గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2022, మంగళవారం

అసంశయం మహాబాహో .|| 6-35 ||..//.. అసంయతాత్మనా యోగో ..|| 6-36 ||.....కర్మసన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 6-35 ||

శ్లో.  అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్|

అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే.

తే.గీ.  అవును, చంచల చిత్తము నణచ లేము,

నిగ్రహించుట కష్టము, నిరుపమాన!

పార్థ! సాధన చేతను భవ్యమయిన

దివ్య వైరాగ్య భావనన్ దీని నణచు.

భావము.

సందేహం లేదు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అది 

చలిస్తుంది. అయితే కుంతీ కుమారా! అభ్యాసం చేతా వైరాగ్యం ద్వారా

నూ మనోనిగ్రహం సాధ్యం ఔతుంది.

|| 6-36 ||

శ్లో.  అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః|

వశ్యాత్మనా తు యతతా శక్యోऽవాప్తుముపాయతః.

తే.గీ. మనసు స్వాధీనమున లేని మనుజున కిల

పొంద నసాధ్యంబు యోగము, పొంద గలడు

మనసు స్వాధీనమున గల మహితు డిద్ది

యత్నమును చేసి యోచించి హాయిగాను. 

భావము.

మనస్సు స్వాధీనంలో లేని వాడికి యోగం పొందడం కష్టమని నా 

అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో 

సాధించ వచ్చును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.