గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2022, శుక్రవారం

శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా శక్తిస్వరూపులగు భక్తపాళికి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.


శ్రీ శంకరభగవత్పాదులు.

శ్రీమన్మంగళపార్వతీశుకృపచే శ్రీపార్వతీ సత్ కృపన్ 

శ్రీమచ్ఛంకరులంది, తత్ఫలముచే చిన్మార్గ సద్భావనన్

శ్రీమాతన్ బరమేశ్వరున్ గొలుచుచున్ జిజ్ఞాసతో శ్లోకముల్

క్షేమంబున్ జనపాళికిన్ గొలుప, భాసింపంగ వ్రాసెన్ గృపన్..


అట్టి మహాత్ముడమ్మకృపనంది యనేక విశిష్ట సత్ కృతుల్

పట్టుగ భక్తియుక్తుఁడయి భావమహద్ద్యుతి నొప్ప వ్రాసి, జై

కొట్టగ భక్తపాళి కడు కూర్మిని జాతికొసంగినాడు, నే

డిట్టిమహాత్ము జన్మదినమిత్తరిసేమము మీ౩ కొసంగుతన్.


అమృతము పారజేసె కవితామృతమొల్కుచు భక్తిపెంచగన్,

ప్రముదము గొల్పు తత్పరత వర్ధిలజేసెను శ్లోకధారలన్,

సమధిక దైవచింతనము చక్కగ పెంచె జనాళిలోన,  దే

శము కడు ధన్యమాయె మన శంకరజన్మముచేత ధాత్రిపై.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.