గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఏప్రిల్ 2022, గురువారం

శ్లో. దైవమేవాపరే యజ్ఞం ..|| 4-25 ||..//..శ్లో. శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే.. || 4-26 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

జైశ్రీరామ్.

|| 4-25 ||

శ్లో. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే|

బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి.

తే.గీ. దైవ యజ్ఞమున్ కొందరు ధరణి జేయు,

బ్రహ్మ మన నగ్ని కర్పిత బ్రహ్మలగుదు

రిలను కొందరీ యజ్ఞమున్ సలలితముగ,

నాత్మ సుజ్ఞాని కర్థమౌ నరయు మీవు.

భావము.

కొందరు యోగులు దైవ యజ్ఞాన్నే చక్కగా చేస్తారు. కొందరు బ్రహ్మమనే 

అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని (తనలోని జీవభావాన్ని) అర్పిస్తారు.

 || 4-26 ||

శ్లో. శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి|

శబ్దాదీన్విషయానన్య ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి.

తే.గీ. నిగ్ర హాగ్నిలో వేల్త్రు సమగ్రముగను 

కొందరు శ్రవణాదీంద్రియాల్, కొంద రింద్రి

యాగ్నిలోవేల్తురు శ్రవణమాదిగ గల

తృష్ణలన్, దీర్చుకొనుటకు, తెలివి మాలి.

భావము.

శ్రవణం మొదలైన ఇంద్రియాలను కొందరు నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు. 

మరి కొందరు ఇంద్రియము అనే అగ్నిలో శబ్ధాది విషయాలను వేల్చుతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.