గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఏప్రిల్ 2022, శనివారం

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ..|| 4-15 ||..//..కిం కర్మ కిమకర్మేతి కవయో..|| 4-16 ||..//..జ్ఞాన కర్మ సన్యాసయోగః

 జైశ్రీరామ్.

జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-15 ||

శ్లో. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|

కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్.

తే.గీ. కర్మమొనరింప బడెను సకలమునరిగి,

పూర్వమున ముముక్షువులచే పూర్తిగా, మ

రటులె నిష్కామ కర్మంబు నరసి చేయు

మర్జునా! యంచు శ్రీకృష్ణుడనియె తెలియ.

భావము.

ఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షువుల చేత కర్మ చేయబడినది.అందు 

వలన పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయి.

|| 4-16 ||

శ్లో. కిం కర్మ కిమకర్మేతి కవయోऽప్యత్ర మోహితాః|

తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్.

తే.గీ. ఏది కర్మయగు నకర్మ యేది యగు న

నుచు ఋషులును భ్రాంతులగుటను తెలియవలె,

నీ వశుభము నుండి విముక్తి నియతి నెరుగ

దెల్పెదను నీకు దాని ననల్ప సుగుణ!

భావము.

కర్మ ఏది అకర్మ ఏది అనెడి విషయములో ఋషులు సహితము భ్రాంతిలో 

పడుదురు. దేనిని  తెలుసుకొనిన నీవు అశుభము నుండి విముక్తి పొందుదువో 

ఆ కర్మ విషయము నీకు చెప్పెదను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.