గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2013, ఆదివారం

హరి నామోచ్చారణా మాహాత్మ్యము 5.

జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: అజ్ఞానా దథవా జ్ఞానాదుత్తమః శ్లోకనామ యత్ 
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథా నలః (భాగవతము 6-2-18)
గీ: గడ్డి మేటునె యగ్గి తా కాల్చినట్లు
తెలిసి హరి యను భక్తుల,తెలియకుండ
హరిని పలికెడి భక్తుల దురిత తతిని
కాల్చివేయును. హరినామ ఘనత గనుమ. 
భావము: అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే  ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును. 
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.