గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2022, బుధవారం

బహూనాం జన్మనామన్తే ..|| 7-19 || . కామైస్తైస్తైర్హృతజ్ఞానాః.. || 7-2o ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

జైశ్రీరామ్. 

|| 7-19 ||

శ్లో.  బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే|

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః.

తే.గీ. నరుడనేకజన్మల తుదిన్ జ్ఞాని యగుచు

సర్వమున్ వాసుదేవుడే శాశ్వితుడని,

నన్నె కొలుచును, భువిపైననెన్న నిట్టి

వారలరుదుగ నుందురు ప్రస్ఫుటముగ. 

భావము.

అనేక జన్మల తరువాత నరుడు జ్ఞాన వంతుడై సర్వమూ 

వాసుదేవుడని నన్ను కొలుస్తాడు.అలాంటి మహాత్ముడు చాలా 

అరుదుగా ఉంటాడు.

 || 7-20 ||

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేన్యదేవతాః|

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా.

తే.గీ. సహజమైన స్వభావాన సకలవాంఛ

లనిల దీర్చుకొనగ,  జ్ఞాన ఖని నశింప,

నితర దేవతలను గొల్చు క్షితిని జ్ఞాని,

నియమనిష్ఠలతోడను నిరుపమముగ.

భావము.

తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం 

హరించుకు పోగా ఆయా నియమాలని పాటిస్తూ వారు ఇతర 

దేవతలను ఆరాధిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.