గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2013, గురువారం

శ్రీ వల్లభవఝలకృత శ్రీ భారతాంబికా శతకము.

1 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి.
మహాత్ములారా! మహనీయ సుకవి  శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కృత శ్రీ భారతాంబికా శతకము ఆద్యంతము పఠించి మీ అమూల్యమైన అభిప్రాయములను వ్రాయగలందులకు మనవి చేయు చున్నాను. ఇక పఠింప మనవి.
కవి వరులకు అభినందనలు.
జైహింద్.

17, జులై 2013, బుధవారం

అపర శంకరులైన ఆదిశంకరులవారి కృతులు.

0 comments

Compositions of Sri Adi Shankaracharya:
-------------------------------------------------

- A -
- Ananda Lahari
- Anathma Vigarhana Prakaranam
- Aparoksanubhuti
- Atma Bodha
- Atma Panchakam

- B -
- Bhagavad Gita Bhasya
- Bhagavan Manasa Pooja
- Bhaja Govindam
- Bhavani Ashtakam
- Bhavani Bhujangam
- Brahma Jnanavali Mala
- Brahma Sutra Bhasya

- D -
- Dakshinamurthy Ashtakam
- Dasa Sloka (Nirvana Dasakam)
- Devi Bhujangam
- Dhayashtakam

- G -
- Ganesha Pancha Ratnam
- Gangashtakam
- Gauri Dasakam
- Guru Ashtakam
- Guru Paduka Panchakam

- H -
- Hanumath Pancha Ratnam

- J -
- Jyotirlinga Stotram

- K -
- Kala Bhairava Ashtakam
- Kalpa Shaki Stavam
- Kanaka Dhara Stotram
- Kasi Panchakam
- Kaupina Panchakam

- L -
- Lakshmi Nrisimha Karavalamba Stotra
- Lalita Pancha Ratnam

- M -
- Manisha Panchakam
- Mantra Matruka pushpa Mala Stavam
- Maya Panchakam

- N -
- Nava Ratna Mala Stotram
- Nirguna Manasa Puja
- Nirvana Dasakam (Dasa Sloka)
- Nirvana Manjari
- Nirvana Shatakam
- Nirvanashtakam

- P -
- Panchikaranam
- Panduragashtakam
- Prashnottara Ratna Malika

- R -
- Rama Bhujangam
- Ranganashtakam

- S -
- Sadhana Panchakam
- Sata Sloki
- Shakti Peetha Stotram
- Shanmuga Stotram
- Sarada Bhujanga Prayathashtaka
- Shat Padi
- Shiva Ashtakam
- Shiva Bhujanga
- Shiva Manasa Puja
- Shivananda Lahari
- Shiva Pratah Smaran Stotram
- Siddhanta Tattva Vindu
- Soundarya Lahari
- Subhramanya Bhujangam
- Svarupanu Sandhashtakam
- Swarna Mala Stuthi

- T -
- Tattva Bodha
- Tripura Sundari Ashtakam
- Tripura Sundari Sannidhya Sthavam

- U -
- Uma Maheswara Stotra
- Upadesha Sahasri

- V -
- Vakya Sudha
- Vakya Vritti
- Vijnana Nauka
- Vishnu Bhujanga Stotram
- Viswanathashtakam
- Vivekachudamani

15, జులై 2013, సోమవారం

పాపముపశమించు గాక.మహనీయుల పవిత్రతకు భంగము వాటిల్లకుండు గాక.

2 comments

జైశ్రీరామ్.
నిరంతర మహనీయ మహద్బుణోపాసక మహిమాన్విత వాచస్పతి బ్రహ్మశ్రీ చాహంటి
ప్రియ భారతీయ సహోదరులారా!ఈ రోజు సుమారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో TV 9. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మహా ప్రవచకుల ఆధ్యాత్మికోపన్యాసంలో సాయి భక్తుల హృదయాలను కలవరపరిచే విధంగా మాటాడినట్లు చెప్పుతూ భక్తుల అభిప్రాయాలను తెలియ జేయమని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఐతే నేను విన్నంత మట్టుకు ఏ ఒక్కరూ కూడా శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి ఉపన్యాసాన్ని ఆక్షేపించిన వారు ఈ ప్రసారంలో కనబడలేదు.
మరి ఇటువంటి మహా ప్రవచనా వాచస్పతిపై బురద జల్లాలనే ఆలోచన ఈ టీవీ9 వారికి ఎందుకు కలిగిందో ఆ పరమాత్మకే తెలియాలి.
మహనీయులారా! మహాత్ములను శంకించంకండి. శంకించుతూ అధిక్షేపిస్తూ బురద జల్లే ప్రయత్నం చేసేవారెవరైనా ఈ విధంగా ఉన్నా మీరు సదసద్వివేకజ్ఞత కోల్పొకండి. ఎదియే నా మనవి.
మంచివారు భూమిపై ఆనందంగా బ్రతుకుతుంటే వారి చుట్టూ ఉన్న పదిమంది మంచినీ వారు కోరుతూ, నిరంతరం మంచెకే పాటుపడతారని మరువక, అట్టి మంచివారి మంచి ప్రయత్నాలకు మంచిగా ఎల్లప్పుడూ చేయూతనివ్వండి.
ఈ క్రింది ఆంగ్లభాషలో భావ వ్యక్తీకరణ చేసిన ఒక మహనీయుని మనో భావాన్ని చదివి తెలుసుకోండి.
Hii dear followers of pujya guruji BRAHMASREE CHAGANTI KOTESWARA RAO garu .... 
This is to inform you all that .. one of the NEWS channel in MEDIA which is getting the funds 
from unknown sources wanted to degrade our pujya guru ji and conducted a program 
today @5pm claiming that our guruji has hurt SAI BABA devotees by playing some clips of 
SAI CHARITRA pravachanam and MISLEADING the mass people, trying to create 
controversies among our UNITED HINDUISM ... 
So dear HINDUS.... you all know about Guruji .. He never hurt anyone, and does not even try 
to hurt.. So if any sai baba devotee asks you that did our guruji speak like that... plz give 
them the link of sai charitra pravachanam by guru garu and tell them to listen... if possible ...
make a CD and give them... ask them to listen carefully and ask them not come to any 
conclusions without listening to that pravachanam... . 
and see the GOD's grace.. they started the program @ 5 which will usually end at 6 ... but 
today they have cut short to 5.37pm .... 
Thanks to Ex - TTD EO ... and also to BRAHMANA SEVA SAMITI chairman ....
Jai Sree RAM ... Jai Hind...
********* by ADMIN .... not guruji or not by any member of GURUVANI or 

srichaganti.net TEAM...
సత్యమేవ జయతే
జైహింద్.

గంగపాలైన మనవారి ఆత్మలకు శాంతి కలగాలని మనసారా కోరుకొందాం.

1 comments


గంగపాలైన మనవారి ఆత్మలకు శాంతి కలగాలని మనసారా కోరుకొందాం.

పరవశమంది దైవమును భక్తిఁగ కొల్వఁగ నేగి, శ్రీమహే
శ్వరుని పవిత్ర భూమిఁ గని భక్తిఁగ దర్శన పారవశ్యులై
తిరుగుచు నుండగా జలధి దీర్ఘ హిమాద్రి కడంగి వచ్చిన
ట్లురకలు వేసి గంగ తన యుద్ధృతి నెల్లర గొంచు పర్విడెన్.

ఉరుకుచు వచ్చు గంగఁ గని ఊరు జనంబులు, భక్త కోటియున్
హర హర శంకరా! కను మహాప్రళయంబటు వచ్చి గంగ యం
దరినిస్పృశించి లాగుకొని దర్పిలి చంపుచు నుండె. మేము సుం
దరుఁడవు నిన్ను చూడగను తప్పక వచ్చితి మయ్య. కావుమా!

అని తమ గోడు చెప్పుచు, మహా ప్రళయంబటు వచ్చు గంగచే
కొనబడు వారు కొందరును, ఘోర విపత్తు నధిక్రమింపగా
వనములవైపు పర్విడుచు బాధల నొందెడి వారు కొందరున్.
క్షణములలోన సర్వమును గంగ గ్రహింపగ నేడ్చు కొందరున్.

ఆకాశంబున చిల్లు పడ్డయటులే యత్యంత వేగంబుగా
నేకంబౌనటు భూనభంబు లకటా!ఎన్నంగ రానట్టి ఈ
లోకుల్ గానని వాన వచ్చె నిట ముల్లోకంబులున్ భీతిలన్
నీకున్ బట్టదొ? పార్వతీశ! మము మున్నీటన్ మునింగింతువా?

గట్టుకు పుట్ట కొక్కరుగ కాలయమున్ గని పర్వుతీసినా
రెట్టులనైన బాంధవుల నెల్లరి గూడగ నెంచి భీతితో
జుట్టిన గంగ కందక వసుంధరపై బ్రతుకంగ నాశతో.
పట్టును వీడి కొందరు శవంబులుగానయిరయ్య. శంకరా!

నిన్ను గనంగ వచ్చుతరి నీటను ముంచుట న్యాయమా శివా?
మున్నెపుడైన యిట్టి జడుపున్ గలిగించితొ? జాలి లేదొకో?
మన్ననతోడ భక్తుల సమాదరణంబున కాచు నీవె యీ
మిన్నగు దుఃఖహేతువయి మింటికి భక్తుల చేర్చ నెంచితే?

అమ్మయె చంపగ నెంచిన
నిమ్మనుజులఁ గావ నింక నెవ్వరు కలుగున్?
మమ్ముం గొనిపోదువె గం
గమ్మా? కృప లేదటమ్మ? కాతు రెవరికన్?

అని ప్రార్థిస్తూ, చేసేది లేక

బంధువులు మమ్మల్ని మన్నించండి. మమ్మల్ని గంగమ్మ గొనొపోతోంది. మీతో చెప్పకుండానే పోతున్నందుకు మన్నించ్చండి. 
అని దుఃఖిస్తూ గంగపాలైన మనవారి ఆత్మలకు శాంతి కలగాలని మనసారా కోరుకొందాం.
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః.

14, జులై 2013, ఆదివారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 5.

0 comments

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: అజ్ఞానా దథవా జ్ఞానాదుత్తమః శ్లోకనామ యత్ 
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథా నలః (భాగవతము 6-2-18)
గీ: గడ్డి మేటునె యగ్గి తా కాల్చినట్లు
తెలిసి హరి యను భక్తుల,తెలియకుండ
హరిని పలికెడి భక్తుల దురిత తతిని
కాల్చివేయును. హరినామ ఘనత గనుమ. 
భావము: అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే  ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును. 
జైహింద్. 

13, జులై 2013, శనివారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 4.

1 comments

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప్త ఆహతః 
హరిరిత్యవశే నాహ పుమాన్ నార్హతి యాతనాః (భాగవతము 6-2-15)
గీ: పడెడి వేళల, జారుచు పడెడి వేళ,
గాయమగునప్డు,హానియే కలుగు నపుడు,
రోగ పీడన బాధచే రోయునపుడు
హరి హరీ యన యాతనల్ కరిగి పోవు.
భావము: పైనుండి క్రింద పడినపుడు గాని, నడచుచు జారినపుడు గాని, శరీరమునకు గాయము తగిలినపుడు గాని, సర్పాది క్రూర జంతువుల వలన హాని కలిగినపుడు గాని, రోగపీడితుడైనపుడు లేదా ఇతరులు శిక్షించినపుడు గాని ఎవరు కృష్ణ, హరి, నారాయణ అను నామములను ఉచ్చరించుదురో వారికి ఎన్నడును నరక బాధ కలుగదు.
జైహింద్.

12, జులై 2013, శుక్రవారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 3.

1 comments

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)
గీ: ఐహికంబుల కాశించి హరిని పలుక,
హేళనముఁ జేయ నితరుల పలుక హరిని,
గానమును చేయ, నశ్రద్ధగా హరి యన
అట్టి వారల పాపాళి యిట్టె పోవు.
భావము: ప్రాపంచిక ఫలితములనాశించి గాని ఇతరులను హేళన చేయు ఉద్దేశ్యముతో గాని, గానము చేయవలెనని గాని, ఆశ్రద్ధతో గాని వైకుంఠుని నామమును ఎవరు ఆశ్రయించుదురో, వారి అశేష పాపములు హరింపబడును.  ఈ విషయమును శాస్త్రవేత్తలగు భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు. 
జైహింద్.

11, జులై 2013, గురువారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 2.

0 comments

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: న నిష్క్రుతై రుదితై: బ్రహ్మ వాదిభి
స్తథా విశుధ్యత్యఘవాన్ వ్రాతాదిభి:
యథా హరేర్నామ పదైరుదాహృతై
సదుత్తమః శ్లోక గుణోపలంభకం (భాగవతము 6-2-11)
క: వ్రతముల చెప్పిన విధమున
గతిమార్చగ లేవు పాప కర్ముల దురితో
ద్గతి హరినామ మహాత్మ్యం
బతులితముగ బాపి కాచు, ప్రాపుగ నిలుచున్.
భావము: చాన్ద్రాయణాది వ్రతములు పాపాత్ములను పాపముల నుండి శాస్త్రములలో చెప్పిన రీతిని తరింప జేయలేవు.  ఏలననగా, తాత్కాలిక వ్రతాదుల వలన పాప వాసన, పాప బీజము నశింపవు.  కాని కృష్ణ నామమును ఉచ్చరించుట వలన పూర్వక్రుత పాపమే గాక, పాపమునకు మూలకారణమగు అవిద్య గూడ తొలగి పోవును.  సమస్త పాపములనుండి రక్షించి ముక్తి నొసంగునది హరి నామమే కావున దీనికి మించిన వ్రతము వేరొకటి లేదు.  
జైహింద్.

10, జులై 2013, బుధవారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము1.

1 comments

జైశ్రీరామ్.
హరియను రెండక్షరములు హరియించును పాతకములు.
ఆర్యులారా! హరి నామోచ్చారణా మహహిమజ్ఞులారా!మీలో ఉప్పొంగే హరి భక్తికి కారణము ఈ క్రింది శ్లోకం చూచినప్పుడు నాకు స్పష్టమైంది
శ్లో: అయం హి కృత నిర్వేశో జన్మకోట్యంహసామపి
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః (భాగవతము 6-2-7)
క: హరి యను నామోచ్చారణ 
హరియించును పాతకముల నసదృశ ఫణితిన్.
హరియే కనబడు లోపల,
హరియే కనిపించు బయట హరి భక్తులకున్. 
భావము: సమస్త పాపములను నశింపజేయుటయే హరి నామము యొక్క ప్రప్రథమ ధర్మము.  
దానికి ప్రమాణం ఏమనగా 
అజామిళుడు అవసానకాలమందు "నారాయణ" శబ్దము ముమ్మారు ఉచ్చరించి కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది భగవత్సాన్నిధ్యము జేరెను. ఇది కోరు మనవుడు సాధన చేయ వలెను
కళ్ళు మూసినప్పుడు ధ్యానంలోను, కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగితే సాధన సార్ధకమైనట్లే.  
జైహింద్. 

8, జులై 2013, సోమవారం

ప్రకృతి సమతుల్యతను చెడ దీసిన మానవ తప్పిదాలకు పరిహారం.పాపం ఎవరిది? శిక్ష ఎవరికి?

2 comments

హర హర మహా దేవ శంభో శంకరా!
ప్రకృతి సమతుల్యతను చెడ దీసిన మానవ తప్పిదాలకు పరిహారం.పాపం ఎవరిది? శిక్ష ఎవరికి?

పాపము ఉపశమించును గాక. 
స్వార్థపరులైనమానవ మూర్ఖులు ఇకనైనా పశ్చాత్తాప పడి  మేల్కొందురు గాక.
హరహర మహాదేవ.

శ్రీ వల్లభవఝల వారి అష్ట దళ పద్మ బంధ ఉత్పలమాల.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మన శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి ఇంత వరకు నూట ఎనిమిది చిత్ర కవితలను విరచించియున్నారు. ఈ అష్టోత్తర శత చిత్రకవితా కృతిని ఆ పరమాత్మకు అంకితము చేస్తూ అష్ట దళ బంధ ఉత్పల మాలను రచించారు చూడండి.
కవి వరులకభినందలు తెలియ జేస్తున్నాను.
జైహింద్.

6, జులై 2013, శనివారం

శ్రీ ఏ.వీ.రమణ రాజ లిఖిత కందమూలాల పరిశోధనాత్మక వ్యాసము.2వ భాగము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!9-6-2013న ప్రచురించిన శ్రీ ఏ.వీ.రమణ రాజ లిఖిత కందమూలాల పరిశోధనాత్మక వ్యాసము.2వ భాగము ఇప్పుడు చూడండి.
జైహింద్.

5, జులై 2013, శుక్రవారం

శ్రీ వల్లభవఝల కవి కృత పాదుకా బంధ సమానీ వృత్తము.

0 comments

జైశ్రీరామ్.
సుహృన్మణులారా! శ్రీ వల్లభవఝల కవి కృత పాదుకా బంధ సమానీ వృత్తమును చూడండి.
కవికి అభినందనలు.
జైహింద్.

4, జులై 2013, గురువారం

శ్రీ వల్లభవఝల కృత ఛత్రబంధ సుగంధి వృత్తము

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కృత ఛత్రబంధ సుగంధి వృత్తమును వీక్షించండి.
ఆర్యా. అభినందనలు.
జైహింద్.

3, జులై 2013, బుధవారం

శ్రీ వల్లభవఝల కవి కృత నారికేళ బంధగీతము

1 comments

జై శ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల కవి కృత నారికేళ బంధగీతమును వీక్షించండి.
శ్రీ వల్లభవఝల కవికి అభినందనలు.
జైహింద్.

2, జులై 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల కృత ఛురికా బంధము.

0 comments

జైశ్రీరామ్.
మహనీయులారా! శ్రీ వల్లభవఝల కృత ఛురికా బంధమును తిలకించండి.
ఆర్యులకు అభినందనలు.
జైహింద్.

1, జులై 2013, సోమవారం

శ్రీ పెద్దింటి వరాహ నరసింహాచార్యులు ఇక మనకు లేరు.

0 comments

ఓం నమశ్శివాయ.
ఆర్యులారా! చలన చిత్రములు ప్రభవించిన తొలి రోజులలో లవ-కుశ చలన చిత్రము(మాటలు లేని చిత్రము)లో నారద పాత్ర ధారులగు శ్రీ పెద్దింటి వరాహ నరసింహాచార్యుల వారు సామాజికులకందరికీ ఆదర్శమైన వ్యక్తి యని చెప్పుట అత్యుక్తి కానేరదు. వీరు ఆనాడు సంస్క్య్తాంధ్రములను గురువుల వద్ద నేర్చుకొనుటతో పాటు సంగీతము, నాట్యము, శిల్పము, చిత్ర లేఖనము మున్నగు విద్యలలో అందివేసిన చేయి కలవారు.వాస్తు, జ్యోతిష్యము పౌరోహిత్యము దేవతార్చన మున్నగు విద్యల విషయములో ఇక చెప్పనక్కరే లేదు.
వీరు గొప్ప కవిగా-వక్తగా-శిల్పిగా-చిత్రకారుడుగా-జ్యోతొశ్శాస్త్ర వేత్తగా-సంగీతగురువుగా-నటుడుగా-తెలుగు పాఠ్యాంశ బోధకునిగా-అతి సామాన్య నిరాడంబర జీవిగా-అన్ని రంగములందునూ ప్రతిభా పాటవములను కనపరచు వ్యక్తిగా మంచి పేరుప్రతిష్ఠలున్నవారు.
విశాఖపట్టణము జిల్లా యలమంచిలి తాలూకా, మామిడివాడ గ్రామమున అతి సామాన్య నిరాడంబర కుటుంబ జీవనము సాగించు వీరియెడ అందరికీ ఆదర భావముకలదు. ఈ మహనీయుడు చిన్నతనము నుండియునిన్న మొన్నటి వరకూ కూడా ఐదు కిలోమీటర్ల దూరమున కల యలమంచిలి గ్రామానికి సైకిలు త్రొక్కుకొనుచూ పోయెడివారు.వీరు సైకిలుపై  ఎక్కడికైనా వెళ్ళుట చూచినవారె ఎవరైనా తమ కారులో రమ్మని కోరినా, లేదా తమ మోటర్ సైకిల్ పై రమ్మని కోరినా తన ఆనందం వ్యక్తము చేయుచునే సున్నితముగా తిరస్కరించేవారు. ఏనాడూ అనారోగ్యమన్నదే అతడెరుగకపోవుట అచ్చటి ప్రజానీకమునకు విడ్డూరముగా తోచుట నిజము.ఇప్పటికి వారి వయస్సు తొంబది ఐదేళ్ళు.
ఈ మహనీయుడే నాకు ఆదర్శముగా నిలిచి, నేను నేటికినీ సైకిలుపైననే అనువైనంత దూరము ప్రయాణము చేయుచుండుటకు కారణము. నన్ను చూచి అనేకమంది డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా ఈ సైకిల్ ప్రయాణమును ఆదర్శముగా తీసుకొనుట నాకు మహదానందదాయకము.
అట్టి ఈ మహనీయుడును, నేనును దిమిలి గ్రామమున శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్ లో కలిసి కొంత కాలము పనిచేశాము.ఆ రోజులలో నా కవితావైశిష్ట్యమును కొనియాడుచూ నాకు మంచి కవితాసక్తిని పెంపొందించుటలో ముఖ్యపాత్ర వహించిరని కృతజ్ఞతా పూర్వకముగా తెలుపుకొను చున్నాను.
అత్తి మహనీయుడు నేటి మధ్యాహ్నము గం.3.00కు శ్రీ కైవల్యమునందినారను కఠినాతికఠినమైన వార్త నా మనసును కలచి వేస్సినది.
వీరు రచించిన అమృత బిందువులు గ్రంథము మానవునకు జీవన సత్యములను సుమారు రెండు వేలు పొందుపరచి లోకమునకు అందించిరి.
ఈ మహనీయుని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా ఆ పరమాత్మను ప్రార్థించుచూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపమును తెలియ జేయుచున్నాను.
వీరి అమృత బిందువులను అతి త్వరలో ధారా వాహికగా మీకందించే ప్రయత్నము చేయ గలను.
ఓం నమో భగవతే వాసుదేవాయ.

శ్రీ వల్లభవఝల కృత షడ్గోపుర బంధ కందము

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కృత షడ్గోపుర బంధ కందమును తిలకించండి.
కవిగారికి అభినందనలు.
జైహింద్.

30, జూన్ 2013, ఆదివారం

శ్రీ వల్లభవఝల కవి కృత వరాహ బంధ గీతము

0 comments

జైశ్రీరామ్.
చిత్రకవితాభిలాషులారా! మన వల్లభవఝల కవి కృత వరాహ బంధ గీతమును తిలకించండి.
వినూత్న ప్రయోగాలతో రచనలు సాగిస్తున్న శ్రీ వల్లభవఝల వారికి అభినందనలు.
జైహింద్.

29, జూన్ 2013, శనివారం

శ్రీ వల్లభవఝల వారి అష్ట దళ పద్మ బంధ హంసయాన వృత్తము

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల వారి అష్ట దళ పద్మ బంధ హంసయాన వృత్తమును తిలకించండి.
జైహింద్.

28, జూన్ 2013, శుక్రవారం

శ్రీ వల్లభవఝల కవి కృత చతురస్ర శకట చక్ర బంధ మాణవక వృత్తము

0 comments

జైశ్రీరామ్.
సుగుణాశ్రయులారా! శ్రీ వల్లభవఝల కృత చతురస్ర శకట చక్ర బంధ మాణవక వృత్తమును తిలకించండి. 
జైహింద్.

27, జూన్ 2013, గురువారం

శ్రీ వల్లభవఝల కవి కృత అంగుష్ట చక్రబంధ కందము

0 comments

జైశ్రీరామ్.
సహృదయమణులారా! శ్రీ వల్లభవఝల కవి కృత అంగుష్ట చక్రబంధ కందము తిలకించండి.
కవిగారికి అభినందనలు.
జైహింద్.

26, జూన్ 2013, బుధవారం

శ్రీ వల్లభవఝల వారి కులాల చక్రబంధ కందము

0 comments

జైశ్రీరామ్.
సుజనరంజకులారా! శ్రీ వల్లభవఝల వారి కులాల చక్రబంధ కందమును తిలకించండి.
చక్కగా వ్రాసేరకదూ!
జైహింద్.

25, జూన్ 2013, మంగళవారం

ఎంతటి ఘోర విపత్తు!!! శివ శివా!!! తప్పెవరిది? శిక్షెవరికి?

0 comments

శివ శివా!
అమ్మా! గంగమ్మ తల్లీ! ఇదేమాగ్రహమమ్మా నీకు? తప్పెవరిది? నీవు వేసిన శిక్షెవరికి?
హర హర! శంకరా! యనుచు హారతి పట్టగ నీకు నంబకున్
పరువిడి వచ్చి, భక్తతతి బాధల కోర్చి శ్రమించి నీ దయా
వరము గ్రహింప చూచు నిజ భక్తులకేమి యొసంగినావు? సు
స్థిరముగ నీ హృదాబ్జమున చేర్చఁగ గంగను పొంగఁ జేసితో?

ప్రాణము నిల్పు గంగ పొరపాటున పొంగిన పొంగ వచ్చు. నీ
ప్రాణ సమాన భక్తులను, భాగ్యమె నీవుగ నెంచు వారలన్,
దీన శరణ్య! కావుమని దీనముగా నిను కోరు వారలన్
గానక, ప్రాణ భీతులయి కానల పర్వుడఁ జేసితే? శివా!?

అమ్మా! గంగమ్మ తల్లీ!
పాపులకైన ముక్తినిడు పావనివీవని భక్తులెల్ల నీ
ప్రాపును కోరి వచ్చితిరి. భావ్యమె వారిని ముంచుటిట్టు? లే
పాప మెఱుంగనట్టి పసి పాపలు, వృద్ధులు, మాతృ మూర్తులున్
శాప ఫలంబు చేకొనిన చందమునన్ నిను చేరి పోయిరే!

ఏ దేవీ కుపితాగ్ని ఘోర కలియై యీశున్నిన్నునిర్జించెనో?
బాధాతప్తులఁ జేసి భక్తులను, సంభారాళితో ముంచెనో?
మేధావుల్, మహనీయ సాధు జనులున్, మేల్ చేయు దైవంబులున్,
నీ దారిన్ నిలువంగ నేరక వ్యధన్ నీలో లీనమై పోయిరే!

ఏమిటి నీ ప్రవాహ గతి? ఏమిటి నీయురకల్? జనంబు నీ
భూమిని, గ్రామ సీమలను, ముంచుచు ముందుకు సాగితేమి? మా
క్షేమము గూర్చు శంకరుని శీర్షముపై చెలువొందు నీవు నే
డేమిటికిట్లు చేసితివి? ఎంతటి పాపము కట్టుకొంటివో?

భక్తిగ తీర్థయాత్రలకు పర్విడి వచ్చిన భక్త కోటికిన్
భుక్తిని పాడు చేసితివి.పుట్టములన్ గొని పోయినావు. నీ
శక్తికి తాళ లేక కడు సంభ్రమమున్ వనపాళి జిక్కిరే?
భక్తుల భక్తి భావములు బాపగ చూచుట నీకు న్యాయమా?

ఇంకెప్పుడూ ఇలా భక్తులపై నీ ప్రతాపము చూపకు తల్లీ!
ఈ ఉపద్రవములో ప్రాణములు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించుగాక అని ఆ సదాశివుని వేడుకొంటూ వారి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకొంటున్నాను.
శివ శివా!

శ్రీ వల్లభవఝల కృత గుచ్ఛ బంధ మాణవక వృత్తము

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత గుచ్ఛ బంధ మాణవక వృత్తమును తిలకించండి.
మీరూ ప్రయత్నించి చిత్రకవులగుదురని ఆశించుదును.
జైహింద్.

24, జూన్ 2013, సోమవారం

శ్రీ వల్లభవఝల కవి కృత అష్ట దళ పద్మ బంధ మాణవక వృత్తము

0 comments

జైశ్రీరామ్.
సజ్జనానురక్తులారా!  శ్రీ వల్లభవఝల కవి కృత అష్ట దళ పద్మ బంధ మాణవక వృత్తమును తిలకించండి.
మీరూ చిత్రకవితానురక్తులే కదా! మరి వ్రాసే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు. తప్పక యత్నించి కృతకృత్యులగుదురని ఆశిస్తున్నాను.
జైహింద్.

23, జూన్ 2013, ఆదివారం

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రచించిన శివాలాపము 91 నుండి సాంతము. 10వ భాగము.

1 comments

జైశ్రీరామ్.
జ్ఞానామృత పాన లోలులారా! కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి కృత శివాలాపము నారికేళ పాకమో, కదళీ పాకమో, ద్రాక్షాపాకమో చదివి మీరే నిర్ణయించండి. తాను విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఈ శివాలాపము  రచన చేసిన సుకవి
 శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
ఇక చవిచూడండి ఈ శివాలాపము 10వ భాగాన్ని. నమస్తే.
శా:-
శాపంబిచ్చి, విమర్శికాగ్రిణుల గెల్చన్ తప్పు కాదా? కప
ర్దీ! పద్మమ్మునఁ దప్పు పట్టగనె నత్కీరున్ మహా రోగ సం
తాపుం జేసితి వెప్పుడో తుదకు నిన్ ధ్యానింప రక్షించినా
వాపై, నీ మహిమానుభావము భయంబౌనయ్య తల్చన్ శివా! 91.

శా:-
శ్రీనాధాది మహా కవీశ కవితా శ్రీ మగ్నభావుండ  వౌ
రా! నా కైత సు శబ్ద భావ సరసాలంకార పాక ధ్వని
శ్రీ నిర్వ్యూఢముఁ గాక యుండినను నిన్ జేఁ బట్టగాఁ జూచు స్నే
హానం దీని ననుగ్రహింపఁ గదవే, యానంద రూపా! శివా! 92.

శా:-
నీకంటెన్నొడ యుండు వేఱొకఁడు తండ్రీ! నాకు లేడయ్య. నీ
కా! కోకొల్లలు నిత్య పూజ రచనా కైంకర్య భావాత్ముల
స్తోక ధ్యాన తపో విధిక్రమ మహాత్ముల్ భక్తు లవ్వారికిన్
యే కొంచెంబునుఁ బోల్ప రాని నను నెట్లేఁ బ్రోవ వయ్యా! శివా! 93.

శా:-
ఊహాపోహలు నీకు నాకు నడుమన్ ఒక్కింతయున్ లేవు. సం
దేహింపం బని లేదు. సత్కరుణ సంధింపంగ వాంఛింతు. న
య్యా! హాలాహల ఘోర శౌర్య దళనానంత ప్రభావామల
శ్రీ  హేలా మధు మూర్తి! నిన్నును వినా సేవింప నేరిన్. శివా! 94.

 శా:-
వైముఖ్యబు ఘటిల్లు లౌక్య విషయ వ్యాపారముల్ పల్క తత్
శ్రీమద్భావము సుంత నిల్వదు తటిద్రేఖా ప్రభా భాసమై
స్వామీ! వెన్క మహాంధకారము సృజింపం జిత్రమయ్యా! కనుల్
తా మూయంగను, విచ్చినం దిమిర సంతానమ్మె తోచున్ శివా! 95.

శా:-
స్నేహంబీవు. వెలార్పదీవ.శిఖినై నే వెల్గునట్లున్ మహా
మోహ ధ్వాంతము విచ్చి చిద్రుపలుఁగాఁ బోకారునట్లున్ భవ
న్మాహాత్మ్యాంబుధి నోలలాడు నటులున్ మన్నింప రావే, సదా
నీహారాచల కన్యకా హృదయ నిర్ణిద్రైకభావా! శివా! 96.

శా:-
వేలున్ లక్షలు తత్ కృపాగతులు భావింపంగ నల్పాల్పమే
ధోలంకారితమౌ మదీయ భవముందూగాడునో త్వ న్మహా
లీలా సాగర వీచి మధ్యమున . కేళీ తాండవారంభ. దు
శ్శీలంబన్నది త్వత్ కటాక్షముల విచ్ఛిన్నంబు కాదో! శివా! 97.

శా:-
నే నేమీ యొక సత్ కవీశ్వరుని కానే కాను, కానీ, ప్రభూ!
ప్రాణాయామ పథాంతరోజ్వలిత! సర్వ జ్యోతి రూపా!సుర
క్షా!నా యీ కవనమ్ము నీ కరుణకై సత్యమ్ము మీదెత్తితిన్.
ఈ నా భక్తి పదార్పితంబు కద! నీకిష్టంబొ? కాదో? శివా! 98.

శా:-
పదియైదేడుల ప్రాయమందున తలంపం బద్య నిర్మాణ సం
పదకై యఱ్ఱులఁ జాచు నన్నుఁ గని, సంభావించి నా తండ్రి! కా
వ్య దశల్, తత్ కవితా రహస్యములు చెప్పన్ గాంచు మాయమ్మ స
మ్మదముల్ నేటికిఁ బండె నిట్లుగ భవన్మాహాత్మ్య లీలన్. శివా! 99.

మ:-
తలకున్ మించిన భారమిద్ది కృతి ముద్రా కార్య సంభార మం
చెలమిన్ నిస్పృహ నున్నచోఁ దనకు తానే కోరి మద్వాణి మి
క్కిలి పూన్కన్ ప్రకటింపఁ జేసిన హయగ్రీవున్ సుధా స్వాదు పే
శల భావున్, కరుణాంతరంగమునఁ గాంచం గోరెదయ్యా! శివా! 100.

శా:-
ఓ విశ్వేశ్వర! యో జగత్రయ గురో! యో విశ్వ రక్షా! శివా!
యో విశ్వోదయ! యో దయ గుణ నిధే! యో భక్త కల్పా! శివా!
యో వేద స్తుత! యో హృదంతర రుచీ! యో జ్ఞాన రూపా! శివా!
యో విశ్వాం తర సర్వ భూత హృదయ ధ్యేయైక దీపా! శివా! 101.
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి వతంస విరచిత శివాలాపము అను శతకము సమాప్తము. 
స్వస్తి. 
జైహింద్.