జైశ్రీరామ్.
ఇచ్ఛావాక్య సంఘట్టన కందం
కవిశరభ పెదమందడి వేంకటకృష్ణకవి (క్రీ.శ1888- 1943) దోమకొండ సంస్థానాస్థానకవి. ఈ కవివర్యుడు
తెలంగాణాలోని గద్వాలాది సంస్థానాలన్నిటిలోను సము
చితంగా సత్కరింపబడినాడు. వీరు అనేక రచనలు చేశారు.
వాటిలో నిర్వచనమహాభక్తవిజయం గొప్పరచన,నాలుగు
సంపుటాల గ్రంథం. అందులో మొదటి సంపుటం సురవరం
రంగారెడ్డిగారి(ప్రతాపరెడ్డిగారి చిన్నాన్న)ఆర్థిక సహకారంతో
ప్రచురితం.సురవరంరంగారెడ్డిగారిని గురించి వేంకటకృష్ణకవి
ఇచ్ఛావాక్యసంఘట్టనకందం రచించారు. ఆపద్యం-
క. కుసుమ శర రిపు వరద రం
గ సురంజితగాన మీరె కావుడి నను ని
త్య సుమన వినుత ప్రచురా
యసమనుత విహిత గుణ మురహరయదువీరా!
పై పద్యాన్ని కిందివలె నిలువుగ మూడు పంక్తులలో ఇలా
రాయాలి-
కు రి పు గ సు న మీ న ను న వి రా య వి హి ర హ రా
సు ర వ రంరం గా రె డి ని మ ను చు స త తముర వీ
మ శ ర ద జి త కా వు త్యసు త ప్ర మ ను గుణయ దు
పై పంక్తులను నిడివిగా క్రమంగ పైనుండికిందికీ,కిందినుండి
పైకీ చదివితే కందపద్యం ఉంటుంది.
పై మూడు అడ్డం పంక్తులలో మధ్యపంక్తిని వరుసగా చదివితే
సంఘట్టన ఇచ్ఛావాక్యం ఉంటుంది. ఆ వాక్యం-
సురవరం రంగారెడ్డిని మనుచు సతతము రవీ!
ఈ వివరాలు మా ఆత్మీయమిత్రులు డా.శ్రీరంగాచార్య,రిటైర్డ్
ప్రిన్సపాల్ గారు నా దగ్గర గ్రహించి తెలుగువిశ్వవిద్యాలయం
వారు2005లోప్రచురించిన చాటుపద్యరత్నావళిలో చేర్చారు
🙏🙏🙏
సమర్పణ
వైద్యంవేంకటేశ్వరాచార్యులు
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.