గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మే 2022, గురువారం

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య.|| 6-11 ||..//.. తత్రైకాగ్రం మనః కృత్వా..|| 6-12 ||..కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 6-11 || 

శ్లో.  శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |

నాత్యుచ్ఛ్రిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 

తే.గీ. ధరణి సమతలమందున దర్భగడ్డి

పరచి దానిపై చర్మమున్ బరచి దాని

పైన వస్త్రమ్ము పరచియు, దాని పైన

స్థిరముగాకూర్చొని తపము సేయ వలయు.

భావము.

ఎక్కువ ఎత్తూ పల్లమూ కాని పరిశుద్ధమైన ప్రదేశంలో దర్భలు పరచి, 

దానిమీద చర్మమూ, ఆపైన వస్త్రమూ వేసి తన స్థిరమైన ఆసనాన్ని 

ఏర్పరచుకోవాలి.

|| 6-12 || 

శ్లో.  తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |

ఉపవిశ్యాసనే యుంజ్యాత్, యోగమాత్మవిశుద్ధయే || 

తే.గీ.  ఆసనముపైన గూర్చుండి, ధ్యాసనిలిపి,

యింద్రియములను, మనసునో యింద్రసముడ!

వశ పరచుకొని, మదినిల్పి, నిశలు నహము

లాత్మ శుద్ధికై యోగిగా నగుట తగును.

భావము.

ఆ ఆసనంమీద కూర్చుని, ఇంద్రియాలనూ మనస్సునూ స్వాధీన 

పరచుకుని, ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ధికోసం యోగాభ్యాసం చేయాలి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.