గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, నవంబర్ 2024, శుక్రవారం

ఉపదేశో హి మూర్ఖాణాం. ... మేలిమిబంగారం మన సంస్కృతి

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఉపదేశో హి మూర్ఖాణాం  -  ప్రకోపాయా న శాంతయే ౹

పయః పానం భుజంగనాం   -  కేవలం విష్వవర్ధనం ౹౹

తే.గీ.  మూర్ఖులకుబోధ చేయుట మూఢగుణము,

కోపమే పెంచు వానిలో, కొనఁడు శాంతి,

పాలు పోయుచు పెంచినన్ బాములోన

విషమె వృద్ధియౌ నిజమిది, వేదవేద్య!     

భావము.  మూర్ఖులకు ఉపదేశం చెయ్యడం వల్ల వాళ్లకు కోపం తెప్పించడం 

అవుతుందే కానీ వాళ్ళని శాంతపరచలేము.సరి చెయ్యలేము.పాములకు 

పాలు పొయ్యడం వల్ల వాటి విషం వృద్ధి అవుతుంది.

జైహింద్.

సౌందర్య లహరి 66-70పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు,సంగీతం, గానము ... శ్రీమతి వల్లూరి సరస్వతి.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

దర్శనం మాసపతిక నిర్వాహకులు మరుమామల సహోదరులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానందగణపతులవారికి చేయుచున్న గురువందనం సందర్భముగా ఆలపించిన ప్రశంసాగీతం.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.


14, నవంబర్ 2024, గురువారం

అనాలోక్య వ్యయం కర్తా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అనాలోక్య వ్యయం కర్తా - అనాథః కలహప్రియః 

ఆతురః సర్వకార్యేషు - నరశ్శీఘ్రం వినస్యతి.

చాణక్యనీతి.

తే.గీ. చింతచేయక వ్యయమును చేయువాఁడు,

కలహమునకు తానొక్కఁడే వెడలువాఁడు 

నన్నిపనులఁ దొందరపాటునున్న వాఁడు

నట్టి నరుఁడు నశించునో యమరవినుత!

భావము.  ముందువెనుకలు చూచుకొనకుండా ధనమును వెచ్చించు వాఁడు, 

ఒంటరిగా కలహమునకు సిద్దపడువాఁడు, అన్నిపనులయందు ఆతురతతో 

ప్రవర్తించువాఁడు, ఐన నరుఁడు నశించిపోవును.

జైహింద్.

సౌందర్య లహరి 61-65పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

13, నవంబర్ 2024, బుధవారం

సౌందర్యలహరి 56-60పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం ... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

12, నవంబర్ 2024, మంగళవారం

ఉపయుక్తంతు నా దద్యాత్వ. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఉపయుక్తంతు నా దద్యాత్వ  -  ర్తికార్థంతు సాధకః

ఉపాదద్యాన్నూత్నమేవ  -  సతతం శ్రీ వివృద్ధయే.

తే.గీ.  వాడియున్నట్టి యారిన వత్తులనిడి

దీపమును పెట్టరాదిల దేవుని కడ,

చేసి క్రొత్తగా వత్తులన్ శ్రీప్రదముగ

పెట్టుటొప్పును దీపమ్ము విజ్ఞులార!

భావము.  సాధకుఁడి పూజాదికములలో దీపముపెట్టగా ఘనమైన 

ఆ దీపపు వత్తులతో మరల దీపారాధన చేయరాదు.  మంగళములు 

కలుగుటకు దీపారాధన నూతనమైన వత్తులతోనే చేయవలెను.

జైహింద్.

సౌందర్యలహరి పద్యాలు 51-55. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం...శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

11, నవంబర్ 2024, సోమవారం

ధాత్రీఫలాన్ అమావాస్యా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ధాత్రీఫలాన్ ఆమావాస్యా   -  అష్టమీ నవమీసుచ,

రవివారే చ సంక్రాంతౌ   -  సంస్మరేన్మునిపుంగవాః.

తే.గీ.  ఆదివారంబమావాస్య, నష్టమి మరి,

నవమి, సంక్రాంతులందు, మానవు లుసిరిని

తినగరాదు స్మరణ చేయఁగనగుననుచు

మునులు తెలిపిరి వినుఁడయ్య! పూజ్యులార!

భావము.  అమావాస్య, అష్టమి, నవమి, ఆదివారము, సంక్రాంతులందు 

ఉసిరికాయ తినరాదు. స్మరణమాత్రము  చేయవలెను అని మునిపుంగవులు 

తెలిపియున్నారు.

జైహింద్.

డా. బోచ్కర్ ఓంప్రకాశ్ గారి గ్రంథత్రయ పరిచయ సభలో డా. వేదాల గాయత్రీదేవికి పురస్కారప్రదానం.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

సౌందర్యలహరి 46-50పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం ... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

10, నవంబర్ 2024, ఆదివారం

సౌందర్య లహరి 41-45 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం,గానం... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

9, నవంబర్ 2024, శనివారం

బ్రహ్మశ్రీ పరమాత్ముని శ్రీదత్తశర్మ మా గృహమునకు విచ్చేసి మాకానందం కలిగించిన సందర్భముగా ......

0 comments

 జైశ్రీరామ్.

గుంటూరు వాస్తవ్యులు వారిని సత్కరించుకొనే భాగ్యం ఆ అమ్మవారు నాకు ప్రసాదించారు..🙏🏻

శా.  శ్రీమన్మంగళ దత్తనామమహితుల్ శ్రీమంతులౌ దత్తులే

ప్రేమన్ వచ్చిరి మద్గృహంబు మదిలో విశ్వాసమొప్పారగా

శ్రీమాతా! కృపజూడుమీ మహితులన్, చిత్తంబునన్ నిల్చి, నీ

ప్రేమన్ గావుము వీరలన్ శుభములన్ ప్రీతిన్ సదా గొల్పుమా.

జైహింద్.

సౌందర్యలహరి 36-40పద్యాలు. రచనశ్రీచింతారామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

8, నవంబర్ 2024, శుక్రవారం

సౌందర్యలహరి 31-35పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం ... శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, నవంబర్ 2024, గురువారం

సౌందర్యలహరి 26 - 30పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, నవంబర్ 2024, బుధవారం

క యితి బ్రహ్మణో నామ,. ... మేలిమిబంగారం మన సంస్కృతి. కేశవాయ స్వాహా అని పరిషేచన లో మొదటగా అనుటకు ముఖ్య కారణం.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  క యితి బ్రహ్మణో నామ,  - ఈశోహం సర్వ దేహినాం,

ఆవాం తవాంగే సంభూతౌ  -  తస్మాత్ కేశవ నామవాన్.

తే.గీ.  కయన బ్రహ్మనామంబగు, కనుమ నేను

నీశుఁడను దేహులకు హరీ! యెపుడు మేము

నీదు దేహంబుననునుంట, నిఖిల పతిరొ!

కేశవుండుగ నీపేరు భాసిలునయ.

భావము.  కేశవ అను విష్ణునామములో క యనునది బ్రహ్మనామము, ఈశ అనునది 

శివనామము, సమస్తదేహములందు ఉండు కేశవుని దేహములో బ్రహ్మ, 

ఈశ్వరుఁడు ఉన్నందున విష్ణువునకు కేశన అను నామము లకుగెను. 

త్రిమూర్తులకు ప్రతీకగా నిలుచు ఈ కేశవ నామమే పూజాదికములలో 

ప్రథమముగా ఆచమనసమయమున చెప్పబడుచుండును. అంతటి 

వైశిష్ట్యము కలదీ కేశవ నామము.

జైహింద్.

ఆర్తానాం ఆర్తి హంతారం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఆర్తానాం ఆర్తి హంతారం - భీతానాం భయనాశనం

ద్విషతాం కాలదండం తం - రామచంద్రం నమామ్యహం.

తే.గీ.  ఆర్తులకునార్తిఁ బాపెడి యమృతమూర్తి,

భీతులకు భీతిఁ బాపెడి వేదమూర్తి,

ద్విషుల పాలిటి యముఁడగు దేవదేవుఁ

డట్టి శ్రీరామచంద్రునకంజలింతు.

భావము.  దుఃఖితుల దుఃఖమును నశింపఁ జేయువాఁడును,

భయపడువారి భయమును పోఁగొట్టువాఁడును, శత్రువులకు 

యమపాశమైనవాఁడు అగునట్టి రామచంద్రునకు నేను 

నమస్కరించుచున్నాను.  

జైహింద్.

సౌందర్యలహరి పద్యాలు 21-25. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, సంగీతం, గానం...శ్రీమతి వల్లూరి సరస్వతి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

5, నవంబర్ 2024, మంగళవారం

స వేద శాస్త్ర ధ్వని పూరితాని . ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  స వేద శాస్త్ర ధ్వని పూరితాని  - స విప్ర పాదోదక కర్దమాని |

స్వాహా స్వధాకార నిరంతరాణి - వైకుంఠ తుల్యాని గృహాణి తాని ||

తే.గీ.  వేదశాస్త్రాసాధననొప్పు వేశ్మ మొకటి,

వేదపండితులడుగిడు వీడదొకటి,

దేవపితృసేవలను దేల్చు దిష్ట్యమొకటి

కనగవైకుంఠసమమని కనగవలయు.   

భావము.  "ఏ ఇంట్లో వేదశాస్త్రాల ధ్వని ప్రతిధ్వనిస్తుందో, ఏ ఇంట్లో బ్రాహ్మణుల 

మరియు వేద పండితుల అడుగుల చిహ్నాలు ఉంటాయో, ఏ ఇంట్లో నిరంతరం

 దేవతల ఆరాధన (స్వాహాకారం), పితృవుల ఆరాధన (స్వధాకారం) 

జరుగుతుందో,  ఆ ఇల్లు సాక్షాత్ వైకుంఠంతో సమానమవుతుంది.

జైహింద్.