గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మే 2022, ఆదివారం

ఆరురుక్షోర్మునేర్యోగం.|| 6-3 ||..//.. యదా హి నేంద్రియార్థేషు..|| 6-4 ||..కర్మసన్యాస యోగము.

జైశ్రీరామ్.

 || 6-3 ||

శ్లో.  ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే|

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే.

తే.గీ.  ధ్యాన యోగ సాధకునకు తలచి చూడ

నిత్య నిష్కామకర్మమే నిరుపమ గతి,

యోగ సిద్ధునకిలపైన నొప్పిదముగ

మహిని గాంచ కర్మత్యాగ మార్గమొప్పు.

భావము:

ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. 

యోగసిద్ధి పొందినవాడికి కర్మత్యాగమే సాధనం.

|| 6-4 || 

శ్లో. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |

సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే.

తే.గీ.  విషయ కర్మములపయిని ప్రీతి లేక

సకల సంకల్పముల్ వీడు సన్నుతు నిల

ననితరమగు యోగారూఢు డందురరయ,

తెలియుమర్జునా నిజమిది, తెలియవలయు.

భావము.

ఇంద్రియ విషయాలమీద కాని, కర్మలమీద కాని ఆసక్తి లేకుండా 

సంకల్పాలన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడంటారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.