గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2013, గురువారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 2.

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: న నిష్క్రుతై రుదితై: బ్రహ్మ వాదిభి
స్తథా విశుధ్యత్యఘవాన్ వ్రాతాదిభి:
యథా హరేర్నామ పదైరుదాహృతై
సదుత్తమః శ్లోక గుణోపలంభకం (భాగవతము 6-2-11)
క: వ్రతముల చెప్పిన విధమున
గతిమార్చగ లేవు పాప కర్ముల దురితో
ద్గతి హరినామ మహాత్మ్యం
బతులితముగ బాపి కాచు, ప్రాపుగ నిలుచున్.
భావము: చాన్ద్రాయణాది వ్రతములు పాపాత్ములను పాపముల నుండి శాస్త్రములలో చెప్పిన రీతిని తరింప జేయలేవు.  ఏలననగా, తాత్కాలిక వ్రతాదుల వలన పాప వాసన, పాప బీజము నశింపవు.  కాని కృష్ణ నామమును ఉచ్చరించుట వలన పూర్వక్రుత పాపమే గాక, పాపమునకు మూలకారణమగు అవిద్య గూడ తొలగి పోవును.  సమస్త పాపములనుండి రక్షించి ముక్తి నొసంగునది హరి నామమే కావున దీనికి మించిన వ్రతము వేరొకటి లేదు.  
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.