గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2022, ఆదివారం

కర్మణో హ్యపి బోద్ధవ్యం..|| 4-17 ||..//..కర్మణ్యకర్మ యః పశ్యేద..|| 4-18 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః.

 జైశ్రీరామ్.

 జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-17 ||

శ్లో. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః|

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః

తే.గీ. 

కర్మలను గూర్చెరుగవలె, కర్మలను వి

కర్మలను నకర్మలను ప్రగణితముగను

తెలుసుకొన వలె నర్జునా!తెలియ నవదు

కర్మల స్వభావ నిగూఢ ఘనత భువిని.

భావము.

కర్మల గురించి తెలుసుకొనవలెను. వికర్మల అకర్మల గురించి కూడా తెలుసు

కొనవలెను. కర్మల యొక్క స్వభావము చాలా నిగూఢమైనది.

|| 4-18 ||

శ్లో. కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః|

స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్.

తే.గీ. కర్మలనకర్మను నకర్మ గర్మమునను

గాంచువాడె బుధుండిలన్, గాంచ యోగి

యతడు, కర్మ చేసిన ఘనుం డరయ భువిని,

యనుచునర్జునుతోకృష్ణు డనియె తెలియ.

భావము.

కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో 

అందరికంటే బుద్ధిమంతుడు. అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసి

వాడవుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.