గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2022, మంగళవారం

సుఖమాత్యన్తికం యత్తద్ .|| 6-21 ||..//.. యం లబ్ధ్వా చాపరం లాభం..|| 6-22 ||..కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 6-21 ||

శ్లో.  సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్|

వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః.

తే.గీ.  ఏది బుద్ధితో దెలియనౌ నేది యింద్రి

యములకు నతీతమైనట్టి, దంతు లేని

దేది యాసుఖమును యోగి యెచ్చటుండి

యనుభవించుచును చలింప డరయు మయ్య.

భావము.

ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోతగినదో, ఇంద్రియాలకు అతీతమో, 

అంతంలేనిదో, ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ, ఆ 

నుభవాన్నుంచి చలించకుండా ఉంటాడో,

|| 6-22 ||

శ్లో.  యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః|

యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే.

తే.గీ.  ఏది పొందిన యోగి తా నితరమయిన

దేది పొందినన్ ఘనముగా నెంచకుండు,

ననుభవించుచునుగణింప డనుపమముగ

దేనియందుండుటన్, యోగి తానె పార్థ!

భావము.

దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే 

ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖంచేతకూడా 

చలించడో, అతడే నిజమైన యోగి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.