గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మే 2022, గురువారం

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాం.|| 5-27 ||..//.. యతేన్ద్రియమనోబుద్ధిర్ము..|| 5-28 ||..//.. కర్మసన్యాస యోగము.

జైశ్రీరామ్.

|| 5-27 ||

శ్లో.  స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః|

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ.

తే.గీ.  ఇలను బాహ్యేంద్రియానుభూతులను గొనక

నెట్టివేయుచు భృకుటిపై పెట్టి ధ్యాస

తలచ వలయు ప్రాణాపానములను సమము

గా మదిని జూడ వలయును, కనుమటులనె.

భావము.

శబ్దస్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే 

నెట్టివేసి, ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, నాసికారంధ్రాల ద్వారా 

చలిస్తున్న ప్రాణ, అపాన వాయువులను సమానంగా చూడాలి.

|| 5-28 ||

శ్లో.  యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః|

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః.

తే.గీ.  ఇంద్రియంబుల్మనోబుద్ధులిలగ్రహించి

మోక్షమే లక్ష్యముగ గల్గి, పూర్తిగాను

కోపమున్ భయమును వీడి కోరికలిక

లేని ఋషియే గనన్ ముక్తు డెరుగు పార్థ!

భావము.

ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యంగా 

పెట్టుకుని కోరికలను, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ 

ముక్తుడే..

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.