గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జూన్ 2022, శనివారం

నాహం ప్రకాశః సర్వస్య ..|| 7-25 || . వేదాహం సమతీతాని .. || 7-26 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్.

 || 7-25 ||

శ్లో.  నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః|

మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్.

తే.గీ.  యోగ మాయావృతుడనయి యున్న నేను

కనబడనుగ యందరికిని, కనగ లేదు

మూఢ లోకము నాశనము భువి లేని

వానిగా నన్ను, నర్జునా!  జ్ఞాన భాస!

భావము.

యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికి కనపడను. 

నన్ను ఈ మూఢ లోకం పుట్టుకా నాశనం లేనివాణ్ణిగా తెలుసుకో లేదు.

 || 7-26 ||

శ్లో.  వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున|

భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన.

తే.గీ.   నే నెరుంగుదును, గతించి, లేని వారి,

నున్నవారిని, జనియింప నున్నవారి

నిట్టి నన్నెరింగినవార లేరి జగము

న? నరుడ! కననే రిల నన్ను ఘనతరముగ.

భావము.

నేను గతించిన జీవులను, ఇప్పుడు ఉన్నవాళ్ళనూ, ముందు పుట్టబోయే 

వారినీ ఎరుగుదును. నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.