గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2022, మంగళవారం

సదృశం చేష్టతే స్వస్యాః..|| 3-33 ||..//.. ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే ..|| 3-34 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

   జై శ్రీరామ్.

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-33 ||

శ్లో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి|

ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి.

తే.గీ. అనుసరించు సత్ జ్ఞానియు నాత్మ ప్రకృతి,

యాత్మ ప్రకృతినే ప్రాణులు ననుసరింపఁ

గలవు గ్రహియింప, నిగ్రహ బల మదేమి

చేయఁ గల్గును? పార్థ! సు జ్ఞేయ మిదియె.

భావము.

జ్ఞానవంతుడైనా తన ప్రకృతి ననుసరించే వ్యవహరిస్తాడు. ప్రాణులు 

తమ ప్రకృతిని అనుసరిస్తాయి. నిగ్రహమేమి చేస్తుంది.

|| 3-34 ||

శ్లో. ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ|

తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ.

తే.గీ. ఇంద్రియము లన్నిటి విషయ మెంచి చూడ

రాగములు ద్వేషముల్గల్గు, ప్రథిత కర్మ

యోగి లోబడ రాదట్టి రాగములకు

ద్వేషముల కవే శత్రువుల్ తెలియుమిదియె.

భావము.

ప్రతి ఇంద్రియ విషయంలోను రాగాద్వేషాలు ఉంటాయి. కర్మయోగి వాటికి 

లోబడ రాదు. అవేఅతనికి శత్రువులు.

జైహింద్.

21, మార్చి 2022, సోమవారం

యే మే మతమిదం నిత్య..|| 3-31 ||..//..యే త్వేతదభ్యసూయన్తో..|| 3-32 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

  జై శ్రీరామ్.

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-31 ||

శ్లో. యే మే మతమిదం నిత్య మనుతిష్ఠన్తి మానవాః|

శ్రద్ధావన్తోऽనసూయన్తో ముచ్యన్తే తేऽపి కర్మభిః

తే.గీ. మత్సర రహితు లెవ్వారు మన్మతంబు

నాచరింతురో వారలుననుపమగతి

కర్మ బంధముల్ విడుదురు ఘనతరముగ.

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

నాయొక్క యీ మతాన్ని ఏమానవులు మత్సరం లేకుండా ఆచరిస్తారో, వాళ్ళు 

కూడా కర్మల నుండివిడుదల పొందుతారు.

|| 3-32 ||

శ్లోయే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|

సర్వజ్ఞాన విమూఢాం స్తాన్విద్ధి నష్టా నచేతసః

తే.గీ. యసూయాపరులు నా యభీష్ట మతము

ననుసరింపరో యా యజ్ఞు లనవరతము

జ్ఞానులందరిచేతను ఘనతరముగ

వంచితులగుచుందురిలను పార్థ! కనుమ.

భావము.

ఎవరైతే అసూయాపరులై నా మతాన్ని అనుష్టించరో తెలివి తక్కువ వాళ్ళు సర్వ

జ్ఞానములనుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో

జైహింద్.

20, మార్చి 2022, ఆదివారం

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 4వ పద్యము.

0 comments

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

 శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 4వ పద్యము

.రచన చింతా రామకృష్ణారావు

.గానం శ్రీ కుమార సూర్యనారాయణ. విజయవాడ.

4. శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్ నినున్ గొలిచెదన్ 

భక్తాగ్రగణ్యులు విముక్తిన్ గనన్ మిగుల రక్తిన్ నినున్ గొలుతురే. 

రక్తాక్షివై దురిత శక్తిప్రపూర్ణులను రక్తంబు చిందఁ గనుమా. 

యుక్తంబు లిచ్చుచు నయుక్తంబులన్ దరుము యుక్తిప్రదా వర సతీ!

భావము.

ఓ శ్రేష్టురాలివైన సతీమాతా! నీవు శక్తిని, ముక్తిని కలుగఁజేయు తల్లివని భక్తితో 

నిన్ను కొలిచెదను. గొప్ప భక్తులు ఈ సంసార బంధములనుండి విముక్తి 

పొందుట కొఱకు మెక్కిలి అనురక్తితో నిన్ను సేవించుదురు కదా. దుర్మార్గుల 

విషయమున నీవు కన్నులు కోపములురక రక్తము చిందువిధముగా 

శిక్షింపుము. ఓ యుక్తిని ప్రసాదించు తల్లీ! మాకు అనుభవింపఁదగినవే 

ప్రసాదింపుము. అయుక్తములయినవాటిని పోఁగొట్టుము.

 జైహింద్.

గోపాల పట్టణ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ నేరెళ్ళాంబ సుప్రభావిష్కరణ సందర్భముగా...

2 comments

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః

తేదీ 19 . 3 . 2022న దేవుడన్నారం సివారు గోపాల పట్ణం గ్రాంలో  కొలువై యున్న శ్రీశ్రీశ్రీ నేరేళ్ళాంబ అమ్మవారి సుప్రభాతమును రచించిన నాకు ఆలయ నిర్వాహకులయిన చిరంజీవి ఏడ్ల శ్రీనివాసు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పార్వతి దంపతులు వేదమంత్రములతో పూర్ణకలశముతో స్వాగతించుతూ ఆలయప్రవేశము చేయించుచున్న సందర్భములో....


జైహింద్.

16, మార్చి 2022, బుధవారం

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 3వపద్యము.

0 comments

🙏ఓం శ్రీమాత్రే నమః.🙏
శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటిలో 3వ పద్యము. 3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ గోరంగ లేము ధరణిన్, ధారాళ సత్ కవిత పారున్ నినుం గనిన శ్రీరమ్య తేజ నిలయా. పారాడు దుర్గతుల నేరీతిఁ బాపుదువొ చేరంగ నిన్ శుభ మతిన్, వారాహి నిన్ దలచు వారే మహాత్ములిల వారిన్ నుతింతును సతీ! భావము. ఓ సతీమాతా! నీ దివ్యమయిన రూపమును చూచినచో భూమిపై మరే రూపమును చూడవలెనని కోరలేమమ్మా. లక్ష్మీప్రదమయిన కాంతికి నిలయమయిన తల్లీ!నిన్ను చూచినచో ధారాళమయిన మంచి కవిత్వము ఉరకలు వేయుచు వచ్చును.ంఅంచి మనసుతో నిన్ను నేను చేరుట కొఱకు ఈ నడచుచున్న దుర్గతిని నీవు ఏ విధముగాపోగొట్టుదువో కదా.ఓ తల్లీ!నిన్ను భూమిపై నిన్ను తలచునటువంటివారే మహాత్ములమ్మా.

13, మార్చి 2022, ఆదివారం

ప్రకృతేర్గుణసమ్మూఢాః..|| 3-29 ||..//..మయి సర్వాణి కర్మాణి ..|| 3-30 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

  జై శ్రీరమ్.

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-29 ||

శ్లో. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు|

తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్.

తే.గీ. ప్రకృతి ధర్మంబుచేమోహ పరవశులయి

కర్మలన్ మున్గు మందులు, ఘనులు జ్ఞాన

రహిత మందుల నెన్నుచు మహిని తాము

చెదరఁ గొట్టగా రాదది మదిని దలచి.

భావము.

ప్రకృతి యొక్క గుణాల వలన మోహంలో పడిన వారు గుణ కర్మలలో 

మునుగుతుంటారు. సరిగాతెలియని మంద బుద్ధులను సర్వం తెలిసిన 

జ్ఞాని చెదర కొట్టరాదు.

|| 3-30 ||

శ్లో. మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|

నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః

తే.గీ. సర్వకర్మలన్ నా యందు సరగుననిడి,

చిత్తమున్ నిల్పి యాత్మలో, చెలఁగు మమత

నాశ మది వీడి యారాట మనునది విడి

యుద్ధమును జేయుమర్జునా! శ్రద్ధఁ గలిగి.

భావము.

సర్వ కర్మలను నా యందు సమర్పించి, చిత్తాన్ని ఆత్మలో నిలిపి, ఆశా 

మమకారాలను వదిలి,ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి.

జైహింద్.

12, మార్చి 2022, శనివారం

నిత్య కార్యక్రమాలలో సంస్కృతములో సంభాషణము.

0 comments

జైశ్రీరామ్.
నిత్య కార్యక్రమాలలో సంస్కృతములో  సంభాషణము.
జైహింద్.

అహమ్...భవాన్...భవతీ...ప్రయోగాల శిక్షణ సంస్కృతములో...

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

వందారు భక్తజన మందారమా! (శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము) లో 2...

0 comments

ఓం శ్రీమాత్రే నమః.🙏
శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము) లో 2వ పద్యము.

2. వందారు భక్తజన మందారమా! నిలుమ డెందంబునన్ కరుణతో, 
సౌందర్య రాశివయి డెందంబునన్ నిలువ నెందైన నిన్నె కననా. 
కందున్ నినున్ సతము, కందున్ త్వదీయ కృప, కందున్ శుభంబుల నిలన్. 
వందే జగజ్జనని ముందుండి నా  కనుల విందై కనంబడు సతీ!

భావము.
నమస్కరించుచున్న భక్తుల పాలిట కల్పవృక్షమా! కరుణతో కూడుకొన్నదానువయి నా హృదయములో స్థిరముగా ఉండుము. పోతపోసిన సౌందర్యముతో నొప్పుచు నా హృదయమున నీవు నిలిచి యున్నచో నేను అంతటనూ నెన్నే చూడఁ గలుగుదును కదా. ఎల్లప్పుడూ నిన్నే చూచుచుందును, నీ కృపనే చూచుచుందును. ఈ భూమిపై శుభములనే చూచుదును. ఓ లోకమాతా! నీకు నమస్కారము. ఓ సతీదేవీ! నా కనులకు ఆనందము కలుగు విధముగా కనబడుమమ్మా!
 🙏
అమ్మకు వందనములతో
చింతా రామకృష్ణారావు.

ప్రకృతేః క్రియమాణాని..|| 3-27 ||..//.. తత్త్వవిత్తు మహాబాహో..|| 3-28 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

 జై శ్రీరామ్..

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-27 ||

శ్లో. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|

అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే

తే.గీ. ప్రకృతి గుణములన్ కర్మలు వరలఁ గలవు,

మూఢుఁ డనుకొను తానిటన్ మూలముగ

నన్నిటికిని కారణమని, యహము వలన

జ్ఞాని తలఁపడటులకను జ్ఞానభస!

భావము.

ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి. అహంకారము 

వలన భ్రమించినమూఢుఁడు తానే కర్తనని తలపోస్తాడు.

|| 3-28 ||

శ్లో. తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః|

గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా సజ్జతే

తే.గీ. మహిత బల! గుణ కర్మల మహిత తత్వ

మెఱిగి యున్నట్టివాఁడు తా నెఱిఁగి గుణము

 గుణమునందె వర్తించెడు ననుచు, తగులు

కొనడు కర్మలలో తాను ఘనుఁ డతండె.

భావము.

మహాబలుడా! గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు 

గుణాలు గూణాలలో వర్తిస్తాయని తెలిసి కర్మలలో తగుల్కోడు.

జైహింద్.

11, మార్చి 2022, శుక్రవారం

తత్ర.. అత్ర..కుత్ర..సర్వత్ర. అన్యత్ర...ఏకత్ర..సంస్కృతంలో ప్రయోగాలు.

0 comments

జైశ్రీరామ్.
సంస్కృత పాఠములు.
జైహింద్.

సంస్కృతం నేర్చుకుందాం.

0 comments


పాండిత్యానికి ప్రతి రూపం విద్వన్మణి కొరిడే రాజన్న శాస్త్రి గారి వర్ధంతి సందర్భముగా నా నివాళి.

0 comments

 జైశ్రీరామ్.


పాండిత్యానికి ప్రతి రూపం విద్వన్మణి కొరిడే రాజన్న శాస్త్రి గారు.

నిరంతర పఠన మందే మనసును లగ్నం చేసి, సిద్ది పొందిన సాహితీ తాపసి కొరిడె రాజన్న శాస్త్రి. కావ్య వ్యాఖ్యల్లో మల్లినాథసూరి వలె, శాస్త్ర వ్యాఖ్యలలో అభినవ గుప్తుని వలె, శ్లేష రచనలో శ్రీహర్షుని వలె, కమనీయ కవితలో కాళిదాసు వలె వచన రచనలో దండి వలె, ప్రసంగాలలో కవిసామ్రాట్ వలె భాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజన్న శాస్త్రి. వేద వేదాంగ శాస్త్ర ఆగమ సకల కళలకు కాణాచి అయిన ధర్మపురి క్షేత్రంలో 1933 జూన్ 2న జన్మించిన శాస్త్రి, ఇంటి వద్ద వేద సంస్కృత అధ్యయనాలు చేసి, మహారాష్ట్ర, గుజరాత్, ఇతర ప్రాంతాలలో లబ్ద ప్రతిష్టులైన తాడూరి బాలకృష్ణ శాస్త్రి వద్ద కావ్య పాఠాలు, పాలెపు వేంకటరాయ శాస్త్రి చెంత, అద్వైత పూర్వ మీమాంసాదులను అభ్యసించారు. సంస్కృతాంధ్రాలలో ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉపాధ్యాయ, అధ్యాపక స్థాయి నుండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్య స్థాయికి, స్వయం కృషితో చేరుకున్నారు. మనోహర కవితాధారలను స్రవించడమే కాకుండా, అమర భాషలు శ్లేషలో రెండర్గాలతో “బలి పుష్ట విలసితం”అనే పేరుతో కాకి, రాజకీయ నేతక్షుద్రవ్యంలో సమానులే అనే భావం ప్రకటితమ య్యేలా, ఆయన ద్వర్తి లఘు రచన సమస్త భారతావనిలో అభిమాన పాత్రతకు కారణమైంది. అలాగే , “గణనాయక స్తవం” పేరుతో రచన… పైకి గణపతి ప్రార్ధన, తరచి చూడ, లోన నాయకుల ప్రస్తావన ఇమిడించుకుంది. “మధుపవి గీతి” లో తేనెను త్రాగుతున్న తుమ్మెదను వర్ణిస్తూ త్రాగుబోతు దుశ్చర్యలను శ్లేషార్థంతో విరచించారు. హరిహర స్తుతి మరో శ్లేష కావ్యం. చలన చిత్రాలు కళ, విజ్ఞానం అందించాల్సిన సాధనాలుగా ఉండాలని, కానీ అది హింస, అశ్లీలతతో కూడి ఉంటున్నాయని ఆవేదన భరిత సామాజిక బాధ్యతలు వ్యక్తీకరించారు. అలంకార శాస్త్ర గ్రంథం పరిష్కారమే కాకుండా, అల్లసాని పెద్దనామాత్యుని “మను చరిత్ర” లోని ధ్వని సిద్ధాంత అనువర్తనాన్ని పరిశోధన గ్రంథ రూపంలో వెలువరించి, ప్రతిభను చాటి చెప్పి, డాక్టరేట్ పొందారు. చిన్నయసూరి బాల వ్యాకరణానికి వ్యాఖ్యానం రాశారు. మరో రచన తారావళి గ్రంథం పండితామోదం పొంది, దివంగత ప్రధాని పీ.వీ.నరసింహా రావు ద్వారా సన్మానితుల చేసింది. దివాకర్ల సాహితి ట్రస్టు నుండి పురస్కార గ్రహీతలు అయినారు. స్వర్ణ భారతి పురస్కారం లభించింది. హైదరాబాద్ సంస్కృత భాషా ప్రచార సమితికి “వైస్ ఛాన్సలర్” గా పనిచేసి సంస్కృత భాషామ తల్లికి నీరాజనాలు అందించే కృషి జరిపారు. దివాకర్ల పండిత మండలిలో “భువన విజయం’ భారతా వరణం, శ్రీనాధ కనకాభిషేకాది రూపకాలలో విభిన్న పాత్రలు ధరించి జీవం పోశారు. తాము పుట్టువు నొంది, పెరిగిన ధర్మపురి క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహుని సుప్రభాత శ్లోకాలు, నిత్య ఉషోదయ ప్రతిధ్వనులుగా, కొనసాగుతూ వస్తున్నాయి. భర్తృహరి శతక త్రయంకు సంబంధించి చతుర్థ శతకం పేరున, 1987 లో “ఓరియంటల్ కాన్ఫరెన్స్” లో నూతన ఆవిష్కరణలు గావించి, విశేషాలను వివరించారు. “వసుమతీ వసుధాకరం” పేరుతో రాసిన సంస్కృత నాటకం, నాలుగు దశాబ్దాల నాటి సంస్కరణలపై వెలుగొంది ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమై, సంస్కృత భారతిలో ప్రచురితమైంది. “వింశతి శతా బ్దీయ సంస్కృత కావ్యామృతం” లో భారత.దేశ వాసులకు సుపరిచితులైన, 20 మంది మహాకవుల సరసన స్థానాన్ని పొందారు. షోడశ్రీ అనే 16 మంది భారతీయ సంస్కృత కవుల పరిచయంలో, రాజన్న శాస్త్రి కవిత్వం ముద్రితంగా నిలిచింది. “నిబంధ రత్న సముచ్చయము”, సరస్వత సుషమం, సూర్యోదయం, సాగరికా, సంవిద్, అమృతలతా, సంస్కృత శోధనా, సంస్కృత భారతి, మధురవాణి లాంటి అనేక పత్రికలలో వచ్చిన తమ రచనలను సంకలనం గావించారు. 3,500 శ్లోకాలతో కూడిన “ధర్మపురి క్షేత్రమహాత్మ్యం” క్రీస్తుశకం 930 నాటి, ప్రాచీన తాళపత్ర గ్రంథాల్ని, స్థానికులు పండితులు కశోజ్ఞల సదాశివ శాస్త్రికి సహకరించి, పరిష్కరించి, దేవస్థానానికి ప్రచురణార్థం అందజేశారు. లక్ష్మీ నరసింహ సుప్రభాతం, ప్రపత్తి, కాళేశ్వర స్తుతి, హరిహర స్తుతి లాంటి దేవత స్తుతులతో తమ కవిత మాధుర్యాన్ని రంగరించారు. తమ పాండిత్య ప్రతిభతో యావత్ దేశానికి బహుముఖీన సాహిత్య సేవలందించి, తెలంగాణ పూర్వ పండిత సంప్రదాయ వారసునిగా, ప్రతినిధిగా నిలిచిన కొరిడె రాజన్న శాస్త్రి, 2013 మార్చి 11న పాంచభౌతిక శరీరాన్ని త్యజించి, పర బ్రహ్మలీనులైనారు.

https://filmimonks.com/rajanna-shastri/


ఇంతటి మహనీయులయిన రొరిడే రాజన్నశాస్త్రిగారికి నా నివాళులు అర్పిస్తున్నాను.

జైహింద్.

06 . 3 . 2022వ తేదీన ఉపరాష్రపతి డా.వెంకయ్యనాయుఁడుశ్రీ మరుమామల దత్తాత్రేయశర్మరచించిన ముట్నూరి కృష్ణారావు సంపాదకీయములు గ్రంథావిష్కరణ చేసిన సందర్భముగా ఛాయాచిత్రములు.

0 comments

 జైశ్రీరామ్.

06 . 3 . 2022వ తేదీన ఉపరాష్రపతి డా.వెంకయ్యనాయుఁడుశ్రీ మరుమామల దత్తాత్రేయశర్మరచించిన 
ముట్నూరి కృష్ణారావు సంపాదకీయములు గ్రంథావిష్కరణ చేసిన సందర్భముగా
ఛాయాచిత్రములు.


జైహింద్.

సంస్కృత సరళ సంభాషణా శిక్షణ.

0 comments

జైశ్రీరామ్.
సంస్కృత సరళ సంభాషణా శిక్షణ.
హింద్.

సంస్కృతములో అంకెలు, సమయము చెప్పే విధానము వివరణము.

0 comments

జైశ్రీరామ్.
సంస్కృతములో అంకెలు, సమయము చెప్పే విధానము వివరణము.
జైహింద్.

సక్తాః కర్మణ్యవిద్వాంసో..|| 3-25 ||..//..న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం..|| 3-26 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

జైశ్రీరామ్

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-25 ||

శ్లో. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత|

కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్

తే.గీ. పార్థ! యజ్ఞాన వశులు తా పనుల నెట్లు

చేయుచుందురో యటులనే చేయుదు రిల

పనులు జ్ఞానులు లోకమున్ వరలఁ జేయ

నిరత నిష్కామ కర్ములై వరలుదురిల.

భావము.

అర్జునా! అజ్ఞానులు కర్మలతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక 

శ్రేయస్సు కోరుతూఅలాగే పని చేయాలి.

|| 3-26 ||

శ్లో బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|

జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్

తే.గీ. కర్మలన్ జిక్కు నజ్జాని కలుషబుద్ధి

నెపుడు చెదరగొట్టగరా దహీన మతులు,

తాను యోగంబులో నిల్చి తనపనులను

జేయుచున్, జేయఁ జేయనౌ, ధీయుతులయి.

భావము.

కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు. తాను 

యోగంలో నిలిచి చక్కగాపని చేస్తూ వాళ్ళని మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా 

ప్రోత్సహించాలి.

జైహింద్.

10, మార్చి 2022, గురువారం

యది హ్యహం న వర్తేయం..|| 3-23 ||..//..ఉత్సీదేయురిమే లోకా .. || 3-24 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

0 comments

 జై శ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-23 ||

శ్లో. యది హ్యహం వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః

తే.గీ. పార్థ! విశ్రాంతి గొనక నే పనులఁ జేయ

కున్న, నన్నుననుసరింత్రు మన్ననమున

జనులు కావున కర్మలన్ సలుపుచుందు

ఫలితమాశించనేర్వను, భవ్యమదియె.

భావము.

అర్జునా; నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే, మనుష్యులు 

అన్ని విధాలనామార్గమే అనుసరిస్తారు.

|| 3-24 ||

శ్లోఉత్సీదేయురిమే లోకా  కుర్యాం కర్మ చేదహమ్|

సఙ్కరస్య కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః

తే.గీ. కర్మ దూరుండ నయిన లోకములు నాశ

నమగు, వర్ణ సంకరమది నా వలననె

కలుగు, నేనె కారణముగా కాన యటుల

జరుగనీయక కర్మలు జరుపుచుందు.

భావము.

నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి. వర్ణ సంకరానికి

కారకుఁడనౌతాను. ప్రజలను నాశనం చేసిన వాఁడనౌతాను

జైహింద్.

నేరేళ్ళమ్మకు గ్రామస్తుల పూజ.

0 comments

జైశ్రీరామ్.
నేరేళ్ళమ్మకు గ్రామస్తుల పూజ.
జైనేరేళ్ళమ్మ తల్లీ!
జైహింద్.

గోపాలపట్టణం, నేరేళ్ళమ్మవారికి అభిషేక సేవ.

0 comments

జైశ్రీరామ్.
గోపాలపట్టణం, నేరేళ్ళమ్మవారికి  అభిషేక సేవ.
జై నేరేళ్ళమ్మ తల్లీ!
జైహింద్.