గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జూన్ 2022, ఆదివారం

త్రిభిర్గుణమయైర్భావైరేభిః ..|| 7-13 || . దైవీ హ్యేషా గుణమయీ మమ.. || 7-14 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్.

|| 7-13 ||

శ్లో‌.   త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్|

మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్.

తే.గీ.  త్రిగుణపూర్ణ భావాళిచే బ్రగణితముగ

భ్రాంతిలో బడి లోకము ప్రస్ఫుటముగ

వీటికన్ననతీతమై వెలుగుచున్న

నవ్యయుండగు నన్నువా రరయబోరు.

భావము.

మూడుగుణాలతో నిండి ఉన్న ఈభావాల చేత ప్రపంచం యావత్తూ 

బ్రాంతిలో పడి, వీటికన్నా అతీతమూ, అవ్యయమూ అయిన 

నన్ను గుర్తించలేదు .

 || 7-14 ||

శ్లో.  దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే.

తే.గీ.  భువిని త్రిగుణాన్వితపు మాయ నెవడుదాటు?

నేను సృష్టించితిని దీని నెనరున నను

నెవరు సేవింతురో వారు నేర్పు మీర

దాట గలుగుదు రీ మాయ, తత్వమరసి. 

భావము.

దివ్యమైన, త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాట రానిది. 

ఎవరు నన్నే  సేవిస్తారో వారు ఈ మాయని దాట గలరు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.