గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మే 2026, మంగళవారం

శివ స్మరణము (నూతన ఛందముల లో) రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్. 

శివ స్మరణము(నూతన ఛందముల లో)

     రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                              జుత్తాడ,



 1.కమనీయ వృత్తము,


               కలను గంటి నీ కమనీయ రూపమున్!

              బలము నీవయా!భవదూర శంకరా!

              కొలువు దీరితే!కొమరారు!డెందమున్!

             తెలుపు ఛాయనే?తిలకింతు నెన్నడున్!


కమనీయ వృత్తము,న,ర,స,జ,గ,గణములు,అతి జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు13.అక్షరము లుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం:-2776.


2.సమతేర్చు వృత్తము,


             తెల్లని లింగంబు!దివి కీర్తి మల్లేశా!

            చల్లగ దీవింపు!సమతేర్చి సర్వంబున్!

           తల్లి యుమా దేవి!దయ గోరి కీర్తింతున్!

           మెల్లగ రా రండి మమకార భావానన్!


సమతేర్చు వృత్తము,భ,త,స,య,గ,గణములు,అతి జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు13.అక్షరము లుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం;-743.


3.శూరమా వృత్తము,


             ఓ!శివా!మా!శివా!ఓంకార శ్రీ కరా!

             రాశివీ!భాసివీ!రాగాను రంజితా!

            కాశి నీదే?నయా!కందర్ప దర్పకా!

           శాశ్వకా!సద్వరా!సంసార క్షేమకా!


శూరమా వృత్తము,ర,ర,త,ర,గణములు,జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు,12.అక్షరము లుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం;-1299.


4.నీమనా వృత్తము,


             మామకా!సోమకా!మదీయ!దైవమా!

            నీమకా!నామనా!నీమంబు!పెంచుమా!

            కోమలా కారుడా!ఘోరాల నాపుమా!

           రామ మేవే నయా!రాజిల్ల జేయుమా!


నీమనా వృత్తము,ర,ర,జ,ర,గణములు,జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు 12.అక్షరములుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం:-1363.


5.వరదాయినీ వృత్తము,


               కోర్కెక ల్దీర్చెండు!గురు దేవ!మల్లేశా!

              పారగ!పర్మాత్మ!వరదాయి!జీవాత్మా!

             ధీరజ!దివ్యాత్మ!దివి నేలు పర్మాత్మా!

             వారిద నీరాశ్రి వరదంబు నీవేగా?


వరదాయినీ వృత్తము,ర,త,స,య,గ,గణములు,అతి జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు 13.అక్షరము లుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం;-739.


6.శూరమా వృత్తము,


             భీమకా!స్తోమకా!భీభత్స!రుద్రుడా!

             రామకా!రాజితా!రత్నాల పెన్నిథీ!

            కామితా!శ్రామ్యతా!కాలాంత కాంతకా!

            క్షేమకా!నీమకా!జీవార్తి దీర్చుమా!


శూరమా వృత్తము,ర,ర,త,ర,గణములు,జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు12.అక్షరము లుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం:-1299.


7.వాసితా వృత్తము,


          అర్ధ నారీశ్వరా!యాది దైవమీ వయా!

         స్వార్థ జీవాళికిన్!చావు దెబ్బ కొట్టవా!

        వర్ధమానుండవే!వాసితా నివాసితా!

       నిర్దయ న్వీడుచున్!నీతి దీర్చు జాతినిన్!


వాసితా వృత్తము,ర,ర,ర,జ,గ,గణములు,అతి జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు13.అక్షరము లుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం:-2759.


8.అరమరిక వృత్తము,


              అమరు డీవయా!అరమరి కేలయా?

             కుములు చుండిరే?కుల స్థితి గానకన్!

            శ్రమిక జీవులే?సతతము చింతిలన్!

            సమత నేర్చుమా!సదమల భారతిన్!


అరమరిక వృత్తము,న,ర,న,ర,గ,గణములు,జగతీ ఛందము,

ప్రాస నియమము కలదు,పాదమునకు,12.అక్షరములుండును,

యతి,7.వ,యక్షరము,వృ,సం:-1496.


9.గుట్టు జీవనా వృత్తము,


           రక్షమాం!దక్షకా!రమ్యార్థ భావాత్మతన్!

          శీక్షకే?శిక్షవై!శిక్షించు!పాపిష్టులన్!

         కుక్షికిన్!గూటికిన్!గుట్టైన జీవం బీవే!

        దక్ష తీవే?నయా!ధర్మాన్ని కాపాడంగన్!


గుట్టు జీవనా వృత్తమ ర,ర,త,త,గ,గణములు,అతి జగతీ వృత్తము,

ప్రాస నియమము కలదు,పాదమునకు13.అక్షరములుండును,

యతి,7.వ యక్షరము,వృ,సం:-2323.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.