జైశ్రీరామ్.
శ్రీ వల్లభేయ ఛందోదర్పణము
అణిమా ఛందము
2.వ,భాగము,
14.శక్వరీ ఛందము,
(వెలసిన వృత్తములు,16.384.)
[ ప్రతి చరణమున 14.అక్షరము లుండును,ప్రాస నియమము కలదు,]
.1.వరమయ వృత్తము,
వరాంగ!పారగా!హరా!పరాత్పరా!శివా!
తిరంబు తీరు గూర్చుమా!విధేయుడం!సుమా!
తరింప దారి చూపుమా!తపింతు నెన్నడున్!
చిరాశ్రి వీవు!నామదిన్!స్థిరంబు నిల్వుమా!
వరామ వృత్తము,జ,ర,జ,ర,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-5462.
2.నరవర వృత్తము,
మనమున హరిం గొలుచు!మహితుండిలన్!
ధనమును సుజీవనము!దయయుం వరం
బొనరగ! పరార్ధమున!బుధతం జనున్!
కనగలడు మోక్షమును!కడకున్భళెన్!
నర వర వృత్తము,న,స…
[9:11 pm, 19/5/2026] Appala narasimhamurthy Vallabhavajhala: 54.హేతు భూత వృత్తము,
భవ బంధ!హేతు భూతమ్!బద్ధమ్!మనస్సే నౌ!
శ్రవణం!సుకీర్తనంబుల్!సర్వమ్!ధృవమ్!చిత్తమ్!
స వచా!విశేష!ధర్మమ్!సత్వమ్!సమోత్కృష్టమ్!
రవి తేజ!భాస్వ కీర్తిన్!రమ్యమ్!సదా!శైవమ్!
హేతు భూత వృత్తము,స,జ,మ,ర,గగ,గణములు
,యతి,9.వ,యక్షరము,వృ,సం;-1068.
55.సంస్తుత్య వృత్తము,
సత్యమ్!బ్రహ్మమ్!సదా నిత్యమ్!సర్వేశ్వరం బదే!
నిత్యమ్!జ్ఞానాభి ధామంబై!నీమానువర్తి యౌ!
కృత్యమ్!దైవాత్మకమ్!ముక్తిమ్!కీర్తి న్ద దామిదమ్!
భత్యం బేర్చున్!భవం బాపున్!భద్రాత్ము సంస్తుతిన్!
సంస్తుత్య వృత్తము,మ,ర,మ,ర,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-5137.
56.చెల్వపు వృత్తము,
నీటి బుడగ జీవమ్!నేడొ!రేపొ?మాయులే!
పోటి పడుమి!నీతిన్!పోడిమెంచు!ఖ్యాతిలన్!
తేట తెలుగు భాషన్!తెల్వి నొందు!సోదరా!
చేటు పనులు మానన్!చెల్వ మౌను!జీవితమ్!
చెల్వపు వృత్తము,భ,స,త,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5407.
57.జాతి తీర్చు వృత్తము,
జడ్డి తత్వ మేలయ్యా?జాతి తీర్చి దిద్దరా!
గడ్డురోజు లొచ్చెన్లే!కాయు నీతి పోకడన్!
సొడ్డుపెట్టి మ్రింగేవా?సోలిపోవు లోకమున్!
నెడ్డి కర్వు సర్వంబున్!నేర్మి కూర్మి నింపుమా!
జాతి తీర్చు వృత్తము,ర,య,,త,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5403.
58.సర్వమంగళ వృత్తము,
మిక్కుటమౌ!భక్తికే!మీన మేష,భ్రాంతిడెన్!
చక్కటి రాజ్యంబిదే?సర్వ మంగళంబగున్!
తక్కువ లేదీ భువిన్?ధర్మ రక్ష తోడవన్!
అక్కజమౌ!నీతినిన్?హర్ష మొప్ప నొప్పుమా!
సర్వమంగళ వృత్తము,భ,త,త,ర,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-5415.
59.లయకర వృత్తము,
వాసనా,విషయముల్!వర సమిథ,నేతుల్!
భాసిత జ్జ్వలనమే?మనస్థితపు !పాత్రై!
శాసితాశ్రిత!ధృతౌ!సమయ బడుటే?యౌ!
వాసిలున్!లయమునై!వరలు నదె?సుమ్మా!
భావము:-పంచేంద్రియములనే(ఐదుగురు ఱుత్విక్కులచే
విషయములనబడు నాజ్యముచే,వివిధములగు వాసనలనే
కట్టెలచే,మనోమయాగ్నిని యెప్పుడు హోమము చేయబడునో?
అప్పుడు ప్రపంచ మంతా లయమై పోవును,
లయకర వృత్తము,ర,న,భ,న,గగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-3027.
60.మనోహర,వృత్తము,
వివిధ కారకముల్!విమోహ సమోహముల్!
పవలు చర్యలవే!పరుండ గనంబడున్!
శివ మమేయ మదే?చిరామయ మోఘమౌ!
అవధి మీరు మనమ్!యనంత మనంతమై!
మనం=మనస్సు,
పవలు జీవు డనుభవించిన కష్ట సుఖములు,చర్య ప్రతి చర్యలు
చేయవలసిన ప్రతిక్రియలు అవధులుమీరి సాధించ గల్గినదే!కల!
అది శివమయము!సురా మయము,అమేయము,అనంతము,
అనుభవ పూర్వక మనోభావమే కల,అది నిజము కాదు,
నిరాధారము,,స్వేచ్ఛాయుత భావ మనోజ్ఞమే!కల,
మనోహర వృత్తము,న,భ,ర,స,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5816.
61.వేధిలు వృత్తము,
రస,విష,గంథక,రాజిత!ప్రయోగమై!
అసదృశ లీలస్వహాయె!తమ చైదమై!
దెస వెస నీతిని!ధీనత!దలిర్పగా!
వెసలు సమానత!వేధిలదె?భారతీ!
వెధిలు వృత్తము,న,జ,జ,స,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5000.
62.చెలంగు వృత్తము,
హంతక రాజకీయ హర్మ్య!విజ్ఞాన మేలన్!
చింతల కాలవాల చిన్ముద్రనౌను సుమ్మా!
పంతము నెంచె నేమొ?భద్రత గూర్చు దేవా!
సంతస మొంద!సర్వ జన్మలు!స్వేచ్ఛిలంగన్!
చెలంగు వృత్తము,భ,ర,జ,జ,గగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-2903.
63.రాజ్యకాంక్ష వృత్తము,
కాటు పోటు వేటు కాలమాయెలే!చూడగా!
చేట చెర్గి నీతి!చీటి చించెనే?భాగ్యమున్!
పోటు వాట మెల్ల!భూటకాలకే?వాటమై!.
రాటు దీరె!జాతి!రాజ్య కాంక్షయే!మోహతన్!
రాజ్యకాంక్ష వృత్తము,ర,జ,ర,య,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-4779.
64.తారాస్థాయి వృత్తము,
తేరే!సర్వంబెంచ!తేరు మోయు వారేరిలన్?
తారా స్థాయెంచ?దక్కునే?దలంప రేలనో?
పారా వారంబు! పట్ట దల్చ!వీలు నౌ నొకో?
మేర న్మీరంగ!!మట్టి పాలు గాక తప్పునే!
తారాస్థాయి వృత్తము,మ,త,ర,య,లగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-4869.
65.మోక్ష గామి,వృత్తము,
కామంబెంచు ముక్తికిన్!కాన గల్గు!స్వర్గమున్!
సామం బెంచు స్వచ్ఛతన్!సద్వరంబు!జాతికిన్!
నీమమ్! నిష్ట లేనిదే?నిల్చునే?శరీర మున్!
రామం బెంచి!మెల్గుమా!రమ్య జీవనం.బగున్!
మోక్షగామి వృత్తము,త,జ,త,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,5421.
66.దోచి దాచు వృత్తము,
పుట్ట పట్టు యెల్గులై!!భూతల!శ్రేయ మెల్లన్!
పట్టి పట్టి మాపుటే?భద్రత దందు రొక్కో?
పట్టి భావి జీవముల్!భ్రష్ట మదెంచ రేలన్?
ఇట్టి పాప చైదముల్!యేవగమౌ!తుదెంచన్!
ఎలుగు=భల్లూకము,
దోచి దాచు వృత్తము,ర,జ,త,జ,గగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం;-2859.
67.గండి గొట్టు వృత్తము,
గండి గొట్టి శ్రేయమున్!గంప నింప నెంచగన్?
దండమూను దైవమున్!దండ ధారి!చూచులే?
మొండి ఘోష!దండుగౌ!మోడువారు జీవముల్!
ఛెండ తత్వ మెంచకన్?జీవ మేర్చు నీతినిన్!
దండ ధారి=యమ ధర్మరాజు,
గండి గొట్టు వృత్తము,ర,జ,త,ర,లగ,గణములు,
యతి,.8,వయక్షరము,వృ,సం:-841.
68.విషతా వృత్తము,
పాలలోన విష చుక్క!ప్రాణ హాని జేయున్!
కాల తీరు దురహంబు!కాటు వేయు జాతిన్!
మేలు కాని చెడు యూహె?మీటు భావి నీటన్!
జాల మేల!పరమెంచ!సర్వ శ్రేయ మేర్చున్!
విషతా వృత్తము,ర,న,ర,జ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం;-2447.
69.మాయామయ వృత్తము,
తల్లి మాయ!పిల్ల మాయ!తల్లీ పిల్లే మాయై!
తెల్లమాయె!లోకమెల్ల!తిండి యొండే!నండై!
చెల్ల!నూక లెల్ల జాతి!చిల్లు చెంబై యొప్పెన్!
అల్ల!యేసు!ఈశు డైన!హాయి గూర్చన్!రారే!
మాయా మయ వృత్తము,ర,జ,ర,య,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం;-683.
70.ఓటుమాట,వృత్తము,
ఓటు మాట నోటు చిత్త!యున్న తెంచు దీక్షే?
గోటే?భూట కాటకంబు!కొంప లార్పు నైజమ్!
చేటే!వాట మాట తీరు!చీటి చింపు టాశే?
టాటా బిర్ల నెత్తి దన్ను!తల పెంచే!లోకమ్!
ఓటుమాట=పనికిరాని కబురునోటు చిత్తం=ధనార్జనా మనస్సు,
ఓటుమాట వృత్తము,ర,జ,ర,జ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-2729.
71.అతి స్థితి,వృత్తము,
అతి సామ్యమ్!యతి తీవ్రమ్!హర్షమా?భూతలిన్!
మితి మీర న్గతి మాయున్! మేతకే? చేతనౌ!
భృతి దోషమ్!క్షితి జేర్చున్!భుద్భుదమ్!జీవితమ్!
కృత కృత్యం చెడు గేర్చున్?కీడు నెంచు న్సదా!
అతి స్థితి వృత్తము,స,భ,మ,య,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-4660.
72.పరాన్న వృత్తము,
పరపాటు పొరపాటు పడబోకు!తప్పౌ!
నిరసించు పరభుక్తి!నిగుడే వదేలన్?
తర కీర్తి!చెడు బుద్ధి! తమ యిచ్ఛ మార్చన్!
వెరపౌర!సమతత్వ!బిగు వార్ప జూడన్!
పరాన్న వృత్తము,స,న,భ,జ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-2994.
73.తగని పని వృత్తము,
శ్వాన ,వేసడ రోద!సందర్భ భేద మదే!
హాని గూర్చెను!గాదె?యార్తేల?నందె దిలన్!
కానిపోనివి మప్ప!కాలార్తి! పాశ మగున్!
దీన రక్షకు పెట్టు!దిక్కేది?భూ తలినిన్!
తగని పని వృత్తము,ర,స,య,జ,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-6747.
74.మాన్య జీవ వృత్తము,
అన్య జీవాలతో!నాట!హంతంబుకే?నయా!
మాన్య జీవీవనన్?మంచి మార్గాన!సాగుమా!
ధన్య మేపారు!లోకాన!ధర్మంబు!వర్తిలున్!
స్థన్యము న్గ్రోలి!స్థన్యాన్నె!తప్పౌను?కొర్కంగ!
మాన్య జీవ వృత్తము,ర,ర,ర,ర,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-5266.
75.గాలి వాట,వృత్తము,
గాలి వాటపు జీవితమ్!కడకు నేమౌనో?
కాల దోషము!కర్మమున్!గడియు నేతీరో?
చీలె!సఖ్యము!స్వార్ధతన్! శివము లేదాయెన్?
కాలతీరను దోష తం గడగె సర్వంబున్!
గాలి వాట,వృత్తము,ర,స,జ,స,గగ,గణములు,
యతి,9.వ. యక్షరము,వృ,సం:-1883.
76.మాయ ఛేదనా వృత్తము,
మనసు మంచి చేత!మాయ ఛేదన మగున్!
మనుజు చేతన లెల్ల?మహిమేర్చు మనసే!
మనసు మించింది లేదు!మహి కీర్తిద మదే!
కను నశాంతంబుభాగ్య!కరమౌను!భువిన్!
మాయ ఛేదన వృత్తము,న,ర,జ,భ,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం;-9504.
77.సహజ సిద్ధ వృత్తము,
సహజ సిద్ధ సంస్కారమ్!సద్విలం బగున్!
అహరహమ్ !పఠేర్నిత్యమ్!హర్ష మౌ?నిలన్!
అహిత కార్య కర్తవ్యమ్!ఆర్తియౌ!తుదిన్!
సహన ముర్వి!సర్వార్థమ్!సామ్యమే?యగున్!
సహజ సిద్ధ వృత్తము,న,ర,మ,స,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-5656.
78.తెలివి వృత్తము,
చదువు రాని చాకలే!చక్క లెక్క చేయున్!
చదువు కన్న జ్ఞానమే?సంస్కరించు లోకమున్!
విధి విధాన స్వచ్ఛతే?విస్తరించు నీతిన్!
పదవి యాశదే?సుమా!పాడు జేయు సర్వమ్!
తెలివి వృత్తము,న,ర,జ,జ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-2904.
79.సంస్తుత్య వృత్తము,
సత్యమ్!బ్రహ్మమ్!సదా నిత్యమ్!సర్వేశంబదే!
నిత్య జ్ఞానాభి దామంబై!నీమాను వర్తియౌ!
కృత్యమ్!దైవాత్మకమ్!ముక్తిమ్!కీర్తిం దదామిదమ్!
భత్యం బేర్చున్!భవమ్ బాపున్!భద్రాత్ము!సంస్తుతిన్!
సంస్తుత్య వృత్తము,మ,ర,మ,ర,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృసం:-5137.
80.కాలజ్ఞాన వృత్తము,
భీషణ ఘోషణలే!భిభీషార్భటు లయెన్!
వేషము భాష లవే?వియత్తంటె!ననగా!
భూష విభూషలే?ప్రమాదా లలమన్?
విశేష వాగ్ఘరులే?వినాశం బలమెన్
కాల జ్ఞాన వృత్తము,భ,భ,ర,భ,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-7351.
81.తెలివిలు వృత్తము,
బడి ఘంట మ్రోగగా!వడి నేగు!చదువన్!
నెడ నెంచ బోకుమా!నిడుపైన!చెలిమిన్!
వడి సంతస మూనుచున్!పస పెంచు!తెల్విన్!
నడు నీతి చేతనన్!నయమొప్ప!భవితన్!
తెలివిలు వృత్తము,న,జ,భ,భ,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం;-7596.
82.ధర్మనిరతి వృత్తము,
మేను మంచి మనసున్!మనుజాళి మెచ్చగన్?
విను నీతి సతతమ్!వినుతింతు రెల్లన్!
చను ధర్మ నిరతిన్!జయ మౌను!సర్వదా!
మనుజన్మ వరదమౌ!మది మెచ్చు దైవమున్!
ధర్మ నిరతి వృత్తము,,ర,న,భ,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5563.
83,చలాయింపు వృత్తము,
బలంబొప్ప చలాయింపు!భవిత ఘాతమై!
కులం జబ్బు!కలం జిడ్డు!కులుకు లోపెగా!
తెలుంగెల్ల వెరం గొప్ప!దివిరె!చూడగా!
కొలే!మారె!తలపోయ!కువల యంబునన్!
చలాయింపు వృత్తము,య,స,భ,స,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-6032.
84.శివ రక్ష.వృత్తము,
తోలు తిత్తి లోని గాలి తొలగు రోజునన్!
మేలు కోరి వెంటరారు!విరుగు బంధమున్!
చేల మైన మేను వీడు!జిలుగు లేలయా?
ఫాల నేత్ర దిక్కు నీవె?బ్రతుక దింతె లే!
(పవన గుభిత చర్మ భస్త్రి=గాలితో నిండిన చర్మముగల దేహము).
శివ రక్ష వృత్తము,ర,జ,భ,స,లగ,గణములు
యతి,9.వ,యక్షరము,వృ,సం:-6059.
85.అనర్ధ వృత్తము,
చలిత త్ప్రేత!సాదృశ జన్మ మనర్థమౌ!
బలవ ద్హింస!దుష్కృతి!భద్రత శూన్యమౌ!
తలపన్లేవు!సద్వర ధర్మత!నైచ్యతన్!
విలువ ల్జార్చు!జీవన !వేధను!గూర్చుచున్!
అనర్థ వృత్తము,స,ర,స,స,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-5844.
86.తీరని నీతి వృత్తము,
తారలు ముద్దిడు కీర్తి!ధరణి భారతీ!
మేడలు దాటెను సామ్యమిలన్!శ్రీలచేన్!
పారెను ధర్మము, ప్తీతి!బలిదు లొద్దకున్!
తేరని నీతయె?జాతి కులుకు లోపగన్!
తీరని నీతి వృత్తము,భ,భ,భ,స,లగ,గణములు,
యతి.9.వ,యక్షరము,వృ,సం:-6071.
87.మంచెంచు వృత్తము,
పూర్వ జన్మ కర్మ శేషమ్!పూర్తి జేయు జీవా!
సర్వ కర్మ సాక్షి వొచున్!సాకు నీతి!ధాత్రిన్!
పర్వ మేర్చు జీవ ధాత్రిన్!పాడు నెంచ కోయీ!
సర్వ మేలె?శర్వు గొల్వన్!శ్రావ్య మౌను!ధాత్రిన్!
మంచెంచు వృత్రతము,,ర,,జ,మ,జ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-2603.
88.హర్షిలు వృత్తము,
అందరి స్వేచ్ఛయె!నెంతొ?యానందమదియే!
కొందరి శాంతత! పూర్తి! కూర్మెంచ బడకన్?
బంధు జనంబుల! ప్రీతి! బాగోత గరిమన్!
అందరి మేలెంచి!యొప్ప!హర్షించు!శివుడున్!
హర్షిలు వృత్తము,భ,త,ర,భ,లగ,గణములు,
యతి.9.,వ,యక్షరము,వృ,సం:-7335.
89.తగని. తెగువ,వృత్తము,
జగడాల మారీవు!జగతికే!ముప్పెంచన్!
పగ తప్పు!పారంబు!వగపుకే?మూలంబౌ!
నెడపెట్టు లోకాన్ని!చెడుప!శఖ్యంబౌనే?
తెగి పోవు!జీవాలు!తెరవదే?యార్తెంచున్!
తగని తెగువ వృత్తము,స,య,న,య,గగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-973.
90.ఱుణ బాధ వృత్తము,
పాలకుండ!విష చుక్క!పట్టి చంపి తీరున్!
నేల దుష్టు డొక డుండ!నీల్గు దేశ!ఖ్యాతే!
తూలెదేల?సమతంచు!తుప్పునీతి బట్టెన్!
తలమించు!ఱుణ మాయె!తట్టు కొందు మెట్లో?
ఱుణ బాధ వృత్తము,ర,న,ర,జ,గగ,గణములు,
యతి.9.వ,యక్షరము,వృ,సం:-1567.
91.మారు తీరువృత్తము,
తిన్నదే!దక్కు ననెండు!తెల్వరు లుండిరే!
మిన్నయౌ నీతి యటంచు!మన్నుట!న్యాయమే?
కన్నడే?మిన్న యనంగ!కావబడున్!తుదిన్!
చెన్ను శ్రీ మార్గ మొసంగ!జేయవలెన్!భువిన్!
( కన్నడు=కన్నము వేయువాడు దొంగ,)
మారు తీరు,వృత్తము,ర,భ,ర,స,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం;-5811.
92.దురాశా వృత్తము,
తిన్నదానితోడ తృప్తి దేలని యో నరా!
ఉన్నదెంత యున్న గాని!యోడక వాంఛిలన్!
పన్ను నౌనె?పాప భీతి పట్టని!మూర్ఖుడా!
దన్ను జార!వెన్ను జారు!తల్ప వదేమొకో?
దురాశా వృత్తము,ర,జ,ర,స,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-5803.
93.సువేధీ వృత్తము,
ఆర్తినిన్!ధైర్యంబు!యంచిత సంపదం దోర్మిన్!
పూర్తి విశ్వాశంబు!పొత్తగు!ధర్మ గమ్యంబున్!
కర్తవై!మంచెంచు!కర్మకు!సత్యతం బొప్పన్!
వర్తిలం? సర్వార్థ! వేధివి! యౌదిలన్! జీవా!
సువేధీ వృత్తము,ర,త,భ,ర,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1443.
94.ఛెండనీతి,వృత్తము,
కొండ మీది కోతైన!కోరి వచ్చి నిల్చునే!
దండి సొమ్ము యండైన!దాసియౌ?లోకమున్!
ఛెండ నీతి!సర్వంబు!శ్రీ వరంబై!జనన్!
బెండు తీర్ప శక్యంబె? విష్ణు మూర్తేనియున్!
ఛెండ నీతి వృత్తము,ర,య,జ,ర,లగ,గణములు,
యతి.8.వ,యక్షరము,వృ,సం:-5431.
95.ధర్మ వేదనా వృత్తము,
కంట బడ్డ దేదైనా!కా జేయు తీరాయెనే!
కొంటి బుద్ధి దౌర్జన్యమ్!కూర్మెంచు!లోకంబయెన్?
పంటి మాట లౌక్యంబై!పాపానుభూతాయెనే!
వెంట బెట్టె!ధర్మాన్నే?వేధించి కాటేసిరే!
ధర్మ వేధనా వృత్తము,ర,య,మ,య,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-4619.
96.కావ రండు వృత్తము,
నీరజాల వ్యోమమే?నిండు చీకటాయెనే?
పారమైన తెల్విచే?పండె!స్వీచ్ఛ పాపమున్!
చేరె జాతి నీతదే?చింత గూర్చె!పంతమున్!
కారణాలు యేవైనా!కావ రండు!భారతిన్!
కావరండు వృత్తము,ర,జ,త,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5323.
97.ఇహం తీరు,వృత్తము,
అవరోధముల పుట్ట!యహమొప్పె లోకమ్!
వ్యవహార విధులెల్ల!వరమాయె!జాతిన్!
నివహాలు పరహాని!నిగు డొప్పె!చూడన్?
భవ రోగములు బాప వలె నయ్య దేవా!
ఇహం తీరు వృత్తము,స,న,భ,జ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-3006.,
98.చేటు పాటు వృత్తము,
వాట మైన చేటు పాటు!వన్నె గూర్చె!కలిన్!
ఆట కాట కంబు పెచ్చె!హర్ష మేర్చె!నిటన్!
తేట తెన్గు భాష కొచ్చె!ధీన చింత!గనన్?
కోటి మేటి తీట దీర్ప!కూర్మి!రావ!శివా!
చేటు పాటు వృత్తము,ర,జ,ర,జ,లగ,గణములు,
యతి,9.వ యక్షరము,వృ,సం:-6827.
99.సన్మిత్ర వృత్తము,
సాటివారు తమవారు సమమనంగనన్!
మాటలాడు పరుషాలు!మనసు మార్పుకే!
పాటు నీతి వరలంగ!భవిత మార్పుకే?
పోటులాడ జన మాని!పొసగు మంచిగాన్!
సన్మిత్ర వృత్తము,ర,న,భ,స,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,భృ,సం:-5574.
100.న్యాయశీల వృత్తము,
మనసు మంచి నింపుచున్!మనుమి సఖ్యతన్!
మనుజ దైవ మీవనన్!మమత పెంచుమీ!
మనసు నీతి నింపుమీ!మహిత. జీవనన్!
సమత న్యాయ శీలతన్!సరగు!మిత్రమా!
న్యాయ శీల వృత్తము,న,ర,జ,స,లగ,గణములు,
యతి9.వ,యక్షరము,వృ,సం:-5976.
101.భూతి భాతి వృత్తము,
సుభూతి భాతి తెల్గు!సురా మోదమై!జనెన్!
విభూతి తెల్వి పెంపు విశుద్ధంబు నేర్చుమా!
ప్రభా విభావ భాస!ప్రబోధంబు!కీర్తిలన్!
ప్రభూతి మేథ సాధ్య!పదాంబోధి!కమ్మికన్!
భూతి భాతి వృత్తము,జ,ర,స,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5334.
102.అనిత్య వృత్తము,
కనినదే!సత్యమా!కర్మ సాక్షి లేనిచోన్?
వినుకలే?ధర్మమా!విశ్వశింప శక్యమా?
మనుజతే?శుద్ధమా?మర్మ చింత పొంతనన్!
తనువదే?నిత్యమా!తప్పు లొప్పు చొప్పునన్!
అనిత్య వృత్తము,న,త,త,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5320
103.స్థవా!శివా!వృత్తము,
సదానంద భావజాల!సమాశ్రి వీవయా!
చిదానంద మొంది నాడ!శివా!వశంకరా!.
సదామోద కావ్య మందు!సరంగుమా!హరా!
సు ధీరంబు నిమ్ము!హరా!సురాధి!దైవమా!
స్థవా!శివా!వృత్తము,య,జ,భ,ర,,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-6634.
104.సఖ్యతా వృత్తము,
మనసు మంచి నింపుచున్!మనుమి సఖ్యతన్!
మనుజ దైవ మీవనన్?మను మంచి పెంచున్!
మనసు నీతి నింపుమా!మహితు డీవనన్!
సుంత న్యాయ శీలతన్!సరగు మిత్రమా!
సఖ్యతా వృత్తము,న,ర,జ,స,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-5476.
105.చేతనా చర్య వృత్తము,
సీత వాతాతపాను కూల సృష్టి యేగదా!
చేతనాభావచర్య! చెర జీవ భ్రాంతియే?
కాతు వేనాటికైన!కర్మ కాష్ట్య!సామ్యతన్!
మేత నెంచంగ!సర్వ మిథ్య!మేలుకో?నరా!
చేతనా చర్య వృత్తము,ర,ర,జ,ర,లగ,గణములు,
యతి,10.వ,యక్షరము,వృ,సం:-5449.
106.వాయ గొట్టు వృత్తము,
చేయు తప్పు లెక్కించున్!చిత్ర గుప్తు డొక్కడే?
వాయ గొట్టి హింసించున్!పాయు నాడు కాలుడే?
శ్రీ యశుండ!నేనంటే?చిత్తు జేయును!దండమున్!
బాయు పాప చైదాలే?భద్రు గొల్వ నిచ్చెలున్!
( కాలుడే=యముడే పాయినాడు=శరీరమును విడుచు నపుడు).
వాయ గొట్టు వృత్తము,ర,య,ర,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5387,
107.అనర్థాశ్రిత వృత్తము,
అనర్థ మాశ్రిత లోక హర్ష వినాశ కమ్!
అనంత కీర్తి వి.శాల హర్మ్య!తిరోగమమ్!
కనంగ స్వార్థ వికార!కారక!మాశ్రితమ్!
మనంగ నౌనె?వి నోద మందుచు! జీవముల్!
అసర్థాశ్రిత వృత్తము,జ,భ,ర,స,లగ,గణములు,
యతి,9.యక్వషరము,వృ,సం:-5812.
108.భ్రమవిడు వృత్తము,
క్రమత లేని సమతే?కాయ కష్ట మేర్చున్!
భ్రమలు వీడి!మనుచో?భద్ర మౌను!లోకమ్!
అమర నీతి కధలే?ఆయువార్చు!భావిన్!
విమల మొప్ప జనుమా!విశ్వ ఖ్యాతి!నీదే!
భ్రమ విడు వృత్తము,న,భ,త,ర,లగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-1366.
109.ఊహాతీత వృత్తము,
నానా గోత్రా లేకం సేయన్!నానా రోగా లంటున్!
పోనీలేనీ!నైచ్యం బేనౌ? పోకార్చు న్జీవాలన్!
కానీ పోనీ కల్హాలేర్చున్! కాటేవేటౌ!ద్ధాత్రిన్!
దీనావాసమ్!దేహార్తే!నౌ!తెల్వే?వెఱ్ఱౌ!నెంచన్!
ఊహాతీత వృత్తము,మ,మ,మ,మ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం;-01.
110..సర్వమీవే వృత్తము,
తామసాహారానన్!తమ స్సాప!శక్య మౌనే?
కామ క్రోధావేశమ్!కడన్నొప్పురౌద్రం. బెంచన్!
నీమ నిష్టన్ నీతిన్!నెడం నిల్పు!సత్య మింతే!
సామ మెంచే జీవా!సదా చారి!సర్వ మీవే?
సర్వ మీవే వృత్తము,ర,మ,య,జ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2627.
111.నిర్విరామ వృత్తము,
తామసై!రాజర్షి!తత్వ తాత్వికంబు మీరెన్!
సామతన్!బ్రహ్మర్షి!సత్వ సాక్షి నిల్చె గాదే!
హైమమే!హర్షంబ?హర్ష నీతి నెంచు!ధాత్రిన్!
క్షేమమౌ!సర్వంబు?జీవ!నిర్విరామ!సేవన్!
నిర్విరామ వృత్తము,ర,త,ర,జ,గగ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2723.
112..తగని పగ,వృత్తము,
తెగని పంపక తీరే?తెల్వి మాపు సర్వమ్!
పగను పెంచును!నిత్యమ్!పోదు భేదమెంచన్?
జగ బిభీషణ!చిక్కున్!సర్వ శూన్య మేర్చున్!
తెగులు స్వార్థ రోగమ్!దిక్కు మాలు లోకమ్!
తగని పగ,వృత్తము,న,భ,మ,జ,గగ,గణములు,
యతి,9.వ,యక్షరము,వృ,సం:-2616.
113..సత్యవాద వృత్తము,
వేది కైన నొక్కెడన్?దివు రసత్య వాదమ్!
పారమైన నీతదే?భవుడు మెచ్చు నిచ్ఛన్!
సాధనంబు సేయుమా!జన వినోద మేర్చన్!
బోధకాగ్రణౌదువే?పురుషలక్ష్య!దీక్షన్!
(వేది=వేదాధ్యయనము చేయు వాడు)
సత్య వాద వృత్తము,ర,జ,భ,జ,గగ,గణములు
యతి8.వ,యక్షరము,వృ,సం:-2987.
114..పడని తనమ్ వృత్తము,
తర తరాల ద్వేషమ్!తట్టి లేపె!నేడున్!
వెరపు గూర్చు భావమే?విచ్ఛి తేర్చు లోకమ్!
చెర గొనంగ!నీతిన్!జీవ సౌమ్య!మారున్!
పరుల హాని పాపమ్!పట్టి కుడ్పు!సుమ్మీ!
పడని తనమ్,వృత్తము,న,ర,త,జ,గగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5397.
115.మాతృ వేదనా,వృత్తము,
ఎన్ని కోట్లున్న సరే?యెసగు పేదరికమ్!
దన్ను బట్టే?పెరుగున్!తర తరాలు సిరుల్!
మన్ననంబే గనెలే?!మహినిబీద యనన్!
కన్న తల్లీ!వెటుల న్గడిపెదో?భవితన్?
మాతృ వేదనా వృత్తము,ర,భ,భ,జ,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-7091.
116.బెట్టేల?వృత్తము,
స్థిరత లేదేలయా?చిత్త స్వార్ధ చింతనన్!
మెరుపు టెక్కేలయా?వర్ధిలంగ!నెంచుమా!
సరగు నీతెంచకన్?సర్వ శూన్యమెంచితే!
నిరత భాగ్యాలకున్!నీతి జోడు చేయుమా!
బెట్టేల?వృత్తము,న,త,త,ర,లగ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-5284.
మంగళమ్ మహాత్
శ్రీ,శ్రీ,శ్రీ,శ్రీ,శ్రీ,
(అణిమా ఛందాంతర్గత శక్వరీ ఛందము నందు,కొన్నివృత్తములు
మాత్రమే గైకొన బడినవి,)
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.