జైశ్రీరామ్.
అణిమా ఛందము
13.అతి జగతీ ఛందమి
(వెలసిన వృత్తములు,8192 )
ప్రతి పాదమున,13.అక్షరములుండును,
ప్రాస నియమము కలదు,
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ,
1.శ్రీ హరా వృత్తము,
శ్రీమంతా నంత పేరీవయౌ?!మల్లేశ్వరా!
ధీమంతా! తేజమౌ?దివ్యుడా?మారేనివై!
నీమంబారంగ!నిన్నెంచ?రక్షించే!భవా!
క్షేమంబీయంగ!సజ్జీవ!భాగ్యంబౌ!శివా!
శ్రీ హరా వృత్తము,మ,ర,ర,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2193.
2.కందర్ప వృత్తము,
కందర్ప దర్పా!యోంకార!శ్రీకార!శర్వా!
మందార సౌమ్యా!మామంది రానంద మీవే?
ఛందాలు,బంధా లాచంద్ర తారార్క మేర్చన్!
స్ఫందించు!మల్లేశా!సర్వ మీవేను!మాకున్!
కందర్ప వృత్తము,తమ,ర,ర,గ,గణములు,
యతి,,7.వ,యక్షరము,వృ,సం:-1157.
3.శ్రీమంత వృత్తము,
1 శ్రీమంత ధీమంత!సేవ్యాను కూల్యా!శివా!
రామంబు లీడేర్చు!రాజన్యు డీవే?హరా!
నామాన సంబందు!నర్తించు!దేవా?భవా!
కామారి మల్లేశ కారుణ్య!రక్షింపుమా!
2. భీమంబులం బాపు!భీమేశ!భద్రాత్మకా!
శ్రీమంత!ధీమంత!సిద్ధింప సౌఖ్యంబులన్?
సోముండ వీవయ్య?శ్రీ కర్తృ వాగార్థతన్!
సోమంబు జేకూర్చు!సర్వత్ర నీ స్తోత్రముల్!
శ్రీమంత వృత్తము,త,త,త,త,గ,గణములు,
యతి,.7వ,యక్షరము,వృ,సం:-2341.
3.నీమానువర్తి వృత్తము,
నేరంబు సేయక న్నీమాన!వర్తింతునే!
పేరాశ!లేదయా?విన్నాను కన్నాను లే?
మారాడ నేరకన్!మన్నింపు!కోరేను లే?
సారావళీ వయా?సర్వేశ!రక్షింపుమా!
నీమాను వర్తి వృత్తము,త,ర,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరముశవృశసం:-3125.
4.ఆకాంక్ష వృత్తము,
దోషాలు వేషాలు తీరుకే!స్ఫందిపవే?
మేషాది రాశెంచి మీరక న్వర్తింపగా!
శోషేమి?లేదంచు!స్తోత్రతన్?సర్వేశునిన్!
భూషింప మేల్గూర్చు!భూతలిన్?యోచింపుమా!
ఆకాంక్ష వృత్తము,త,త,ర,త,గ,గణములు,
యతి,.7.వ యక్షరము,వృ,సం:-2213.
5.మతము,వృత్తము,
అరులే!లేరయ!యవనియం దెంచగన్!
స్థిర జీవంబది!చెలగు నాకాంక్షయే!
తరుముంగా మది !తమము!పోనాడుచున్
సరిజేయంగను!సదమలంబే?సుమా!
మతము,వృత్తముస,భ,న,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2548.
6.మానాభిమాన వృత్తము,
భానోదయంబవ!భాగ్యంపు తేజ మట్లే!
మానాభి మానము!మాంగళ్య దామ మేర్చన్!
వే నూరు వత్సర!భీతంబు బాపు నూహన్!
జ్ఞానాంబుధీ దగ!సంఘీభవించ గా!నౌ?
మానాభిమాన వృత్తము,త,భ,మ,ర,గ,గణములు,
యతి.7వ,యక్షరము,వృ,సం;-1333.
7.నీర్ష్యా వృత్తము,
మాటాడ నేరని మహి జంతు జాలమే?
చేటొంద నౌదల చెలిమెంచి రోధించున్!
మాటాడు జన్మకు!మది నీర్ష్య లేలయా?
చాటంగ రమ్మిక!సమతెంచి నీతిన్!
నీర్ష్యా వృత్తము,త,భ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1781.
8.బాధిలు వృత్తము,
పరమెంచు వారే?పడులే?పలు బాధల్!
నిరతంబు నీవే?నిడుపెంతు సుఖాలన్!
పరమాత్మ భద్రా!భవదూర వరాంగా!
నిరవద్య నిత్యా!నిడు పేర్చు!సురేశా!
బాధిలు,వృత్తము,స,య,స,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,972.
9.దొరకొను వృత్తము,
తోరంపు భక్తియే!దొరకొను నీతినిన్?
నేరంపు జీవియే?నొడి దుడు కేర్చులే?
సారంపు జన్మయే?జగదభి దంబు నౌ?
పేరాశ మానుమా!పరమ మదే?సుమా!
దొరకొను వృత్తము,త,ర,న,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1525.
10.సాకుమా!వృత్తము,
నోములు వ్రతాలు నోచి చేయంగ నౌనే?
భాములవి తీరి! భాగ్య మే పారు నంటే?
రామ మదిలేక?రాజిలం సాధ్య మౌనే?
సామమున జీవజాలమున్సాకు!మేలౌ!
సాకుమా వృత్భతము,భ,,జ,ర,ర,గ గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1199.
11.జిహ్వ శుచి వృత్తము,
సుచి జిహ్వ మది!సురభినై యేపవన్?
వచ సామ్య రస వశితమే యోపగన్?
స చరిత్ర రతి జనగ! నేపౌ దిలన్?
పచి తాన్న రుచి బరగ భాగ్యంబదే!
జిహ్వ శుచి వృత్తము,స,న,న,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2556.
12.దక్షయౌ వృత్తము,
పక్షమే!దక్షయౌ?పక్షి జీవితంబదే?
రక్షయే?మోక్షమౌ?ధన్య మానవత్వమై!
కుక్షి పోషింపదే?కోర్కె మూలమౌ?నంతే!
శిక్ష లేదెంచగా?జీవి మాయకున్?రసన్!
దక్షయౌ వృత్తము,ర,ర,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2707.
13.మాన రక్ష వృత్తము,
మానమే!సర్వము!మంచి నెంచనిశమున్
దానమే!సత్యము!ధర్మ మౌ నదిల లోన్
పానమే?ముఖ్యమ!పారమదే?యనకన్!
కానవే?నిత్యము!కర్మ సదా!సుమతిన్!
మాన రక్ష వృత్తము,ర,భ,ర,న,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,,వృ,సం:-1971.
14.కలహంస వృత్తము,
నీరము క్షీరమున్నిరుపమ నైపుణిన్?
వేరొన రించగన్?విహగ!మరాళివై!
తీరుచు మంచినిన్?తరుము చెడు న్వడిన్!
మెరుగు నీతినిన్?మెదలు మి లోకమున్!
కలహంస వృత్తము,భ,ర,న,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2519.
15.గతిచెడు వృత్తము,
గతజల సేతు కట్టడ మనందువా?
గతిచెడు వాని కల్మిల దలంపగన్!
మతి నుతి సత్య మన్నది?మహోత్తమే!
స్తుతియుత పాత్రజొచ్చిన!శుభం బిడున్!
గతి చెడు వృత్తము,న,జ,భ,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2992.
16.తృప్తిలు వృత్తము,
కోరిక తృప్తినిం గోరగ నీ దవనిన్!
మేరకు మీరి నన్మీదికి!నెట్టు గదే?
తారక స్థాయికి న్దక్కుడు కోర్చు నొకో?
చేరక సత్యము న్జీరడు సౌఖ్య మిలన్!
తృప్తిలు వృత్తము,భ,ర,భ,భ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-3479.
17.గురుత వృత్తము,
గురు తెరిగించు!గురుండు!విరించియే!
పర మమరంగ!పరంతపుడే?సుమా!
తెరవగు జీవ వరంబు!తెరంగు నై!
పరగును నిత్య వసంత!సు శోభలన్!
గురుత వృత్తము,న,జ,జ,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1420.
18.ముక్తిదా వృత్తము,
చారు విక్రమంబు సమకూర్చు దైవమై!
చేరి గొల్వ ముక్తి!శివమొప్పు జీవమౌ?
జీరు సత్సమంబు!చివురించు న్యాయమున్!
పారమార్థ చింత ప్రభు తేర్చు!పాలనన్!
ముక్తిదా వృత్తము,ర,జ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1515.
19.చెడు స్వార్థ వృత్తము,
యాకొన్న బీద కాకలి తీర్ప!మేలేయౌ?
మేకొన్న కోటి కేమొకొ?భుక్తాశాయెన్!
చేకొన్న సాయమే?చెడి!స్వార్థం బాయెన్!
వాకొన్న మాటకున్?పడ నౌనే?నీర్ష్యన్?
చెడు స్వార్థ వృత్తము,త,ర,స,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-373.
20.క్రమ పంపక వృత్తము,
పధకాలు మంచి బరగ!సౌఖ్యం బేపౌ?
బుధతెంచి మెల్గ!భువికి క్షేమం బేర్చున్!
నిథి కొల్లగొట్టు నెపమె?పాపంబే యౌ!
కుదరంగ నీతి?కొదువ గాదెంచన్?
క్రమ పంపక వృత్తము,స,జ,న,మ,గ,గణములు,
యతి,.7.వ,యక్షరము,వృ,సం:-493.
21.శుభాశ్రితా వృత్తము,
నాశమేమి!లేని న్యాయమె?యనంతమౌ?
పాశము ల్లెడంగు పావనె?విశేషమౌ?
కాశి వాసు నెంచ కమ్రత?గడంగు లే!
శ్రీశ మీశ మేర్చు శివత! శుభాశ్రియై!
శుభాశ్రతా వృత్తము,ర,జ,భ,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2989.
22.కూర్మిదూర వృత్తము,
నీతి చరితము!నిర్మలం బేర్చు!జీవా!
కోతి చరణము!కూర్మినిం దూర మేర్చున్!
చేత శుభగత!శ్రేష్టమై!భూషితంబౌ?
పాత దినములు!భేషణన్?దోష మౌనే!
కూర్మిదూర వృత్తము,భ,న,ర,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1221.
23.ప్రళయ వృత్తము,
భూమి భద్రంబెంచ!పూర్ణమౌ?శూన్యమే?యౌ!
నామ మా.త్రుండీవు!నర్మమే?కర్మ మేర్చున్!
భ్రామకంబీ ధాత్రి!ఛిద్రమై!మున్గు నీటన్!
భీమమౌ?రుద్రుండె?కర్తయై!శర్వు డౌచున్!
ప్రళయ వృత్తము,ర,త,ర,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1187.
24.కాల శాసన వృత్తము,
క్రమాను సారివై!కాలాన్ని శాసింతువే?
నమోనమా యనం?న్యాయంబుజేకూర్తువే!
సమాన!సామ్యతన్!సర్వంబు!రక్షింతవే!
అమాను షాలురన్!హంతంబు గావింతువే?
కాల శాసన వృత్తము,జ,ర,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2326.
25.మేటి భారతి,వృత్తము,
శాంతి ధాంతి క్రాంతి!సోభాగ్య గరిమంబుల్?
భ్రాంతి వీడి భాగ్య పౌన్నత్యమునవెల్గెన్!
పంత మొప్ప నిల్చె పారంపు ధృడ దీక్షన్!
యెంత కైన సాటి!హిందుత్వ మన నిల్చెన్!
మేటి భారతి,వృత్తము,ర,జ,త,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1835.
26.భళెర వృత్తము,
భవిత బాగును పాటెంచుట!మానిరే?
కువలయంబది!గోలాయె!కులాలన్!
భవము నెంచని భాగ్యంబది!భాగ్యమే?
శివత!సామ్యత!చేకూర్ప!భళెయౌ!భవిన్!
భళెర వృత్తము,న,భ,త,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2873.
27.వరవాటి వృత్తము,
పుర మేటి కాశి!వర వాటి భూతలిన్!
సిరి యన్నపూర్ణ!శివ నారి వాసమై!
పరిపూర్ణ మయ!వరభాగ్య!క్షేత్రమై!
భరతాంబ కీర్తి భళె యంచు దీప్తిలెన్!
వర వాటి వృత్తము,స,జ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1516.
28.నవ ప్రభ వృత్తము,
నవము లోకము నడిపించు సంఖ్యయై!
దివ మహంబులు దివురంగ! దీర్చుచున్?
సు వరదంబగు సొబగెంచి జీవముల్?
శివత మేర్చుచు!జివురించె!భూతలిన్!
నవ ప్రభ వృత్తము,న,భ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2808.
29.ప్రజ్వలా వృత్తము,
సప్త సప్తి సప్తాశ్యా!సప్తార్చి ప్రజ్వలా!
దీప్తిదా!శక్తిదా!దివ్యేశా!సు శోభకా!
సప్త ధాతు తేజా!సర్వేశా!సుధీరమా!
సప్తర్షి!ప్రదీపా!సర్వంబీవే? భాస్కరా!
ప్రజ్వలా వృత్తము,ర,జ,మ,జ,గ,ణములు,
యతి,7.యక్వషరము,వృ,సం:-2603.
30.నిత్యసత్య వృత్తము,
నిత్య సత్య వ్రత!నిష్ణాతు డిక్కలిలోన్!
సత్య దూరుడగు!స్వార్ధంపుచింతలమన్?
సత్య మెంతయిన!సామర్ధ్య మెంచ వలెన్
భృత్యు జీవమది!భీతిల్లి!తప్పు జనున్!
నిత్య సత్య వృత్తము,ర,న,మ,ర,గ,గణములు,
యతి,.7.వ,యక్షరము,వృ,సం;-1082.
31.వీడని నీడ,వృత్తము,
నీడ వీడనట్లు!నిన్నంటు!యవి నీతే?
పీడయై!నడంచు!వెన్నంటి జడిపించున్!
బాడుగే !పడంగ!పట్టించు కొన దంతే!
పాడు జీవ మేల?బాగెంచి!మను మోయీ?
వీడని నీడ వృత్తము,ర,జ,త,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1835.
32.సంక్లిష్ట వృత్తము,
త్యాగివై!యోగివై!తత్వాను సారి వైనా?
రాగివై!భోగివై!రత్నాను సారి వౌచో?
భోగమై!రోగమై!భూతాత్మ క్షోభతేర్చన్?
సాగితే?నీగతే!సంక్లిష్టమౌ?నదంతే!
సంక్లిష్ట వృత్తము,ర,ర,త,ర,గ,గణములు,
యతి,7.వయక్షరము,వృ,సం:-1309.
33.ప్రాప్తి లేని వృత్తము,
1 తృప్తి లేని జన్మమ్!విత్తులేని మొక్కయే?
ఆప్త బంధు ద్వేషమ్!యార్తి లేని రోగమే!
సప్తి లేని స్వారే?సాము లేని గారిడీ!
ప్రాప్తి లేని కల్మే?వంట లేని సౌరుచౌ?
2 అన్నదోష మాయెన్!ఆత్మ క్షోభ కారియై!
మిన్ను నంటు ద్వేషమ్!మెట్టి మట్టి నంటదే?
దన్ను లేని జీవమ్!ధర్మ రక్ష నష్టియే!
కన్న తల్లి ఘోషే?కాల నేమి కామమౌ?
ప్రాప్తీ లేని వృత్తము,,ర,య,ర,జ,గ,గణములు,
యతి,.7.వ,యక్షరవృ,సం:-2399.
34.దండమేర్చు వృత్తము,
కోర్కెలే!తీరునా!కొండంతాశ దేలయా?
తర్కమే?దోషమై!దండం బేర్చదే?భువిన్!
అర్కుడే?క్రోధిలన్!హంతంబౌను!లోకముల్!
కర్కసం బేలయా?కర్మార్ధంబు!తప్పునా!
దండమేర్చు వృత్తము,ర,ర,మ,జ,గ,గణములు,
యతి,.7.వ,యక్షరము,వృ,సం:-2579.
35.దోష భూష వృత్తము,
దోషమే?భూషగా!దుర్మార్గా లవేలనో?
భూషయే?నిత్యమా!భుక్తెంచెడి మార్గమా?
శేష జీవంబునన్?సర్వేశ్వరు నెంచుమా!
పోషకుం డాహరే?పుణ్యంబిడు!జీవికిన్!
దోష భూష వృత్తము,ర,ర,త,జ,గ,గణములు.
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2775.
36.అచేతనా వృత్తము,
అచేతనా!చేతనా!మనన్య ప్రభావమ్!
సుచేతనా!ధన్య వసుధాశ్రిత!శ్రేయమ్!
కుచేల దాకర్షిత!కులాల వరామమ్!
నచో!విచారేణ తన రార్తి!యమోఘమ్!
అచేతనా వృత్తము,జ,త,స,య,గ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-486.
37.అక్షయ,వృత్తము,
అక్షయ పాత్రంబు నమరేంద్రుం డీయుచో?
కుక్షియె!భక్షంబు కోరకెంచు న్వెసన్!
దక్షత పెచ్చౌచు!ధరమేలెం చున్వడిన్!
అక్షయ తీరెంచి! హరి నెంచ న్దగున్!
అక్షయ,వృత్తము,భ,త,స,త,గ,గణములు,
యతి,7.వ యక్షరము,వృ,సం:-2279.
38.నా పరా వృత్తము,
నా నీ పర భేద?నర్మంబే?కర్మంబిలన్!
పోనీని దురాన!పో నేలన్పా పిష్టివై!
నీ నవ్య చిరాశ!నేర్పెంచే?తీరేర్చుమా!
కానట్టి పనేల?కష్టాలం కాపాడుమా!
నా పరా వృత్తము,త,జ,మ,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2157.
39.తీరు మారు వృత్తము,
మారు కాల తీరు మార్చు!జీవ శైలినే?
తీరు మారు!మారు తెన్ను!కాల భావమే?
భూరి సత్వ తత్వ బోధ!భాష భేదతన్!
తార కాలు మారు తత్వమెల్ల మారదే?
తీరు మారు వృత్తము,ర,జ,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2731.
40.జనస్వామ్య వృత్తము,
వనరు లన్నియు ప్రజల మొత్త మవన్?
ఘనుజ భూకర! కఠిన దోపిడులన్!
జనపు సామ్యత!జనగ సాధ్యమొకో?
దనరు!పాపము!ధరకు!శాస్వతముగా!
జనస్వామ్య వృత్తము,న,భ,న,భ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-3546.
41.తరింపు వృత్తము,
చరమాంకంబున!సరిభూమి!చేరగా!
పరముండే?కద!పరి రక్ష జీవికిన్!
సరిరా దేదిల!జగమిథ్య!గానవే?
తరియిం పెంచుమి!తరమెల్ల కీర్తిలన్!
తరింపు వృత్తము,స,భ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2792.
42.గుర్తెంచు వృత్తము,
గురివింద సామ్యమ్!గుర్తెంచి!జీవించుమా!
తరియింతు వయ్యా!ధర్మంబు!తేజంబిడున్!
కర టేల?జీవా!కారుణ్య మూర్తీవయా!
భర మేర్చు!కీడే?బంధాలు!తెంచున్సుమా!
గుర్తెంచు వృత్తము,,స,య,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2316.
43.అతి నమ్మిక వృత్తము,
నాదీ!జలపాతమ్!నాదే?విధ్యుత్తనగన్?
బాధేమని?తాకన్!బంధాలే!త్రెంచ బడున్?
చేదీ నిజమెంచన్?సర్వంబున్నీ వశమే?
బాధింపగు జీవమ్!భద్రంబే?కోరు రసన్!
అతి నమ్మిక వృత్తము,త,య,మ,భ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-3085.
44.సర్వత్ర వృత్తము,
మనసులో మాట!మదిలోని రోగంబున్?
గన నశక్యంబు!గడు గాయి!జీవాలన్!
చన వదేల?సరివారు !నా వారనన్!
మను మనన్య మతి తోడ!సర్వజ్ఞతన్!
సర్వత్ర వృత్తము,న,త,స,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-744.
45వేగపడకు,వృత్తము,
విను పరోక్తము!విని వేగ పడకన్!
తనదు శైలిని నిజమెంచి జనుచోన్?
కొనదు దోషము!గుణ మెంచు!భువినిన్!
వినకు లోకము!వెత లేర్చు కనుమా!
వేగ పడకు వృత్తము,న,భ,స,న,గ,గణములు,
యతి,.7.వ,యక్షరము,వృ,సం:-3832.
46.నీతి నోపు వృత్తము,
చెడుపు!వారెపో?చేపుదురు!నీతెంతో?
విడువ కున్నచో?వేరు పురుగౌ?జీవమ్!
తుడుచు!ఖ్యాతినిన్?తొలిగెడి!భద్రంబౌ?
విడుమి దుష్టులం!వడిగను సౌఖ్యంబున్!
నీతి నోపు వృత్తము,భ,ర,భ,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-929.
47.భద్రతా వృత్తము,
1 కోతులే?మేటులై!కూర్మి చేకూర్చి రెంతో?
ఆత తాయీలనే!యార్తి !ముంచెత్తి రయ్యా!
పాత త్రేతాయుగం!భద్రమై!రమ్య మాయెన్!
నేతలే?కోవిదుల్!నెటి కాలం బి దిం తే?
2. భూతియే!ధర్మమా!భూతియే!న్యాయమా!నీ
చేతనం బెంచవా!జీవమే!ముఖ్యమా!జా
జాతి దుష్కర్మలే!జన్మ మేలెంచ నౌనే?
త్రాత మెచ్చంగ నీ ధర్మమే?రక్ష యౌగా!
(జాతాతి కర్మ=జాతకరీత్యా యతి క్రమించు పనులవి.
త్రాత=రక్షించువాడు,సర్వ రక్షకుడైన పరమాత్మ)
భద్రతా వృత్తము,ర,ర,ర,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-
48.తెరగెరుగు వృత్తము,
మాటకు చేతకున్?మదోన్నతా కులమై!
చేటున పాటునై జెలంగ!కల్మషమౌ?
ధీటుగ నీతికై!తెరం గెరుంగ వలెన్?
పాటున దేశమున్?భళేయనం గనుమా!
తెరగెరుగు వృత్తము,భ,ర,జ,భ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-3415.
49.నిద్రావి వృత్తము,
నిద్రావి గాకుండ!నేర్పుగా!జీవింపంగా!
క్షుదార్తి ఛిద్రంబు!క్షోభిలున్?నానాడెంచన్?
భద్రాద్రి రాముండె!భక్తికిన్?మోక్షంబేర్చున్
రౌద్రంబు!కీడెంచు!రక్ష!సత్వం బేమార్చున్!
నిద్రావి వృత్తము,త,త,ర,మ,గ,గణములు,
యతి,7.,వ,యక్షరము,వృ,సం:-165.
50.ప్రహర్ష వృత్తము,
గుండె కోత గాదె?గుబు లేర్చ జీవముల్!
ఛండ శాసనేల?జగదేక న్యాయతన్?
బండ తీరు వీడి!బ్రతుకేర్చి!శ్రేయతన్!
యంద దండ యౌచొ?నమరాళి హర్షమౌ?
ప్రహర్ష వృత్తము,ర,జ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1771.
51.ధాతృగుణ వృత్తము,
దయార్ద్రత లేని ధాతృగుణ సంపదల్!
నయంబున లొంగ నట్టి!విష రోగమున్!
భయం బొనరింప!భద్రత హుళక్కియౌ!
జయంబది కాదు!జంతు తతి తీరగున్!
ధాడతృగుణ వృత్తము,జ,జ,భ,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2990.
52.భూతేర్చు వృత్తము,
ఆలయ ప్రాంగణ మహం బ్రహ్మ! దీప్తిదమ్!
కాల కఠోర వికటం బార్చు రామకమ్!
పాలన శ్రీకర ప్రభూతేర్చు!నాశ్రమమ్!
మాలక సౌరభ!మహత్వమ్!విభూతిదమ్!
భూతేర్చు వృత్తము,భ,భ,య,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1655.
53.శ్రీ మా వృత్తము,
చెంగు చాచె దేల?శ్రీల తల్లీవేనమ్మా!
బంగరంపు గర్భ!భాగ్య రా శీవేగావే?
సింగరేణి బొగ్గు!చిత్ర రాళ్ళెన్నో?నీవై!
అంగ రంగ భోగ!యార్భటుల్చాటెన్గా!
శ్రీ మా వృత్తము,ర,జ,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-171.
54.మోహనా వృత్తము,
జీవ సాంగత్యమే!జిత క్రోధ మర్మమౌ!
పావనంబే!గూర్చు!పరిపక్వ జ్ఞానమౌ!
శ్రీ వరంబే?సుథా!స్థిత భావ మంజిరౌ!
బ్రోవ రక్షాత్మరా!భువనైక మోహనా!
మోహనా వృత్తము,ర,ర,స,మ,,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం"-1491.
55. అప్రతిష్ట వృత్తము,
తలవంపు తేక?ధర్మంబునే!యెంచుమా!
నిలువంపు నీడ!నేర్పెంచి కూర్చ న్స రౌ!
పలుమాట లేల?పాపంబె?దోషంబిడున్?
నెల తాల్పు గొల్వు!నిన్నావహించు న్శివమ్!
అప్రతిష్ట వృత్తము,స,జ,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2348.
56.సుప్రతిష్ట వృత్తము,
జగ మనాదిగ!జాతి మత మైక్యతన్?
నిగమ సాదృశ నీతి నిండునై!జనెన్!
పగలు లేకను!పద్ధతెంచి!మన్నిరే!
ప్రగతి మేలుకు భద్ర తేర్చిరెంతయో!
సుప్రతిష్ట వృత్తము,న,ర,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2712.
57.సఖ్యతా వృత్తము,
కలిసి మెలసి కష్ట సుఖ సాయులై!
మెలకు వొలుక!మేటొనర!నుండిరే!
హలము పనుల!హాయగు!కర్షకుల్!
తలపు లమిత ధర్మమున! కెంచిరే?
సఖ్యతా వృత్తము,న,న,భ,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2008.
58.శ్రమక వృత్తము,
కమత మెంచని కలుము లమలంబే?
ఆమల భుక్తము యవని గనదాయెన్?
శ్రమకు నోర్వని జగమయె?విషాధమ్!
సమత యెట్లగు?జనతకు నిరాశన్!
శ్రమక వృత్తము,న,భ,న,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2040.
59.ఈప్సిత వృత్తము,
ఉత్తమ ముదారం!యుర్వి జన సఖ్యమున్!
చిత్తము బిరానం!చెల్వమయి!సర్వదా!
యుత్తమ గుణంబై యున్న గను నుత్సుకమ్!
ఎత్తున కెగయంగన్?యీప్సితము మేటిదౌ!
ఈప్సిత వృత్తము,భ,ర,భ,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1933.
60.ఔదార్య వృత్తము,
పదునగు నూహ!పట్టుదల కార్యాలన్!
చెదరని బుద్ధి!చిత్త పరమార్ధమున్!
విధులను నీతి!విద్వదవ ధార్యంబౌ!
అదరని గుండె!హర్షమునౌ!ధాత్రిన్!
ఔదార్య వృత్తము,న,జ,భ,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-944.
61.నెలవు దప్పు వృత్తము,
నెలవు దప్పిన నీగొప్ప!తుప్పు నౌగా?
చెలువ మొప్పిన!జన్మంబు!శాంతి నొందున్!
బలము సర్వద,బాగౌనె?భంగ మేర్చున్!
తిలకు డీవన దీపింప!ధన్యు డీవే?
నెలవు దప్పు వృత్తము,న,భ,త,ర,గ, గణములు,
యతి,7.యక్వషరము,వృ,సం:-1336.
62.కల నిజమా వృత్తము,
కలయు నిజమా?కనవేమి?మిథ్యనే!
బలుపు సరియా!భవరోగ భాసురమ్!
కలి కులుకులె!గడి మీరు రోజులన్!
పలుక రెవరును!పడె దీవె?చిక్కులన్!
కల నిజమా వృత్తము,న,స,స,జ,గ, గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:2784.
63.అత్యశా వృత్తము,
గుడిని లింగంబు!కోరెండు కోర్కె తప్పే!
జడల బఱ్ఱీవు!సాధింతు వేది?భూమిన్!
జడుపు లేదేమి?సర్వంబు నాశ మౌచోన్!
పడుపు టూహేల?భద్రంబు నెంచ మేలౌ!
అత్యాశా వృత్త్తము,న,త,త,ర,గ,గణములు,
యతి,7.వ,యక్ముషరము,వృ,సం:-,1320
64.యుత మెంచు వృత్తము,
మితిని మీరిన మేడలే!కూలిపోవున్!
గతిని దాటిన గర్వమే?కాటి కేర్చున్!
యుతము నెంచక?నూగుచో?రాలెదీవే?
బ్రతుక నేరని?జీవుడా! మాట లేలా?
యుత మెంచు వృత్తము,న,భ,ర,ర,గ,గణములు,
యతి,7.యక్వషరము,వృ,సం:-1208.
65.తలపవేల వృత్తము,
తెలివికి!గర్వం దించు పాతాళంబుకున్!
కులుకకు కోట్లే!కొంప!కొల్లేరే!యగున్!
తలప వదేమీ!ధర్మ ధాతృత్వంబుల్!
చెలిమి యపేక్షే?ఛీదరంబౌ?తుదిన్!
తలప వేల వృత్తము,న,య,ర,త,గ,గణములు,
యతి ,7.వ,యక్షరము,వృ,సం;-2192.
66.చదిర వృత్తము,
గురుతెంచు జీవా!కోర్కెలే!పాశంబునౌ!
పరువెంచ శుభమ్!భక్తికై!నిల్తీవయా!
తెరవే?వెరంగౌ?తేజమే!జీరున్తుదిన్!
కరకీవు నౌచో?కాలమే!కాటేయు లే?
చదిర వృత్తము,స,య,,ర,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2188.
67.పరంబిడు వృత్తము,
వరంబీవా!శివా!వర్ధిల్ల !భద్రంబులున్!
కరంబీ జాతికిన్!కారుణ్య!భావంబులన్.
పరంబౌ!మార్గతన్!భాగ్యాల భద్రంబులున్!
రాగాల న్రాగివై!రక్షించు!సర్వేశ్వరా!
పరంబిడు వృత్తము,య,ర,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2322..
68.వగపు,వృత్తము,
పొగరు బోతీవై!పొంకాన బ్రతికినన్!
వగపె!నీదగున్!వర్షించు దురితముల్!
బిగువు తగ్గగా!పీడింప కుమిలెదే?
జగడ మెంచకన్?సత్యంబు కను మిలన్!
వగపు వృత్తము,న,మ,త,న,గ,గణములు,
యతి,7.యక్వషరము,వృ,సం:-3848.
69.కాలతీరు,వృత్తము,
కుల మేలె!కలిన్!ఘోరాలు నేరా లంతన్
పలు క్రూర చరుల్?బాదేరు బీదా!సాదన్!
పలు బాధ లచేన్?పాడెంతు రన్యాయతన్!
కాల తీరిదియే?కాలుండె గావ న్వలెన్?
కాల తీరు వృత్తము,స,స,త,మ,గ,గణములు,
యతి,7.వ.యక్షరము,వృ,సం:-284.
70.పరపెంపు వృత్తము,
పరపెంపు టేర్షే?పట్టి పీడించె నిలన్!
తర మెంచ లేకన్?దర్ప ద్రోహా లలమెన్!
చరియించు క్షుద్రుల్!సర్వ ముంతా మనిరే?
భరియింతు వెట్లో?భరతాంబా!భువిన్!
పరపెంపు వృత్తము,స,య,ర,భ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-3222.
71.భవబంధ వృత్తము,
భవ బంధంబుల!బాధ్యు డీవే!గావొకో?
శివ మెంచే నర జీవ మింతేలే? సుమా!
జవ సత్వంబులు!చక్క దీర్చ న్వలెన్!
భువిలో తండ్రికి!పూజ సేయు!మయా!
భవబంధ వృత్తము,స,త,ర,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2212.
72.తల్లి మనసు,వృత్తము,
తల్లి తనయుల!ధన్యత యాశించునే!
పిల్ల లమలత!ప్రేమతొ వీక్షించునే
కల్ల లలమని!గమ్యము!తల్లేను లే!
చెల్ల సుఖములు!జీరుమమోఘంబులన్
తల్లి మనసు,వృత్తము,భ,న,భ,త,గ,గణములు,
యతి,7.వ యక్షరము,వృ,సం:-2494.
73.ఎదల మెదలు,వృత్తము,
ఎదల మెదలు యింద్రియ భోగాలకున్!
మదిని నలుప!మంద్రపు జీవంబగున్?
వదల నహము!పండెడు భాగ్యంబదే?
పదిల మొసగు భావన!పరంబిడున్!
ఎదల మెదలు,వృత్తము,న,న,భ,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2496.
74.సహాయ వృత్తము,
తరులు గిరులు తమదైన శైలిలో!
వర వనములు!ప్రజ కెంతొ?సాయమై!
కురు సురదము!కొదువేమి!లేనటుల్!
సిరుల రసను!చెడ దీయ బోకుమా?
సహాయ వృత్తము,న,న,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2816.
75.విలసిల్లు వృత్తము,
మున్నీట నొక్కచో?ముత్యాలు విలసిల్లున్!
కన్నావె నత్తలన్?కాస్తైన!యట వార్ధిన్?
వెన్నంటి కీర్తిలన్?వేదాంతు లొక చోటన్?
చెన్నొంద దుష్టులున్!చేరంగ!వలనౌనే?
విలసిల్లు వృత్తము,త,త,ర,,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1304.
76.కమనీయ వృత్తము,
కలను గంటి నీ కమనీయ రూపమున్!
బలము నీవయా!భవదూర శంకరా!
కొలువు దీరితే?కొమరారు రూపమున్!
తెలుపు ఛాయయె!తిలకింతు నెన్నడున్!
కమనీయ వృత్తము,న,ర,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2776.
77.నెడమిడ వృత్తము,
వెడ వెడగను! విడు వడు జడుపున్!
తడ వడ బడ!దడ నెడ జనునే?
నెడ నిడు చెడు! నడ వడి! వడినిన్!
గుడి నెడమిడ!కుడి నెడ మిడుటే!
నెడ మిడ వృత్తము,న,న,న,న,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-4096.
78.సమతేర్చు వృత్తము,
తెల్లని లింగంబు! దివి కీర్తి మల్లేశా!
చల్లగ దీవింప సమతేర్చి సర్వమున్!
తల్లి యుమాదేవి!దయకోరి కీర్తింతున్!
మెల్లగ రారండి!మమకార భావానన్!
సమతేర్చు వృత్తము,భ,త,స,య,గ,గణములు,
యతి,7.వ,యకషరము,వృ,సం:-743.
79.వరదాయినీ వృత్తము,
కోరిక ల్దీర్చెండు!గురు దేవ!మల్లేశా!
పారగ!పర్మాత్మ!వరదాయి!జీవాత్మా!
ధీరజ!శివాత్మ!దివి నేలు!పర్మాత్మా!
వారు!నీరాశ్రి! వఠదం బుదార్యుండా!
వరదాయినీ వృత్తము,ర,త,స,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-739.
80.వాసితా వృత్తము,
అర్థ నారీశ్వరా!యాది దైవమీ వయా!
స్వార్థ జీవాళికిన్!చావు దెబ్బ గొట్టుమా!
వర్థ మానుండవే!వాసితా!నివాసితా!
నిర్దయ న్వీడుచున్?నీతి తీర్చు!జాతినిన్!
వాసితా వృత్తము,ర,ర,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2757.
81.గుట్టు జీవన వృత్తము,
రక్షమాం!దక్షకా!రమ్యార్ధ భావాత్మతన్!
శిక్షకే?శిక్షవై!శిక్షించు పాపిష్టులన్!
కుక్షికి న్గూటికిన్!గుట్టైన జీవంబిడన్?
దక్ష తీవే!నయా!ధర్మాత్మ రక్షించన్రా!
గుట్టు రట్టు వృత్తము,. ర ,ర,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2323.
82.జన్మ శాంతి,వృత్తము,
నెలవు దప్పిన!నీగొప్ప తుప్పు నౌగా!
చెలువ మొప్పిన జీవాళి!శాంతి నొందున్!
బలము సర్వద!బాగౌనె?భంగమేర్చు!
తిలకు డీవని దీపింప!ధన్యు డీవే!
జన్మ శాంతి వృత్తము,న,భ,త,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1336.
83.కల నిజమా వృత్తము,
కలయు నిజమా!కనవేమి?మిధ్యగా!
బలుపు సరియా?భవరోగ భాసురమ్!
కలి కులుకు లే!గడిమీరు రోజులన్!
పలుక రెవరున్?పడెదీవె!తిప్పలన్!
కల నిజమా వృత్తము,న,స,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1760.
84.గతి దాటు వృత్తము,
మితిని మీరిన మేడలే?కూలిపోవున్!
గతిని దాటిన గర్వమే?కాటి కేర్చున్!
యుతము నెంచక నూగుచో?రాలె దీవే!
బ్రతుక నేరని జీవుడా!మాట లేలన్?
గతి దాటు వృత్తము,న,భ,ర,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1208.
85.చెలిమపేక్ష వృత్తము,
తెలివిని గర్వం దించు!పాతాళంబుకున్!
కులుకకు కోట్లె?కొంప కూల్చేదే యగున్!
తలప వదేమి?ధర్మ ధాతృత్వంబిలన్?
చెలిమి యపేక్ష!ఛీదరంబౌ?నెంచవే!
చెలి మపేక్ష వృత్తము,న,య,ర,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2192.
86.పరువెంచు వృత్తము,
గురుతెంచు!జీవ!కోర్కెలే!పాశం బులౌ
పరువెంచ కున్న! భ్రష్టవై! నిల్తీ వయా!
తెరవే! చెరంగు ! తేజమైజీరు న్తుదిన్!
కర కీవు!నౌచొ?కాలమే!కాటేయులే!
( కరకీవు=కఠినుడ వీవు)
పరు వెంచు వృత్తము,స,జ,ర,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2228.
87.చదిర గుణ, వృత్తము,
మది నిబ్బరపు మాట!నీటి మూటాయెన్!
కుదువేది?మద కుంజరాలు తిర్గాడన్!
బదులేది?నిజ బంధు!నీతి యేపారన్!
చదిరంపు గుణసాటి!జాలమే?కాగన్!
[చదిరంపు గుణ=పాము నైజము విష తత్వము,].
చదిర గుణ వృత్తము,స,న,ర,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-700.
88.క్షోభ లలము,వృత్తము,
చెప్పిన బుద్ధులు చేట చెరుగాయెనే?
కప్పిన కల్మష!ఘాటు చెల రేగగా!
చొప్పునె?ధర్మము!క్షోభ లలమన్భువిన్!
ముప్పుగ నొప్పెను!మోద మిట!కేశవా!
క్షోభ లలము,వృత్తము,భ,భ,భ,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2487.
89.వేన వేలు వృత్తము,
ఏనుగు వేషత యెలుగెత్తు వేసడాల్!
వేనకు వేలిల వెలయంగ నిద్ధరన్?
కనునె?స్వచ్ఛత!కలిమేల?లోకమున్!
చెనికె!మంచిని!చెడు చేత!నేమొకో?
వేన వేలు వృత్తము,భ,భ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2807.
90.చోర ధీర వృత్తము,
చోరులే?ధీరులై!చొరగొని శ్రేయమున్!
వీరము న్జూపుచున్?వెలిగిరి!భోగులై!
పారునే?భద్రమున్!పదుగుర!శ్రేయమై!
చేరునే?ధర్మమున్?చిరిగిన!శాంతికిన్!
[చిరిగిన శాంతి=ఛిన్నా భిన్నమైన శాంతి స్వభావము]
చోర ధీర వృత్తము,ర,ర,న,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-3027.
91.మాట దోష వృత్తము,
తిను తిండి!దోషమ్!దిగులేర్చ రోగానన్!
మను మాట దోషమ్!మదినొత్తు భేదంబున్!
కనరాని కాష్టమ్!కలి మొత్తు నెంతేనిన్?
చిను కెంచు!జీవా!చివురొత్తు భాగ్యమున్!
మాట దోష వృత్తము,స,య,స,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-460.
92.నాడూ నేడు,వృత్తము,
1. చెంబు ముంత గిన్నె!చెన్నొందె!నానాడు లే!
కంబు కంఠ దోష!కాలుష్య మీనాడయెన్!
అంబ కంబ మెక్కె!యాటాడె!లోకంబిటన్!
దంబ మూని రెంతొ?ధాతాళి!దూతాళురై!
2. .ఒడ్లు నాట మాని!హోంకార!మెత్తే రిలన్!
ఎడ్ల బండ్లు పోయె!యంత్రాలు!తంత్రాలయెన్!
ఒడ్ల తిండి లేక!ఉల్వాది తిండెంచిరే?
యెడ్ల భుక్తి నెంచె?యీలోక తీరిం తయెన
యెడ్లభుక్తి=పశు తిండి నెంచన్=నెంచుకోగా ,పశుభుక్తము
తామే చేయగా,
నాడూ నేడూ వృత్తము,ర,జ,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2347.
93.నరభక్షక వృత్తము,
మనిషిని తిను మనుషు లుండి రిలన్!
కనునొకొ?దయ కరుణ!కాటకతన్!
మనుటకు తగు మమత!మాయ మయెన్!
వననిధులకు!పరువు!మాపిరిటన్!
నర భక్షక వృత్తము,న,న,న,భ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-3584.
94.ఒప్పునొప్పు వృత్తము,
చిప్ప కూటి కేల?చెప్పు కొనుట!గొప్పల్!
తప్ప దేటి కేని?తప్పుకు నురి శిక్షే!
ఒప్పు నొప్పు కొమ్ము!యోడకు జగమందున్!
కుప్పకూలకోయి?కూర్మిని!తెగ నీకన్!
ఒప్పు నొప్పు వృత్తము,ర,జ,భ,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-1963.
95.సర్వ శాంతి,వృత్తము,
సమ్మి జ్ఞాన మొప్ప!సర్వము శాంతిలంగన్!
నెమ్మనంబు తత్వ నిష్ట!ప్రశాంతమేర్చన్!
క్రమ్ము!సామ్య మెంతొ?కమ్ర మదే లే!
అమ్మ మెచ్చు!రీతి!హర్షిత మేర్చు జీవా!
సర్వ శాంతి వృత్తము,ర,జ,భ,ర,గ,గణములు,
యతి,7.వశయక్షరము,వృ,సం;-1451.
96.జగదాదార వృత్తము,
జీవ మశాశ్వతమ్!జివురు సత్యమ్!నిత్యమ్!
పావన భక్తియే?పరమ భాగ్యంబెంచన్?
నీ వన నెవ్వడో?నిరత మెంచ న్మేలౌ!
స్థావర జంగముల్?జగతి కాధారంబుల్!
జగదాధార వృత్తము,భ,ర,న,మ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-247.
97.కొంప ముంచు వృత్తము,
కొండంత యండంచు!కొంప లార్ప జూడగన్?
అండంత కంతైన!యండ నొప్ప!తుప్పగున్!
మెండేను యంటేల?మేటివాడ!వౌదువే?
చెండేటి కాలుండు!జీరు వేగ!దుర్మదమ్!
కొంప ముంచు వృత్తము,త,త,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2725.
98.కలి పొంతన వృత్తము,
జంగమా!సంగమా!జగదైక!ధీరమా!
కంగు తిన్నా వయా!కలి చెంత పొంతనన్!
భంగమేలం గనన్?భవ బంధ మెంచవే!
రంగము న్దూకుమా!రమణీయ మేర్చుమా!
కలి పొంతన వృత్తము,ర,ర,స,జ,గ,గణములు,
యతి,7.యక్వషరము,వృ,సం:-2171.
99.గంథరాజి వృత్తము,
గంథ పరిమళ గంథమీ గంథమోయీ!
సుందర సురభి!శూర ధీరాధి ధీరా!
బంథము లలము!భాస మానంపు ధాత్రిన్!
చిందు లలరుచు!సర్వ దామోద మిమ్మా!
గంథము=భూమి,
గంథ రాజి వృత్తము,భ,న,ర,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1215.
100.అనిత్య వృత్తము,
అనిత్యమై యొప్పు యవని వస్తుఛయమ్!
అనంతభోగంబు!హరి హరం బనుచోన్?
కనంగ దేహంబు!కడను మిథ్యయె గదా!
చనంగ ముక్తెంచి!సచరి తెందు!యనఘా!
అనిత్య వృత్తము,జ,త,న,భ,గ,గణములు,
యతి.7వ,యక్షరము,వృ,సం:-3258.
101.కర్మిష్టి వృత్తము,
కండ్లుండి చూడని కర్మిష్టి గర్వంబదే?
పండ్లుండి వాడని పాపిష్టి కర్మంబదే?
చెండ్లాట !తీరయి!చేర్పించు కారాటవుల్!
ముండ్లంటి యూహలు!ముష్టింప చావాసమౌ?
కర్మిష్టి వృత్తము,త,భ,త,త,గ,గణములు
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2357.
102.చెల్మిద్రోహ వృత్తము,
కల్మషాపాదుడై!ఖల తత్వ నరుండే!
చెల్మి కిం ద్రోహియై! చెలువంబు కెడంబౌ!
కల్మి దోషంబదే!కటువౌచు!కసెంచున్!
బల్మి భూతంబులే?పటుతార్ప!గడంగున్!
చెల్మి ద్రోహ వృత్తము,ర,ర,స,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-887.
103.పాపమగ్న వృత్తము,
బండ గుండె వాడే?బహు పాప మగ్నుడై!
నిండు మంచి నెంచ న్నిరసించు!ద్వేషియై!
చెండు నీతి నంతన్!చెరగొంచు!పాపియై!
కండ కావరంబున్!కనుమిన్ను గానకన్!
పాప మగ్న వృత్తము,ర,య,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2763.
104.గుండె గుబులు,వృత్తము,
గుండె గుబు లొత్త!ఘోరత న్మెల్గు వారిన్!
దండమున వంచి!ధాత్రికిన్?ర.క్ష గూర్పన్!
పండు నిక దేశ భాగ్యమున్!భారతాంబా!
షంఢ తతి జాతి ఖ్యాతికిన్!సుత్తి పెట్టౌ?
గుండె గుబులు వృత్తము,ర,జ,ర,ర,గ గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1195.
105.లంచ ధాటి వృత్తము,
అంచె లంచలను!హంసతూలి కాయెనే!
లంచ మే?తగను!లక్ష్యఛేద్య మేర్చెనే?
పంచ పాతకుల ధాటి కోర్వ జాలకన్!
చంచ లత్వమున జారె!సామ్య వాదమే?
లంఛ ధాటి వృత్తము,ర,న,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1467.
106మాయలోక వృత్తము,
పంత మూనగా స్వ బంధు వర్గ లెక్యయే?
సుంత మేలు నౌనె?స్వంత వాడు గానిచో?
మంతనంబు సంఖ్య!మాన మెంచ నీకయా?
ఎంత. కైన నెగ్గ! యేల లేదు ?సిగ్గిలన్!
మాయలొకవృత్తము,ర,జ,ర,జ,గ,గణములు,
యతి,7.,వ,యక్షరము,వృ,సం:-2781.
107.శివసామ్య వృత్తము,
వర ప్రజ్ఞ కిడు!వంధనంబె!నమకమ్!
వర సమ్మత భద్ర మేర్చు!శివతన్!
గురు భద్ర మది!గూర్చు టౌను!చమకమ్!
చరితం కురుత!సత్వరంబు!జగతిన్!
శివ సామ్య వృత్తము,స,న,ర,న,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృసం:-4092.
108.భువ నేశ్వరివృత్తము,
భూ మాత!మహిమ!భువనైక మోహమై!
ధీమంత యనగ!దివి తేజి!సృష్టియై!
సామాదు లలమి!జవమేర్చి!యార్పుచున్!
రామం బిడు తుది!రస రాజ్ఞి!జీవముల్!
భువ నేశ్వరి వృత్తము,త,న,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2793.
109వేద ప్రాశస్త్య వృత్తము,
వేద మపౌరుషేయమ్!విధి నిర్మాణితమ్!
సాధకమౌ?నమేయమ్!సద!సన్మోదమై!
మేథిని!శ్రీద మంబై!!పర మేర్చు న్సదా !
నాదము మోహనంబౌ!నరబోధామృతమ్!
వేద ప్రాశస్త్య వృత్తము,భ,ర,భ,త,గ,గణములు,
యతి,8.వ,యక్షరము,వృ,సం:-2455.
110.సృజించు,వృత్తము,
సృజియించి బ్రహ్మ!చెరిగించు జన్మమున్!
భుజ కీర్తి! కాల పురుషుండునొందగా!
త్యజి యించ మేను!తిరిగెంచు!జన్మకున్!
కు జనం బు చింతె?కొమ రారు!నీతిలన్!
కొమరారు=మజ్ఞత యొప్పు.కు జనంబు=భూజనము,
సృజించు వృత్తము,స,జ,స,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2797.
111.మెచ్చుకోలు వృత్తము,
మెచ్చెడి యా నోరే!మితిమీర ఘోషించున్!
చెచ్చెర యూహంతే?చితికించు బాంధవ్యమ్!
మచ్చుకు మాటెంచన్!మహి నొప్ప దేనాడున్?
పచ్చని సంసారమ్!పరికింప రా దెన్నన్!
మెచ్చు కోబు వృత్తము,భ,మ,స,య,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-811.
112.గుణరాజి వృత్తము,
రసగుణ రాజి రమ్యతర జీవమున్!
పసగల దీక్ష!భవ్యగుణ భాసమున్!
దిసె వెస కీర్తి!దివ్య వర ధ్యానమ్!
అసదృశ లీల!యార్యతిడు!నిబ్భువిన్!
గుణ రాజి వృత్తము,న,జ,భ,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2992.
113.శోభగా వృత్తము,
మెసగు దొసగు మెదవును భువినిన్!
నొసగు నెసగు నురుకిడు చెడుగున్!
వెస నెదుగుదు!విలువుగ!భవితన్
పసగల నర!వర శుభగ చరా!
శోభగా వృత్తము,న,న,న,స,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2048.
114.అణంచు వృత్త్తము,
అగ్ర వర్ణంబు ల నణంచు స్వేచ్ఛాయెనే!
వ్యగ్ర ధృగ్రోగము!వలంచెనో?భారతీ!
నిగ్ర హింపేలయ?నిరంత!సంరక్షకా!
ఆగ్రహంబేమయె?హరించవా?ద్రోహమున్!
అణంచు వృత్తము,ర.భ,జ,త,,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:2419.
115.శిలీముఖ వృత్తము,
భజగోవిందపు భక్తే! పరమంబీయున్!
నిజమే?గానని నీతే!తరింపేర్చునా?
వ్రజమే!మూలము!రాణింపే?భూతలినిన్!
సుజనాళి న్విడ!సోలేవు!దౌర్భాగ్యతన్!
శిలీముఖం=బాణము,వ్రజము=సమూహము,
శిలీముఖ వృత్తము,స,భ,త,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-2356.
116.సమతా మమత,వృత్తము,
స్వార్ధ త్యాజ్య మదే?సమత మమతయా!
అర్థ పాశ మదే!యరి బరి గురియౌ?
వ్యర్థ మేర్చు టదే?పర భవి చెరుపున్!
నిర్దయేల?నిలన్?నిగుడ దగునొకో?
సమత మమతా వృత్తము,ర,స,న,న,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-4003.
117.నెలవు వృత్తము,
సాటి బాగు!మేటి సమత మమతదే!
ఆట పట్టు గాదు!యనయ వినయమే!
పోటు మాట చేటు భువికి!చెడు పదే!
కోట పేట లాశ!కలల నెల వదే?
నెలవు వృత్తము,ర,జ,న,న,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-4065,
118.భూ యశా వృత్తము,
జనన మరణ జగతి తీరు సామ్యమ్!
.కనని కలత!కలుగ జేయ!పాపమ్
జనిత వినత!జనము మెచ్చు సాయమ్!
వినయ మొనర!విమలు డౌమ!నీతిన్!
భూయశా వృత్తము,న,న,భ,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం;-1536.
119.చెన్ను మీర.వృత్తము,
వెన్ను తట్టి లేపు!విమలమౌ!నీతదే?
చెన్ను మీర నొప్పు!చెలిమి దీపింపగన్!
కన్న వారి పట్ల కలత రా నీకుమా!
మిన్నునంటు కీర్తి మెలుగు నాకాంక్షివై!
చెన్ను మీర వృత్తము,ర,జ,న,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2539.
120.అమ్మ వృత్తము,
కొమ్మయే!మగువ!కుల పెంపు టింపునై!
అమ్మయై!విభవ మొదవంగ!సృష్టియై!
చిమ్ము శాంతి నిల!చివురించు మల్లెయై!
అమ్మ కీర్తి భువి వెలపెంచు! నీతినిన్!
అమ్మ వృత్తము,ర,న,స,జ,గ,గణములు,
యతి,7.యక్వషరము,వృ,సం:-2399.
121.దాతలేని యీవి వృత్తము,
తల్లి లేని జీవి దాత లేని యీవియే!
చెల్ల నట్టి మాట!చేటు వాట మేర్చదే?
విల్లు లేని యమ్ము!వేట కెట్లు?తోడ్పడున్!
కొల్ల లాశ మాని!కోలు కొమ్మ నీతినిన్!
దాత లేని యీవి వృత్తము,ర,జ,ర,జ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2731.
122.బీద చేరని వృత్తము,
వెన్ను దన్నై నిల్చు!వెంపలి తుప్ప లెల్లన్?
మిన్న దన్నై!బీద మించి రదేమొ?నేడున్!
కన్నతల్లీ!చూచి!కల్మష మడ్డు మమ్మా!
అన్న గొప్పే!యెంచి!యార్తి ఘటింతు వేలన్?
బీద చేరని వృత్తము,ర,త,భ,ర,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-1343.
123.చెలువంపు వృత్తము,
తులువలున్నచో?దివురునే?న్యాయమ్!
చెలువ మొందునే?సిరి పరార్థంబునౌ!
బలము తోడుతన్!వదల రేపాటినిన్!
కులము గొప్పలే?కువలయ మేలెలే!
చెలువంపు వృత్తము,న,ర,న,త,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2740.
124.చెలంగు వృత్తము,
చెలగను మంచి!చెడును వీడు మిలన్!
పలువుర బాగు!పరమ పావన మౌ!
తెలివికి నీతి తెరవు జూపు నయా!
కలిమిలి!మేలు కడకు నిల్చు సుమా!
చెలంగు వృత్తము,న,జ,న,భ,గ,గణములు,
యతి7.వ,యక్షరము,వృ,సం:-3558.
125.నీతి విడని వృత్తము, మం
నీమము మీరకు!నీతి దాటకు మిలన్
రామము నెంచుము!రమ్యతం గనన్!
క్షేమము గోరుమి!చిత్త ముత్తమం బదే!
సోమము సర్వద!సత్కళాన్వితం బయా!
నీతి విడని వృత్తము,భ,భ,ర,న,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2777.
126.కామిత ధర్మ వృత్తము,
కామిత ధర్మంబు,!కల్గించు!నీతదియే!
శ్రీ మత మేపార! శ్రేయంబు!జీవులకున్!
నీమము క్షేమంబు!నేర్మెంచ!శాంతిలులే!
భూమిని కీర్తిల్లు!బోధెంచి! మేల్గనుమా!
కామిత వృత్తము,భ,త,త,భ,గ,గణములు,
యతి,7.వ,యక్షరము,వృ,సం:-2367.
మంగళమ్ మహాత్.
శ్రీ శ్రీ ,శ్రీ,శ్రీ,శ్రీ,
[అతి జగతీ ఛందము నందు కొన్ని ఛందములు
గైకొన బడినవి].
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.