గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మే 2022, గురువారం

శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా .|| 6-25 ||..//.. యతో యతో నిశ్చరతి..|| 6-26 ||..కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 6-25 ||

శ్లో.  శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా|

ఆత్మసంస్థం మనః కృత్వా న కిఞ్చిదపి చిన్తయేత్.

తే.గీ.  ధైర్యమును కల్గు బుద్ధితో తప్పకుండ 

నెమ్మదిగ మనసును శాంతిని నిలుప వలె,

మనసునాత్మలో నిలిపుచు ననితరముగ,

తలపరాదితరంబింక ధర్మవర్తి!

భావము.

ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని

(బాహ్య ప్రపంచమునుండి మళ్ళించి)శాంతింప చేయాలి. 

మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.

|| 6-26 ||

యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్|

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్.

తే.గీ. చంచలంబగు చిత్తంబు నెంచి యెచటి

కేగినన్ గాని మరలించి వేగిరముగ

నాత్మలో నిల్పవలెనుసమంచితముగ

పార్థ గ్రహియింపుమియ్యది స్వార్థమువిడి.

భావము.

నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, 

అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.