా) డైన వసు విభుఁడు అనఘ (ప్ర)వర్తనచే పరమ (గొప్ప)వంశ అవతంసము(శ్రేష్టము) అగుచు నిచ్చలు(నిత్యము)నూ తగి యుండును.ఆర్యులచే పొనుతింపఁ బడిన భవ్యమైన లక్షణములు కలవాఁడగుచు, శోభను వహించును.
గీః-
అందమల పద్మ సంతతి నలవరించి - దివ్య గుణమణులందు శుక్తిమతి నాఁగఁ!
గర్మ పావన మూర్తియై ఘనత నొప్పు - నది విబుధ హర్షమై మహోన్నతిని గాంచు. ౭.
ఆ అధిష్ఠానపురమున్ అందు అమల పద్మ సంతతి(సముదాయము)తో అలవరించి(ఒప్పి), దివ్య (దైవ సంబంధ) గుణము గల మణులను అందు(కలుగు)శుక్తిమతి నాఁగన్(అనఁబడెడి పేరుతో), కర్మప (కర్మాధికారులను) అవన (రక్షించునట్టి) మూర్తి (ఆకృతి కలది) యై ఘనతను, ఒప్పు, నది విబుధ హర్ష(యోగ్య)మై మహోన్నతిని గాంచును.
గీః-
ఆత్మ భార్యానురాగుఁడై యవ్వ, సుప్ర - భుండు నాయన మిత మతిఁ బొరసి యుండ,
ఘన సమితిఁ బొంగు గాంచుచు ఘనత నెసఁగఁ - బారువాఁడెంత వాఁడైన వరలఁ గలఁడు? ౮.
ఆత్మభా (తన కాంతి) చేత ఆర్యులయెడ అనురాగము కలవాఁడై, ఆ వసు ప్రభుండు నాయ (నీతి చేత), నమిత (నమ్రమైన) బుద్ధిని, పొరసి (పొంది) యుండఁగా, ఘన సమితి (గొప్ప రణము) నందు పొంగుఁగాంచుచు (గర్వించుచు)ఘనతను ఎసగగా (గర్వముననొప్పఁగా) ఎంత (గొప్పబలము కల) వాఁడైనను పాఱు (పఱుగిడు) వాడు అగును.వఱలఁ (ప్రకాశించ) గలఁడా?
వః-
ఆ ప్రవరాఖ్యుండగు వసురాజు. ౯.
ఆ ప్రసిద్ధ నామము గల వసు రాజు,
గీః-
పాడి పంటలఁ దనరు జీవనము గల్గి - యింబడర, ఘన కోలాహలంబు పెఱిగి,
పైనఁ బడి శుక్తిమతి నాగ, దాని పని మ - దిని దలఁచి సచ్చరణ భవ ఘనత నెట్టె. ౧౦.
సమస్తమైన పంటలను ఫలింపఁ జేయుట యందు తనరుచున్నజీ(జీవనాధారమైన)వనము(నీరు)కలిగి, ఇంబు (చక్కదనముతో)అడరు (ఒప్పు) చుండగా , శుక్తిమతీ నదిని,ఘనమైన కోలాహల పర్వతము పెఱిగి, పైనఁ బడి అగన్ (ఆగిపోవు విధముగ) అడ్డగింపగా, దాని (ఆ కోలాహలుని) పనిని మదిఁదలచి, సత్ (యోగ్యమైన) చరణభవము (గోటి) యొక్క ఘనత చేత పాడియని భావించి, నెట్టెను.ఇది 2 / 14 వ భాగము .(సశేషం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.