గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2022, ఆదివారం

శ్రీ శుభకృన్నామ వత్సర ఉగాది సందర్భముగా బీ.హె.చ్యీ.యల్.లో జరిగిన కవిసమ్మేలన చిత్ర మాలిక.

 

జైశ్రీరామ్.
తే.02.4.2022 న
శ్రీ శుభకృన్నామ వత్సర ఉగాది సందర్భముగా బీ.హె.చ్యీ.యల్.లో జరిగిన కవిసమ్మేలన చిత్ర మాలిక.

శ్రీరస్తు....శుభమస్తు....ఽవిఘ్నమస్తు.
శ్రీమన్మంగళ శుభకృన్నామ వత్సర ఉగాది పర్వదినము సందర్భముగా అందరికె శుభాకాంక్షలు.
శ్రీ
శుభకృన్నామక వత్సరాది ప్రజలన్ శోభాయమానంబుగా 
నభయంబిచ్చి వెలుంగఁ జేయుఁ గృపతో నత్యంత ప్రీతాత్మయై,
శుభ సంకేతపు నామధారికద యీ శోభకృ దాద్యంతమున్,
విభవంబొప్పఁగ వెల్గుఁ గాత ప్రజ, దేవీపార్వతీ సత్కృపన్,

కం. బీహెచ్యీయెల్ల్ ప్రజలకు
మాహేశ్వరి కృపలభించి మంచిగ జరుగున్.
స్నేహోద్భాస జనావళి
మోహాదుల నధిగమించి పూజితులగుతన్.

వచ్చె వసంత లక్ష్మి, వరభావ స్మృద్ధిని గొల్పి చూపగాన్,
మెచ్చగ సత్కవీశ్వరులు మేలగు జీవన మార్హమీయగా, 
సచ్చరితాత్ములన్ గనుచు చక్కగ కావగ నెల్ల వేళలన్,
సచ్చరితంబుతో జనులు చక్కగ మెల్గుచు శోభగాంచెడిన్.  

జ్ఞానాబ్ధియౌ శుభకృ తానంద వత్సరము దీనాళి కల్పతరువై
జ్ఞానంబు, సద్ధనము, రాణింపు గొల్పుచు నిధానంబుగా నిలుచుతన్,
ప్రాణంబుగా కనుచు తా నీడగా నిలిచి, మానాభిమాన ధనముల్
క్షోణిన్ కృపన్ గొలిపి, ప్రణంబులన్ నిలుపు, నీనాటి నుండియు నిఁకన్ 

వర మంగళ భావన భాగ్యముతో
నిరతంబు పరాత్పరి నిల్పు ప్రజన్,
కరు ణాకరమౌ శుభ కాల గతిన్
మురిపించుచు మంగళముల్గొలుపున్..
స్వస్తి.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.