ఈసందర్భగా
12.Veera narayana.గారు తమ సందేశాన్ని అందఁజేశారు.
వీరి సందేశం.
అనంతలక్ష్మి , వీనా భమిడిపాటి .
వేదిక నలంకరించిన సాహితీవేత్తలు,పుంభావ సరస్వతులైన శ్రీ నరహరి గారు , శ్రీ చింతా రామకృష్ణ గారికి , రచయిత శ్రీ ప్రసాద్ గారికి, పెద్దలందరికీ నమస్కారములు.
సభకు విచ్చేసిన సాహితీవేత్తలు సాహితీ పిపాసులందరికీ అభినందనలు .
ప్రసాద్ గారిచే వందేభారత్ రైలు స్పీడ్ లో పద్య రచన చేయించిన గురువుగారు శ్రీ చింతా వారికి ప్రధమ నమః సుమాంజలులు.
అప్పుడప్పుడు అనిపిస్తుంది చింతా వారి సెల్ఫోన్ లో కీ బోర్డ్ గా పుట్టినా బాగుండేదని .
ఎందు చేతనంటే వేకువ జామునుండి రాత్రి వారు నిదురించే వరకు ఆ కీబోర్డు లో బటన్లు అమ్మ సంకీర్తనలు మాత్రమే పలుకుతాయి . ఎంత అదృష్టం వాటికి.
ఇక పుస్తకావిష్కరణ విషయమై
భావుకులు ప్రసాద్ గారి అక్షర తూణీరాలతో కూడిన ఈ పద్య సంపుటి తో సాహిత్య ఆకాశంలో ఒక నూతన చిరు నక్షత్రం మెరిసినట్లయిమంది.
ఈ చిరునక్షత్రం ధృవతారగా వెలగాలని ఆకాంక్షిస్తున్నాను.
వారు రాసిన పద్యాలలో ఉదాహరణకు కొన్ని పదాలు,
“గీత యొకటి చాలు గీటురాయి “ ,
”భవుని సతికి పూజ బతుకమ్మ పండుగే “
వంటివి నూతన ఒరవడితో విరాజిల్లాయి.
వారి పదాల చదరంగంలో, పాఠకుల మనసులు బందీలవుతాయి .
ఈ అద్భుత సృష్టికి ఇంకా ఎన్నో కవితా మణులు పుడతాయని ఆశిస్తున్నాను.
ఈ రోజు మనం ఒక అద్భుతమైన సాహిత్య క్షణానికి సాక్షులమవుతున్నాం.
ఈ కొత్త కవితా సంపుటి ఆవిష్కరణ కేవలం ఒక పుస్తక విడుదల మాత్రమే కాదు, భావాల పండుగ.
ఇలాంటి రచనలు మన ఆలోచనలను విస్తరింపజేస్తూమనసును స్పృశిస్తాయి.
మనమందరమూ బతుకుతున్నాము. కాని కవి మాత్రము జీవిస్తాడు.
జీవించడమంటే స్వేచ్ఛగా మనలోని భావుకతను వ్యక్తీకరించడమే. ప్రసాద్ గారు ఇప్పటి నుండి నూతన జీవనం ప్రారంభించి సఫలీకృతులు అయినట్టే.
స్వతహాగా లింగధారి యైనా, ప్రసాద్ గారు, శివ కేశవ అభేద భావన తో పద్య రచన సాగించడం ముదావహం.
ఈ విధంగా మన ఆర్ష సాంప్రదాయమైన సనాతనాన్ని ,
సు-నూతనంగా ,సునాయాసంగా,
సులలితంగా,సులభంగా,సునవీనంగా ,
సుమనోహరంగా,సూపర్ గా,
సుసంపన్నం గావించడం సంతోషకరం .
ఈ విధమైన పదాల మేళవింపు పూర్వజన్మ వాసనల పాశం కావచ్చు .ఆ సరస్వతీ మాత చరణ చారణం గాక మరేమి కాదు.
ప్రసాద్ గారు అన్ని పద్యాలు ఆటవెలది అనే ఉపజాతి చందస్సు లో రాశారు.
ఈ ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు మన కవి వేమన.
అందుకేనేమో మన హైదరాబాద్ ట్యాంకుబండు పైనున్న వేమన విగ్రహం క్రింద ఈ విధంగా రాసారు.
"ఆటవెలదిని ఈటె గా విసరిన దిట్ట.
చాందస భావాలకు తొలి అడ్డు కట్ట."
అని
ఇదే విధంగా ప్రసాద్ గారు కూడా ఆటవెలది చంధస్సుతో కొన్ని సామాజిక ఋగ్మతలని కూడ స్పృసించడం కాకతాళీయం.
ఈ అందమైన కవితా సంపుటిని మన ముందుకు తీసుకువచ్చిన ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.
సహకరించిన అత్తలూరి అన్నపూర్ణ విశాలాక్షి గారు మరియు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
వారి కలం ఇలాగే మరిన్ని అద్భుతాలను సృష్టించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ రెండు యాభై లు పద్య సంపుటి పాఠకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాము.
మన అత్తలూరి రామమోహన హన్మంత్ ప్రసాద్ గారి గురించి
చిన్న పదకవిత…
“ఇంజనీరుగా డిజైన్లతో పంటలకు నీటిని పరుగులు పెట్టించారు —ఆనాడు,(Irrigation dept)
ప్లాటినమ్ వయసున కూడ టేబుల్ టెన్నిస్ ఆటని వీడలేడు — ఈనాడు,
శ్రీమతి అన్నపూర్ణ విశాలాక్షి గారి మనసునలరిస్తున్నారు — ఎల్లనాడు,
శతవత్సరమున కూడ వీడరాదు ఈ రచనాంగం — ఏనాడు. “
వేమన కవి ఒక ఆటవెలది పద్యం లో
“అనువుగానిచోట అధికులమనరాదని……
రాశారు .
నేను అధికుడను కాను గావున ఇంతటితో విరమించుతున్నాను
అందరికీ ధన్యవాదాలు.
ప్రసాద్ దంపతులకు గౌరవ సత్కారంగా శాలువను సమర్పించుచున్నాము. స్వీకరించ ప్రార్థన.
ఈ సభకు సుమారు అరవై మంది పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన చిత్రమాలిక
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.