గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మే 2022, మంగళవారం

శక్నోతీహైవ యః సోఢుం...|| 5-23 ||..//..యోऽన్తఃసుఖోऽన్తరారామ..|| 5-24 ||..//.. కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 5-23 ||

శ్లో.  శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః.

తే.గీ.  దేహ జనిత కామాదుల దేల కెవ్వ

డవని నెదిరించి నిలుచునో యతడే యోగి,

అతడె సుఖమును పొందునో యగణిత గుణ!

ముక్తిక్తి గైకొంట కద్దియే ముఖ్యపథము.

భావము.

ఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన 

ప్రేరణలని తట్టుకోవడానికి సమర్ధుడౌతాడొ, అతడే యోగి, 

అతడే సుఖవంతుడు ఔతాడు.

|| 5-24 ||

శ్లో. యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః|

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి.

తే.గీ.  ఎవ్వ డాత్మలో నానంద మెన్నుచు గను

నాత్మలో జ్ఞాన సజ్జ్యోతి ననవరతము

నిలుకొనునాతడే యోగి, తలచిచూడ

నతడె బ్రహ్మమై మోక్షంబు ననుభవించు.

భావము.

ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ 

తనలో నే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై 

మోక్షాన్ని పొందుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.