గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2022, ఆదివారం

యజ్ఞశిష్టామృత భుజో యాన్తి.. || 4-31 ||..//..ఏవం బహువిధా యజ్ఞా వితతా..|| 4-32 ||..//...జ్ఞాన కర్మ సన్యాస యోగము.

జైశ్రీరామ్. 

  || 4-31 ||

శ్లో. యజ్ఞశిష్టామృత భుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్|

నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోऽన్యః కురుసత్తమ.

తే.గీ. యజ్ఞ శేషాన్నమమృతమో యర్జునుండ! 

యజ్ఞ దూరుల కిహమె లే దరసి చూడ

పర మదెట్టులబ్బును కనన్ పార్థ!, నిజము.

యజ్ఞములు చేయవలయునేమైనకాని.

భావము.

అర్జునా! యజ్ఞమున సమర్పించగా మిగిలిన ఆహారం అమృతము. యజ్ఞము 

చేయని వారికి ఈ లోకమేలేదు, పరలోకమెక్కడ?

|| 4-32 ||

శ్లో. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|

కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే.

తే.గీ. ఈ విధంబుగ యజ్ఞము లెన్నియో వి

ధములు వేదముల్  వివరించె, ధరను కర్మ

జనితముల్ కను, వరముక్తి కను మ దెరిగి,

నిజమెరుంగుమోయర్జునా విజయము గన.

భావము.

ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి. అవి 

అన్నీ కర్మల వలన జనిస్తాయని తెలుసుకో. ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.