గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మే 2022, మంగళవారం

జితాత్మనః ప్రశాంతస్య.|| 6-7 ||..//.. సుహృన్మిత్రార్యుదాసీన..|| 6-8 ||..కర్మసన్యాస యోగము.

జైశ్రీరామ్.

 || 6-7 || 

శ్లో.  జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః || 

తే.గీ.  ఆత్మనుజయించు నతడే ప్రశాంతచిత్తు

డాతనికిదైవథర్శనమనవరతము

కలిగి, శీతోష్ణ సుఖదుఃఖములును మాన

ము నవమానమునొకటిగకనగలుగును.

భావము.

ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం 

పొందుతూ శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలపట్ల సమభావం 

కలుగుచుండును.

|| 6-8 || 

శ్లో.  జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః || 

తే‌.గీ. జ్ఞాన విజ్ఞాన తృప్తుడు ఘనుడు నిర్వి

కారుడును జితేంద్రియుడును, కను నతండు

స్వర్ణమును మట్టి రాతిని సరిగ నొకటి

గ యతిగ నతనిచెప్పనౌన్ ఘనుడ! పార్థ!

భావము.

శాస్త్రజ్ఞానంవల్ల, అనుభవజ్ఞానంవల్ల సంతృప్తి చెందినవాడు, 

నిర్వికారుడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టినీ రాతినీ 

బంగారాన్నీ సమదృష్టితో చూసేవాడూ యోగి అని చెప్పబడుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.